OTT Movie : ఓటీటీలోకి ఎన్నో రకాల స్టోరీలతో సినిమాలు స్ట్రీమింగ్ కు వస్తున్నాయి. వీటిలో సైకో కిల్లర్ సినిమాలు ఊహించని ట్విస్టులతో ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేస్తున్నాయి. గత ఏడాది తెలుగులో వచ్చిన ఒక క్రైమ్ థ్రిల్లర్ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. యాక్షన్ సీన్స్ తో ఈ సినిమా కేక పెట్టిస్తోంది. ఈ మూవీ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతోంది ? అనే వివరాల్లోకి వెళితే ..
స్టోరీలోకి వెళితే
విశాఖపట్నం నగరంలో ఒక సీరియల్ కిల్లర్ యువతులను కిడ్నాప్ చేసి, కిరాతకంగా హత్య చేస్తూ నగరంలో భయంకరమైన వాతావరణాన్ని సృష్టిస్తాడు. ఈ హత్యలు నగరవాసులను భయాందోళనకు గురి చేస్తాయి. ఈ కేసును విచారించేందుకు ఏసీపీ ధక్షిణ (సాయి ధన్షిక) అనే డైనమిక్ పోలీసు అధికారి వస్తుంది. ఆమె ఈ సీరియల్ కిల్లర్‌ను పట్టుకోవడానికి పట్టుదలతో దర్యాప్తు ప్రారంభిస్తుంది. దర్యాప్తు సమయంలో ధాక్షిణ ఒక మహిళను అరెస్ట్ చేస్తుంది. ఆమె ప్రతి హత్య జరిగిన స్థలంలో కనిపిస్తూ ఉంటుంది. ఆమె ప్రవర్తన కూడా అనుమానాస్పదంగా ఉంటుంది. ధాక్షిణ ఈ మహిళను విచారించడం ద్వారా కేసును ఛేదించడానికి ప్రయత్నిస్తుంది.
అయితే ఈ దర్యాప్తు ఊహించని దిశలో మలుపు తిరుగుతుంది. స్టోరీ మధ్యలో ధాక్షిణ జీవితంలో ఒక విషాద సంఘటన జరుగుతుంది. ఈ సంఘటనతో ఆమె ప్రతీకార భావంతో రగిలిపోతుంది. ఈ విషాదం వల్ల ఆమె దర్యాప్తును మరింత వేగవంతం చేస్తుంది. దర్యాప్తు లోతుగా వెళ్ళే కొద్దీ, ధాక్షిణ ఒక షాకింగ్ రహస్యాన్ని వెలుగులోకి తెస్తుంది. ఇది కేసు మొత్తం దిశను మార్చేస్తుంది. ఈ ట్విస్ట్ లో సీరియల్ కిల్లర్ ఎవరనే ఆధారాలు దొరుకుతాయి. చివరికి ధాక్షిణ ఆ సైకో కిల్లర్ ని పట్టుకుంటుందా ? సైకో అమ్మాయిలను ఎందుకు చంపుతున్నాడు ? అనే విషయాలను తెలుసుకోవాలి అనుకుంటే, ఈ క్రైమ్ థ్రిల్లర్ సినిమాని మిస్ కాకుండా చూడండి.
Read Alaso : తండ్రికే తెలియకుండా కొడుకుని పూడ్చిపెట్టే కిరాతకుడు ఈ పోలీస్… ఓటీటీని ఊపేసిన బెస్ట్ మలయాళ క్రైమ్ థ్రిల్లర్
అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) లో
ఈ క్రైమ్ థ్రిల్లర్ యాక్షన్ మూవీ పేరు ‘ధక్షిణ’ (Dhakshina). 2024 లో విడుదలైన ఈ తెలుగు సినిమాకి తులసీ రామ్ ఓషో దర్శకత్వం వహించారు. సాయి ధన్షిక టైటిల్ రోల్‌లో నటించగా, రిషవ్ బసు, స్నేహా సింగ్, హిమ శైలజ, మాగ్నా చౌదరి, కరుణ, నవీన్, అంకిత మూలెర్ తదితరులు సహాయక పాత్రల్లో నటించారు. విశాఖపట్నంలో వరుస హత్యలు చేసే ఒక సీరియల్ కిల్లర్ చుట్టూ ఈ స్టోరీ తిరుగుతుంది. ఇందులో ఒక షాకింగ్ ట్విస్ట్ కథను మలుపు తిప్పుతుంది. అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది.