BigTV English

OTT Movie : ఓటీటీలో ట్రెండ్ అవుతున్న శ్రద్ధా శ్రీనాథ్ ఇంటెన్స్ డిస్టోపియన్ సై-ఫై థ్రిల్లర్… స్ట్రీమింగ్ ఎక్కడంటే?

OTT Movie : ఓటీటీలో ట్రెండ్ అవుతున్న శ్రద్ధా శ్రీనాథ్ ఇంటెన్స్ డిస్టోపియన్ సై-ఫై థ్రిల్లర్… స్ట్రీమింగ్ ఎక్కడంటే?

OTT Movie : రీసెంట్ గా ఓటీటీలోకి వచ్చిన ఒక సై-ఫై థ్రిల్లర్ సినిమా బాగా ట్రెండ్ అవుతోంది. ఈ సినిమాలో శ్రద్ధా శ్రీనాథ్  ప్రధాన పాత్రలో నటించారు. ఈ స్టోరీ మూడవ ప్రపంచ యుద్ధం జరిగిన తరువాత ఏర్పడే పరిస్థితుల చుట్టూ తిరుగుతుంది. ఇది ప్రేక్షకులను ఒక కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్తుంది. ఈ మూవీ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే ..


సింప్లీ సౌత్ (SimplySouth) లో

ఈ ఇంటెన్స్ డిస్టోపియన్ సై-ఫై థ్రిల్లర్ మూవీ పేరు ‘కలియుగం 2064’ (Kaliyugam 2064). 2025 లో వచ్చిన ఈ సినిమాకి సుందర్ దర్శకత్వం వహించారు. ఇది K.S. రామకృష్ణ, K. రామచరణ్ నిర్మాణంలో RK ఇంటర్నేషనల్, ప్రైమ్ సినిమాస్ బ్యానర్‌ల కింద తమిళం, తెలుగు భాషలలో ఏకకాలంలో విడుదలైంది. శ్రద్ధా శ్రీనాథ్, కిషోర్ కుమార్, ఇనియన్ సుబ్రమణి , హరి, మాస్టర్ రోనిత్, అస్మల్ ప్రధాన పాత్రల్లో నటించారు. డాన్ విన్సెంట్ దీనికి సంగీతం అందించారు. ఈ సినిమా 2025 మే 9న్ థియేటర్లలో విడుదలై, జూన్ 20 నుంచి సింప్లీ సౌత్ (SimplySouth) లో స్ట్రీమింగ్ అవుతోంది. IMDbలో ఈ సినిమాకి 7.3/10 రేటింగ్ ఉంది. ఇందులో శ్రద్ధా శ్రీనాథ్, కిషోర్ నటన, విజువల్స్, డిస్టోపియన్ కాన్సెప్ట్ కు ప్రశంసలు అందుకున్నాయి.


స్టోరీలో వెళితే

2064 సంవత్సరంలో మూడవ ప్రపంచ యుద్ధం తర్వాత, ఈ ప్రపంచం ఆహారం, నీరు, మానవత్వం లేని ఒక డిస్టోపియన్ స్థితిలో ఉంటుంది.  సమాజం రెసిడెంట్స్ (ధనవంతులు), లిబరేటర్స్ (పేద వాళ్ళు)గా విడిపోతుంది. రెసిడెంట్స్ పెద్ద గోడలతో వేరు చేయబడిన ప్రాంతంలో ఉంటారు. తమకి ఎదురుతిరిగే వాళ్ళని చంపుతుంటారు. లిబరేటర్స్ పేదరికంతో సమాన సమాజం కోసం పోరాడుతారు. ఈ స్టోరీ శక్తి అనే ఒక లిబరేటర్, రెసిడెంట్స్ నివసించే ప్రాంతంలోకి చొరబడే ప్రయత్నంతో మొదలవుతుంది. అతను ఒక సేఫ్ హౌస్‌లోకి ప్రవేశిస్తాడు. అక్కడ రెసిడెంట్స్  కావలసిన సౌకర్యాలతో ఉంటారు, ఇది అక్కడ రెసిడెంట్స్ జీవనశైలి ఏ విధంగా ఉందో చూపిస్తుంది.

సినిమా మొదటి 30 నిమిషాలు ఈ డిస్టోపియన్ ప్రపంచాన్ని పరిచయం చేస్తాయి.  శక్తి పోరాటం, వనరుల కొరతతో కూడిన ఒక భయంకర వాతావరణాన్ని చూపిస్తాయి. రెసిడెంట్స్, లిబరేటర్స్ మధ్య పోరాటం తీవ్రమవుతుంది. ఈ క్రమంలో రెసిడెంట్స్ ఉండే సేఫ్ హౌస్‌లో దాగి ఉన్న భయంకర నిజం బయటపడుతుంది. ఆహార టిన్‌లు మానవ మాంసంతో తయారవుతాయని, రెసిడెంట్స్ కానిబలిజం ద్వారా జీవిస్తున్నారని తెలుస్తుంది. చివరికి రెసిడెంట్స్, లిబరేటర్స్ మధ్య ఎలాంటి గొడవలు జరుగుతాయి ? రెసిడెంట్స్ మనుషులను ఆహారంగా ఎందుకు తీసుకుంటున్నారు ? ఈ స్టోరీ ఎలా ముగుస్తుంది ? అనే విషయాలకు సమాధానాలు కావాలంటే, ఈ సై-ఫై థ్రిల్లర్ సినిమాను మిస్ కాకుండా చూడండి.

Read Also : కోర్టు రూమ్ లోనే హత్య… దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కేసు… ఐఎండీబీలో 8.9 రేటింగ్

Related News

OTT Movies : ఈ వీకెండ్ ఓటీటీలోకి కొత్త సినిమాలు.. మిస్ అవ్వకుండా చూసేయ్యండి…

OTT Movie : కామాఠిపురంలో కాలుజారే ఒంటరి జీవితాలు … లాక్ డౌన్ మిగిల్చిన జ్ఞాపకాలు … ఒక్కో స్టోరీ ఒక్కో స్టైల్లో

OTT Movie : పక్కింటోడి చేతిలో పాపలు బలి … రివేంజ్ కోసం భూమి మీదకి వచ్చే ఆత్మ … గూస్ బంప్స్ తెప్పించే హారర్ సినిమా

OTT Movie : వందమంది అమ్మాయిలతో ఒక్కమగాడు … యవ్వారం అంతా చీకట్లోనే …

OTT Movie : ప్రెగ్నెంట్ లేడీపై ప్రేతాత్మ కన్ను … బ్రేస్లెట్ చుట్టూ తిరిగే స్టోరీ … చెమటలు పట్టించే సీన్స్

OTT Movie : భర్తపై భార్య అరాచకం … కూతురు అంతకు మించి … ఆత్మని కూడా వదలకుండా …

Big Stories

×