E-Paper
Advertisement

Bigg Boss Telugu 10: ఇదేంట్రా నాయనా.. కంటెస్టెంట్స్ కు ఒక్కరోజుకు లక్షల్లో రెమ్యూనరేషనా?

Bigg Boss Telugu 10: ఇదేంట్రా నాయనా.. కంటెస్టెంట్స్ కు ఒక్కరోజుకు లక్షల్లో రెమ్యూనరేషనా?
Advertisement

Bigg Boss Telugu 10: తెలుగు బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న టాప్ రియాలిటీ షో అంటే టక్కున గుర్తుచే పేరు బిగ్ బాస్.. గత తొమ్మిది సీజన్లు జనాలని ఎంటర్టైన్ చేసిన ఈ బిగ్ బాస్ మరి కొద్ది రోజుల్లోనే సీజన్ 10 కూడా ప్రారంభం కాబోతుంది.. గత సీజన్లో అగ్నిపరీక్ష ద్వారా కామనసుని ఎక్కువగా తీసుకున్న యాజమాన్యం ఈసారి కూడా అగ్నిపరీక్ష ద్వారా సెలెక్ట్ అయిన వాళ్ళని హౌస్ లోకి తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తుంది. ఈసారి అగ్నిపరీక్ష 2కి వచ్చిన కంటెస్టెంట్స్ ఎమోషనల్ గా అందర్నీ కనెక్ట్ ఎలా చేస్తున్నారు.. అయితే ఈసారి కామనర్స్ గా హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్న వాళ్ళకి రెమ్యూనరేషన్ ఎంత ఇచ్చే అవకాశాలు ఉంటాయి అని, సోషల్ మీడియాలో ఒక పెద్ద చర్చ జరుగుతుంది. నిజానికి కామనర్స్ గా హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్న వాళ్లకి ఎంత రెమ్యూనరేషన్ ఇస్తారు అన్నది ఇప్పుడు మనం కాస్త వివరంగా తెలుసుకుందాం..

కామనర్స్ కు రెమ్యూనరేషన్ పెంచారా..?

బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న రియాల్టీ షో బిగ్ బాస్ సెప్టెంబర్ 6న ఈ ఏడాది ప్రారంభం కాబోతున్న విషయం అందరికీ తెలిసిందే. ఇప్పటికే ఈ సీజన్ పై ఒక బజ్ క్రియేట్ అవుతుంది. బిగ్ బాస్ సీజన్ 10 కు సంబంధించిన ప్రోమోని రిలీజ్ చేశారు. త్వరలోనే బిగ్ బాస్ సీజన్ ప్రారంభం కాబోతుంది అంటూ వచ్చిన ప్రోమో ప్రేక్షకుల్లో ఆసక్తిని నెలకొల్పింది. ఈ షో ఎప్పుడెప్పుడు ప్రారంభమవుతుందని అభిమానులు కూడా ఈగరగా వెయిట్ చేస్తున్నారు. రీసెంట్ గా ఆగస్టు 15 నుంచి బిగ్ బాస్ అగ్నిపరీక్ష 2 ప్రారంభమైన విషయం తెలిసిందే. గత సీజన్ తో పోలిస్తే ఈ సీజన్లో కంటెస్టెంట్లుగా వచ్చిన వాళ్ళు చాలామంది ఎమోషనల్ గా జనాలని కట్టిపడేసారు. ఇక ఈసారి కామనర్స్ గా బిగ్ బాస్ లోకి అడుగుపెడుతున్న వాళ్ళకి రెమ్యూనరేషన్ కూడా ఎక్కువే అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.. ఒక్క రోజుకు దాదాపు ఒక్కొక్కరికి 60 వేల వరకు ఉంటుంది అని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ లెక్కను చూస్తే ఈసారి కామనర్స్ గా అడుగుపెట్టే వాళ్ళకి కాస్త ఎక్కువగానే బిగ్ బాస్ ఇస్తున్నట్లు తెలుస్తుంది. మరి హౌస్ లోకి ఎవరు ఎంట్రీ ఇస్తారు అన్నది ప్రస్తుతం సస్పెన్స్ గా మారింది.

బిగ్ బాస్ లోకి సీరియల్ యాక్టర్స్..

Advertisement

బిగ్ బాస్ లోకి ఈ ఏడాది సీరియల్ యాక్టర్లు కూడా ఎక్కువగానే ఉన్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.. ముఖ్యంగా స్టార్ మా లో ప్రసారమవుతున్న పలు సీరియస్లలో హీరోయిన్లుగా నటించిన వాళ్లు కూడా ఈ ఏడాది సీజన్ లో పాల్గొనబోతున్నారని సమాచారం.. అందులో ఈమధ్య ఎక్కువగా వినిపిస్తున్న పేరు పొదరిల్లు సీరియల్ హీరోయిన్ మహాలక్ష్మి, అలాగే గుండె నిండా గుడి గంటలు సీరియల్ హీరో బాలు పేర్లు వినిపిస్తూనే ఉన్నాయి. వీరిద్దరికి ఉన్న క్రేజ్ అలాంటిది కాబట్టి ఈ సీజన్లోకి వీళ్లిద్దరు వచ్చే అవకాశాలు కూడా ఉన్నట్లు మీడియా వర్గాల్లో వార్తలు ఊపొందుకున్నాయి. అంతే కదూ ప్రస్తుతం పలు సీరియల్స్ ద్వారా ప్రేక్షకులను అలరిస్తున్న యాక్టర్స్ కూడా ఈసారి హౌస్ లోకి అడుగుపెట్టే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. మరి ఈ సీజన్ లో సెలబ్రిటీలు ఎవరు వస్తారు అన్నది సస్పెన్స్ గా మారింది. మరో వారంలో హౌస్ లోకి ఎవరు రాబోతున్నారు అన్న విషయంపై క్లారిటీ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి.. ఏది ఏమైనా కూడా ఈసారి బిగ్ బాస్ దశావతారం కాన్సెప్ట్ తో రాబోతుంది. మరి ఈ సీజన్ ఎలాంటి విమర్శలకు తావునిస్తుందో చూడాలి..

Also Read :ఫ్యాన్స్ కు బిగ్ షాక్.. మహా పెళ్లి ఫిక్స్..?

Related News

Karthika Deepam 2 Serial Today Episode October 5th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: మాలినికి షాక్ ఇచ్చిన సూరజ్ – పీఏగా జ్యోత్స్న అపాయింట్            

Ninnu kori Serial Today Episode October 5th ‘నిన్ను కోరి’ సీరియల్‌: సామ్రాట్ ను జీవన్ చంపేస్తాడా..? చంద్ర కనిపెడుతుందా..? 

Nindu Noorella Saavasam Serial Today Episode October 5th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరి తనను చంపేస్తుందని పార్థు పసిగడతాడా..?    

Monday Tv Movies : మూవీ లవర్స్ కు పూనకాలే.. వీటిని మస్ట్ వాచ్..

సుప్రీత ఆస్తుల విలువ ఎంతో తెలుసా? చిట్టా మొత్తం బయటపెట్టిందిగా?

పవన్ కళ్యాణ్ రాజకీయాల పై సుప్రీత కామెంట్స్… పండగ చేసుకున్నాం అంటూ!

సుప్రీత నెల సంపాదన ఎంతో తెలుసా? అందం కోసం అంత ఖర్చు చేస్తుందా?

డ్రగ్స్ వ్యవహారం…ఏడవని రోజు లేదు సుప్రీత ఎమోషనల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×