Intinti Ramayanam Today Episode july 2nd: పల్లవి శ్రీయాని రెచ్చగొడుతుంది అప్పుడే శ్రీకర్ కమల్ అక్షయ్ లోపలికి రావడం చూసి పల్లవి పక్కకు తప్పుకుంటుంది.. శ్రీకర్ ను చూసిన శ్రేయ కన్నీళ్లు పెట్టుకుంటుంది.. మన బిడ్డ బతకడు అని చెప్పడానికి వచ్చారా. మన బిడ్డకి ఏమన్నా అయ్యింది అంటే దానికి కారణం అవనినే అని కన్నీళ్లు పెట్టుకుంటుంది.. నా బిడ్డ చనిపోతుందా అని తను బాధపడుతుంటే మిగిలిన వాళ్ళందరూ షాక్ అయ్యి చూస్తారు.. ఎందుకలా మాట్లాడుతున్నావు అని అందరూ అడుగుతారు కానీ తాను మాత్రం తన బిడ్డ కోసం బాధపడుతూనే ఉంటుంది.. అసలు నీకు ఈ విషయం ఎవరు చెప్పారు అని శ్రీకర్ అడుగుతాడు..
తన బిడ్డని అవని చంపాలని అనుకుందని శ్రేయ బాధ పడిపోతూ ఉంటుంది.. ఆస్తి కోసమే తన బిడ్డని చంపేసి ఆస్తి మొత్తాన్ని తానే తీసుకోవాలని అనుకుంటుందని శ్రీయ శ్రీకర్తో చెప్పి కన్నీళ్లు పెట్టుకుంటుంది.. ఆ మాట శ్రీకర్ ఒక్కసారిగా షాక్ అవుతాడు.. మా వదిన ఎందుకు బిడ్డని చంపాలి అనుకుంటుంది నువ్వు ఇప్పటికి తనని అపార్థం చేసుకుంటూనే ఉన్నావు అని శ్రీకర్ ఎంతగా చెప్పాలని ప్రయత్నించినా కూడా తాను మాత్రం బిడ్డని కోల్పోతున్నానని బాధపడిపోతూ ఉంటుంది.. అప్పుడే అక్కడికి వచ్చిన డాక్టర్ బిడ్డకి ఇప్పుడు ఏ ప్రమాదం లేదు అని చెప్పగానే శ్రీయ సంతోషపడుతుంది.. అసలు ఇదేంటి చనిపోతాడు అనుకున్న బిడ్డ మళ్లీ బతకడం ఏంటి ఇదొక మిరాకిల్ లో ఉంది అని అందరూ అనుకుంటారు. పల్లవి మాత్రం డాక్టర్ చెప్పిన మాట విని దిమ్మతిరిగిపోయేలా షాక్ అవుతుంది.. ఈ డాక్టర్లు దేవుడు నా బిడ్డను కాపాడలేదు కేవలం అవని వదినే కాపాడింది అని అసలు నిజాన్ని బయటపెడతాడు శ్రీకర్.. అవని వదినే ఇదంతా చేసింది అని శ్రీకర్ చెప్పగానే శ్రీయ కన్నీళ్లు పెట్టుకుంటుంది.
శ్రీకర్ నిజం చెప్పగానే పల్లవి నేను ఎప్పుడైతే అవని విలన్ లాగా చూపించాలి అనుకుంటాను అప్పుడే తాను ఒక దేవతలాగా మారిపోతుంది అసలు నా ప్లాన్ ఎందుకు ఇంత దారుణంగా ఫెయిల్ అవుతుంది అని చాలా బాధపడిపోతూ ఉంటుంది. అవని దగ్గరికి వెళ్లిన శ్రీయ తన కన్నీళ్ళతో అవని పాదాలను కడుగుతుంది.. నువ్వు ఇప్పటివరకు నా బిడ్డను చంపాలని అనుకున్నవని అనుకున్నాను.. ఆ బిడ్డను కాపాడిన దేవత నువ్వే అని తెలియక నేను అపార్థం చేసుకున్నాను అక్క నన్ను క్షమించు అంటూ శ్రేయ తన కన్నీళ్ళతో కాళ్లు కడుగుతుంది.. శ్రేయ బాధని చూసి మిగిలిన వాళ్ళందరూ కూడా అవని చాలా గొప్పది అని అనుకుంటారు. నాకు బిడ్డ క్షేమంగా ఉన్నాడన్న వార్త మాత్రమే సంతోషాన్ని ఇస్తుంది అని అవని ఆ మాట అనగానే శ్రేయ కన్నీళ్లు పెట్టుకుంటుంది.. నేను ఎప్పుడూ ఏది చేయాలనుకున్న సరే ఈ అవ్వని ఏదో ఒకటి చేసి తాను మాత్రం దేవతలాగా మారిపోతుంది అని పల్లవి ఫీల్ అవుతూ ఉంటుంది..
అసలు ఏం జరిగింది రా ఎందుకు? ఇప్పుడు సడన్గా సర్జరీ చేశారు… అవని కనీసం నాకు కూడా చెప్పకుండా తను కిడ్నీ డొనేట్ చేయడానికి ఒప్పుకుంది అని అక్షయ్ అడుగుతాడు.. డాక్టర్ మమల్ని లోపలికి పిలిచి బాబు పరిస్థితి ఎలా ఉంది అని చెప్పగానే మేము ఒక్కసారిగా షాక్ అయిపోయాము.. అయితే నా బిడ్డను కాపాడుకునేందుకు నేను చాలా ప్రయత్నాలు చేశాను. కానీ డాక్టర్ కూడా నేను ఏమి చేయలేను అని చెప్పగానే నేను నాలో నేను లేను అని శ్రీకర్ అంటాడు. అప్పుడు అవని వదిన నేను కిడ్నీని డొనేట్ చేస్తాను అని ముందుకు వచ్చింది.. ఈరోజు నా బిడ్డ బతికాడు అంటే దానికి కారణం మా అవని వదిన పెట్టిన బిక్ష అని శ్రీకర్ కన్నీళ్లు పెట్టుకుంటాడు.. నిజంగా అవని వదిన ఎంత గ్రేట్ కదా అని కమల్ తనని పొగిడేస్తూ ఉంటాడు..
పార్వతి భానుమతి ఇద్దరు కూడా శ్రేయ కి బాబు పుట్టాడని తెలుసుకొని సంతోషంగా ఉన్నా కూడా.. తనకి అనారోగ్య సమస్య ఉంది అని చెప్పగానే కాళ్లు చేతులు ఆడడం లేదు అని కంగారు పడిపోతూ ఉంటారు.. బాబుకి ఎలా ఉందో అసలు ఆశ్రియా పరిస్థితి ఎలా ఉందో అని భానుమతి కంగారు పడిపోతూ ఉంటుంది.. అప్పుడే ఇంట్లోకి వచ్చిన కమల్.. బాబు పరిస్థితి మొదట బాగోలేదని అన్నారు.. కానీ అవని వదిన తన కిడ్నీని డొనేట్ చేసి దేవతగా మారిపోయింది అమ్మ నిజంగానే తను చాలా గ్రేట్ అని కమల్ చెప్పగానే ఇంట్లోని వాళ్ళందరూ కూడా అవని చాలా గ్రేట్ అని పొగిడిస్తూ ఉంటారు.. అది విన్న పల్లవి కోపంతో లోపలికి వెళ్ళిపోతుంది.. పల్లవి కూడా పూర్తిగా మారిపోతే బాగుంటుంది అని మీనాక్షి కూడా అంటుంది. అయితే శ్రియ అవని ఇద్దరూ కలిసిపోయారు అని పార్వతి చాలా సంతోషంగా ఉంటుంది.. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..
Also Read :‘ఇల్లు ఇల్లాలు పిల్లలు’ టీఆర్పీ రేటింగ్.. జూన్ నెల హైలెట్స్..