Intinti Ramayanam Today Episode june 23rd: నిన్నటి ఎపిసోడ్ లో.. ఆరాధ్య కనిపించకపోవడంతో అవని వెతుక్కుంటూ ఉంటుంది. అందర్నీ కంగారుపడుతూ అవని అడుగుతుంది. ఆరాధ్య ఎక్కడికో వెళ్లిపోయింది కనిపించలేదు అని ఇందంతా వెతుకుతారు. బయట ఉన్న రాజేంద్రప్రసాద్ ని అవని ఆరాధ్య గురించి అడుగుతుంది.. అయితే ఎక్కడికి వెళ్ళిందో వెతుకుదాం పదండి అని అందరూ టెన్షన్ పడుతుంటారు. అప్పుడే అక్షయ్ ఈ ఆరాధ్యని తీసుకురావడం చూసి ఆరాధ్య నీ దగ్గరికి ఎలా వచ్చింది అని రాజేంద్రప్రసాద్ అడుగుతాడు. ఏమో నాకు తెలియదు నాన్న పొద్దున్నే చూసేలాగా నామీద పడుకుని ఉంది అని అక్షయ్ అంటాడు. అక్షయ్ మొత్తానికి ఆరాధ్యని తీసుకుని వెళ్లి అవనికి అప్పగిస్తాడు. ఇక పల్లవి కొత్త ఇల్లు చూశానని అక్షయ్ దగ్గరకొస్తుంది. అక్షయ్ మాత్రం నేను నా కూతురు ను వదిలి రాను అంటుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. అవనికి పార్వతి వాళ్లను దూరంగా ఉంచాలని లేకుంటే అక్షయ్ అవన్నీ కలిసిపోతారని పల్లవి మాస్టర్ ప్లాన్ వేసి ఒక ఇంటిని చూస్తానని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తర్వాత రోజు ఉదయం పల్లవి వచ్చి కొత్త ఇల్లు దొరికింది వెళ్దాం అంటే అక్షయ్ నేను రాను అని అంటాడు. అవని అంటే నాకు కూడా కోపం అమ్మ నేను అవనితో కలుస్తానని మీరు అస్సలు అనుకోకండి.. నాకు నా కూతురు ఇప్పుడిప్పుడే దగ్గరవుతుంది. నా కూతుర్ని వదిలిపెట్టి నేను ఎలా వస్తానని అనుకుంటున్నావు అని అడుగుతాడు. భానుమతి వాడి కూతురు అంటే ఎంత ప్రాణమో తెలుసు కదా? వాడు కూతుర్ని వదిలిపెట్టి ఎలా వస్తాడు పల్లవి అని భానుమతి అంటుంది. వీళ్లు రివర్స్లో షాక్ ఇస్తారని అస్సలు ఊహించలేదు.. అయితే అవని స్కూల్ కి మీ నాన్నతో వెళ్ళు అని ఆరాధ్యను పంపిస్తుంది.
అక్కడే ఉన్న పల్లవి చూశారా అత్తయ్య అవని ఎలా కూతురిని అడ్డుపెట్టుకొని బావగారిని తన వైపు తిప్పుకునేలా ప్రయత్నాలు చేస్తుంది అని పుల్లలు పెడుతుంది. అక్షయ్ ని పిలుస్తారు.. ఏంటి ఆరాధ్య ఎలా వచ్చావు అంటే నువ్వు స్కూల్ కి తీసుకెళ్లాలి కదా నాన్న వెళ్దాం పద నడుచుకుంటూ వెళ్ళిపోదామని ఆరాధ్య అంటుంది. మీకు పని పాట లేదు కారు లేదని కూడా తెలిసి ఆరాధ్యను పంపించిందంటే అవని అక్క మిమ్మల్ని ఎగతాళి చేస్తుందని అర్థమవుతుంది బావగారు అని అంటుంది.
మీరు ఏ పని చేయకుండా ఖాళీగా ఉన్నారని అవని ఇలా ఇండైరెక్టుగా మిమ్మల్ని గుచ్చి చంపాలని అనుకుంటుంది. అందుకే మీరు ఖాళీగా ఉన్నారు కదా స్కూల్లో వదిలిపెడతారని మీ దగ్గరికి పంపించింది అని పల్లవి అంటుంది. పల్లవి ఆ మాట అనగానే అక్షయ్ సీరియస్ అవుతాడు. వెంటనే ఆరాధ్యని తీసుకొని అవని దగ్గరికి వెళ్తాడు. నీ కంటికి నేను ఎలా కనిపిస్తున్నాను పనీపాటా లేకుండా ఖాళీగా ఉన్నానని నువ్వు అనుకుంటున్నావా.. రోజు నువ్వే ఆరాధ్యను స్కూల్ కి తీసుకెళ్తావ్.. ఇప్పుడు నన్ను ఎందుకు తీసుకెళ్లమంటున్నావ్ అని అరుస్తాడు. నా దగ్గర కారు లేదన్న విషయం తెలిసి కూడా ఆరాధ్యను స్కూలుకి తీసుకెళ్ళమని పంపించావా.. ఇంకొకసారి ఇలా చేస్తే అస్సలు ఊరుకోను అని అక్షయ్ అవనికి వార్నింగ్ ఇచ్చి వెళ్తాడు.
Also Read : అయ్యో.. ప్రభావతికి గ్యాస్ కష్టాలు.. బాలు రోకలి వైద్యం సక్సెస్..
రాజేంద్రప్రసాద్ పార్వతి ఇద్దరూ బయటికి వెళ్ళొస్తూ ఎదురుపడతారు. కోడలు చేసింది తప్పు అని పార్వతి. కొడుకు చేసిందే తప్పు అని రాజేంద్రప్రసాద్ ఇద్దరూ బాధించుకుంటారు. భానుమతి మీరిద్దరూ కలిసి ఉండాలని అనుకుంటున్నారా విడిపోవాలని అనుకుంటున్నారా ఆపండి ఇక అరుస్తుంది.. ఆరాధ్య ఆడుకోడానికి ఆ వీధిలోని పిల్లల దగ్గరికి వెళ్తుంది. అక్కడున్న పిల్లలు మీ అమ్మానాన్న ఎవరో చెప్పు అని మాట్లాడుతారు దాంతో ఆరాధ్యకు కోపం వచ్చి ఒక పిల్లని చంప పగలగొడుతుంది. వాళ్ల పేరెంట్స్ అక్షయ్ దగ్గరికి తీసుకొని వస్తారు. తుని ఇలానే నా పెంచేది మీ ఆవిడ ఎక్కడ బయటకు తీసుకురండి నేను మాట్లాడుతాను అని అవతల ఆవిడ అనడంతో అక్షయ్ అవని దగ్గరకు తీసుకొని వెళ్తాడు. నీ దగ్గర ఉంటే ఆరాధ్య ఎలా తయారవుతుందో చూసావా ఇంటి మీదకి గొడవలు తీసుకుని వచ్చింది అని అక్షయ్ అంటాడు. కూతుర్ని ఎలా పెంచాలో నాకు తెలుసు మీరు నాకేం చెప్పాల్సిన అవసరం లేదు అని అవని అక్షయ్ కి రివర్స్లో షాక్ ఇస్తుంది. రాజేంద్రప్రసాద్ ఏమో తన కొడుకు కోడలు విడిపోవడానికి గల కారణాలను వాళ్ళకి వివరిస్తారు. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది. రేపటి ఎపిసోడ్లో చక్రధర్ కంపెనీ లాస్ అవ్వడానికి ప్లాన్ చేసినట్లు అవని శ్రీకర్ కనిపెడతారు. ఆ తర్వాత ఏం జరుగుతుందో చూడాలి..