Podarillu Today Episode august 19th:అమ్మవారికి బోనం సమర్పించాలన్న మహాలక్ష్మి కోరిక తీరిపోతుంది.. మాధవ్ ఎలాగైనా సరే.. ఇవాళ అమ్మవారికి బోనాలు సమర్పించేసాం కదా.. నాకు చాలా సంతోషంగా ఉంది అని అనుకుంటున్నారు మొత్తానికి మహాలక్ష్మి తీరుతుంది అని అనుకుంటుంది. అయితే మహాలక్ష్మి చాలా సంతోషంగా ఉంది అని అనుకుంటూ ఉండగా చక్రి మహాలక్ష్మి దగ్గరికి వెళ్లి మీరు ఇప్పుడు బాగానే ఉన్నారా ఇప్పుడు అంతా బాగుందా అని అడుగు. కొన్ని అడుగుతాడు. అయితే చక్రి బయటికి వెళ్దాము అని మహాలక్ష్మి అడుగుతుంది.. ఎక్కడికి వెళ్దాము అంటే సరదాగా ఊరికి చూసి వద్దామా అని అనగానే చక్రి సరే వెళ్దాము అని అంటాడు. ఇవి ఇరుకురికి సంధులు కదా మనం సైకిల్ మీద వెళ్దాము అని అంటారు. వాళ్ళిద్దరూ కలిసి సైకిల్ మీద అలా వెళ్లడం చూసి కన్నా కేశవ ఇద్దరు కూడా చాలా సంతోషంగా ఉంటారు.. ఇకపోతే అక్కడున్న రౌడీలు ఎవరు వచ్చారు అని చూసి అనుకుంటారు కానీ, మీ అక్క కొడుకు కోడలు అని చెప్పగానే అతను షాప్ అవుతాడు.
మహాలక్ష్మి చక్రి దగ్గరికి వచ్చి బయటికి వెళ్దామా అని అడుగుతుంది. చక్రి సరే ఊరు చూసే స్వద్దాము వెళ్దామని అంటాడు. అయితే ఒక సైకిల్ తీసుకుని వచ్చిన చక్రి మహాలక్ష్మి గారిని ఆ సైకిల్ మీద ఊరంతా తిప్పి చూపించాలి అని అనుకుంటాడు. ఇద్దరు సైకిల్ మీద వెళ్లడం చూసిన కన్నా కేశవ వీళ్ళిద్దరూ త్వరలోనే కలిసిపోయేలా కనిపిస్తున్నారు అని అనుకుంటారు. ఇక మహాలక్ష్మి చక్రి ఇద్దరూ నిజమైన భార్య భర్తల్లాగా ఒకరికొకరు మాట్లాడుకుంటూ వాళ్ళ సరదాగా సైకిల్ మీద వెళ్ళిపోతూ ఉంటారు. అయితే మహాలక్ష్మి మనమందరం ఎప్పుడు ఇలాగే పళ్ళులో సరదాగా ఉంటే బాగుంటుంది కదా అని అంటూ ఉంటుంది అప్పుడే ఒక గుంట రావడంతో చక్రి ఆ గుంటలోకి సైకిల్ కొనిస్తాడు దాంతో మహాలక్ష్మి కింద పడిపోతుంది. మహాలక్ష్మికి ఏదైనా దెబ్బలు తగిలాయేమో అని చక్రి చాలా బాధపడిపోతూ ఉంటాడు.
మహాలక్ష్మి చక్రి అలా వెనకాల వెళుతూ ఉండగా కింద పడిపోతుంది మహాలక్ష్మి.. అయితే అప్పుడే అక్కడికి వచ్చిన ఒక ఆవిడ మీరు ఇద్దరు భార్య భర్తలే కదా ఈ పాత సైకిల్ మీకు ఎక్కడ దొరికింది అని అడుగుతుంది. అన్ని విషయాల గురించి చెప్పిన చక్రి ఆ పాత సైకిలు వేరే చోట తెచ్చామని అనగానే అది ఊడిపోయింది. దానిమీద కూర్చుంటే ఖచ్చితంగా కింద పడతారు అని అంటుంది.. అయితే మీరిద్దరు భార్య భర్తలే కదా.. అయితే నువ్వు ముందు మీ ఆయన దగ్గర కూర్చో అప్పుడే చాలా బాగుంటుంది. మేము కూడా అంతే పెళ్ళైన కొత్తలో మా ఆయన నన్ను అలానే తీసుకొని వెళ్లేవాడు అని ఆమె చెప్పగానే.. ఇక మహాలక్ష్మి ఏమీ మాట్లాడకుండా ముందు కూర్చుంటుంది ఇద్దరు కలిసి సరదాగా మాట్లాడుకుంటూ ఒక తోటలోకి వెళ్తారు..
చక్రిమహాలక్ష్మి ఒక మామిడి తోటలోకి వెళ్ళగానే అక్కడ మందు తాగుతూ కనిపించిన కుర్రాళ్ళు తనని ఇబ్బంది పెట్టాలని అనుకుంటారు.. అయితే మహాలక్ష్మి ఒంటరిగా రాలేదు బాడీగార్డ్ తో వచ్చింది అంటూ వాళ్ళు ఆమెను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తారు.. చక్రి వాళ్ళని కొట్టబోతుంటే అందరూ కలిసి చక్రిని పట్టుకుంటారు అప్పుడే అక్కడికి వచ్చిన చెక్రి మేనమామ వాళ్ళని కొట్టి తరిమేస్తాడు. మీరు మాకు ఈరోజు చాలా సహాయం చేశారు అని చక్రి తన మామ అని తెలియకుండా పొగిడిస్తూ ఉంటాడు. అయితే తన మనిషి వచ్చి మీ మేనల్లుడిని కాపాడారు మీరు చంపమని చెప్పి ఇలా పని చేస్తారని అడుగుతాడు.. కానీ అతను మాత్రం చాలా కోపంగా ఉంటాడు.
అందరూ భోజనం చేద్దామని కూర్చుంటారు. మనిషా చేసిన వంటలని ఎలా తినాలో అర్థం కావడం లేదు అని కన్న కామెంట్ చేస్తారు. కానీ అందరూ కూర్చున్న తర్వాత మనిషా చేసిన స్వీటు అందరికీ బాగా నచ్చుతుంది. మనిషా చాలా బాగా చేసింది అంటూ అందరూ మెచ్చుకుంటూ తింటూ ఉండగా.. మాధవ్ కి కొసరి కొసరి మనిషా వడ్డించడం చూసి మిగిలిన వాళ్ళందరూ మనిషా అన్నయ్యని పెళ్లి చేసుకుంటే బాగుంటుంది కదా అని కన్నా అంటాడు. వీళ్ళిద్దరిని చూస్తుంటే నిజంగా చాలా ముచ్చటగా ఉంది అని మహాలక్ష్మి కూడా అనుకుంటూ ఉంటుంది. మనిషా మాధవ్ కి చాలా ప్రేమగా వడ్డించడం చూసి ఈ సీరియల్ కి హైలైట్స్ ని ఇదే అని అనిపిస్తుంది.. వీళ్ళిద్దరిని చూస్తుంటే త్వరలోనే పెళ్లి చేసుకుంటారు అని అందరూ అనుకుంటారు.
శైలు ప్రెగ్నెంట్ అని చెప్పడంతో ఇంట్లోని వాళ్ళందరూ బాధపడిపోతూ మళ్లీ ఇంటికి చేరుకుంటారు. అటు గాయత్రి మాధవ్ నీ వెతుక్కుంటూ వస్తుంది. మాధవ్ ఎక్కడున్నాడు అని ఆలోచిస్తూ ఉంటుంది.. అయితే గాయత్రి ఎక్కడికి వెళ్లారు. మీరు పొద్దననుంచి కనిపించలేదు కదా ఎక్కడికి వెళ్లారు అని మాధవ్ మళ్ళీ అడుగుతాడు.. పెళ్లి కూతుర్ని వెతకడానికి ఊర్లోకి వెళ్ళాను బావ అందుకే లేట్ అయింది అని గాయత్రి అంటుంది. నాకు పెళ్లి కూతుర్ని వెతకడానికి వెళ్ళావా మరి దొరికిందా అని మాధవ్ అంటాడు. దొరికింది బావ ఎవరో కాదు మనిషా అని చెప్పగానే మాధవ్ మనిషా తో నా పెళ్లి ఏంటి ఏం మాట్లాడుతున్నావ్ గాయత్రి అని అంటాడు. తాయారు గాయత్రి ఇక్కడ ఏం చేస్తున్నావ్ మీ ఆయన నీకోసం వెతుకుతూ ఉంటాడు నువ్వు ఎప్పుడు ఇట్టే తిరుగుతూ ఉంటావా అని అంటుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్లో శైలు ప్రెగ్నెంట్ అన్న విషయాన్ని మాధవ్ కి చెప్తుంది వరాలు ఆ తర్వాత ఏం జరుగుతుందో చూడాలి..