Yadadri Crime: రోజురోజుకూ మానవ సంబంధాలు మంటగలుస్తున్నాయి. అగ్నిసాక్షిగా తాళి కట్టిన భర్తలను దారుణంగా చంపేస్తున్నారు భార్యలు. కేవలం వివాహేతర సంబంధం కోసం నిండు నూరేళ్లు బతకాల్సినవారి జీవితాలు అర్థాంతరంగా ఈ లోకాన్ని విడిచిపెడుతున్నారు. తాజాగా యాదాద్రి భువనగిరి జిల్లాలో చోటు చేసుకుంది. కోరుకున్న ప్రియుడి కోసం భర్తను సుఫారీ గ్యాంగ్‌తో హత్య చేయించింది కట్టుకున్న భార్య.
యాదాద్రి భువనగిరి జిల్లాలో ఈ ఘటన వెలుగుచూసింది. తొలుత రోడ్డు ప్రమాదంతో నమోదైన కేసు చివరకు ప్రేమ వ్యవహారమే కారణమని తేలింది. సోమవారం యాదాద్రి జిల్లా కాటేపల్లి పరిసర ప్రాంతాల్లో రోడ్డు ప్రమాదం జరిగింది. టూ వీలర్‌ని కారు ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఓ వ్యక్తి స్పాట్‌లో మృత్యువాతపడ్డాడు.
మృతుడిని స్వామిగా గుర్తించారు పోలీసులు. ఘటన గురించి తెలియగానే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. రోడ్డు ప్రమాదంగా భావించి కేసు నమోదు చేశారు. కారు నెంబరు ఆధారంగా విచారణ చేపట్టారు పోలీసులు. కావాలనే కారుతో బైక్‌ని ఢీ కొట్టి హత్య చేశారనే నిర్ఱారణకు వచ్చారు. దీంతో పోలీసుల అటెక్షన్ మొత్తం ఈ కేసుపైకి మళ్లింది.
దీనిపై లోతుగా విచారణ చేపట్టారు పోలీసులు. స్వామి హత్యకు ప్రధాన కారణం భార్య వివాహేతర సంబంధమని తేలింది. ప్రియుడితో కలిసి భర్తను హత్య ప్లాన్ చేసినట్లు తేల్చారు. స్వామి భార్యని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.విచారణలో కీలక విషయాలు బయటపెట్టింది ఆమె.
ALSO READ: స్కూల్ బాలికపై లైంగిక దాడి, యువకుడ్ని కొట్టి చంపేశారు
ఈ హత్యలో ఆమె తమ్ముడు ప్రమేయం ఉన్నట్లు గుర్తించారు. హత్యకు కారణమైన ఇద్దరు సుపారీ కిల్లర్లను అదుపులోకి తీసుకున్నారు. వివాహేతర సంబంధం కోసం పాకులాపడిన భార్య, భర్తను ఈ విధంగా చంపేయడంపై స్థానికులను దిగ్భ్రాంతికి గురిచేసింది.