Intinti Ramayanam Today Episode March 10 th: నిన్నటి ఎపిసోడ్ లో.. అక్షయ్ అవినీకి పెళ్లి పత్రిక ఇస్తాడు.. పెళ్లికి రమ్మని పెళ్లి పత్రిక ఇచ్చారా వద్దని పెళ్లి పత్రిక ఇస్తున్నారా అని అవని అడుగుతుంది. దానికి అక్షయ్ ఎందుకు అవని ఇంకా అలా మాట్లాడుతున్నావ్. నేను రమ్మనే నీకు పెళ్లి పత్రిక ఇచ్చాను ఒకవేళ వద్దనుకునే వానైతే నీ పేరుని పెళ్లి పత్రికలో ఎందుకు వేయిస్తానని అంటాడు.. నాకు ఆ ఇంట్లో స్థానం లేదు కానీ నా పేరు మాత్రం పెళ్లి పత్రికలో ఎలా ఉంది అని అవని అడుగుతుంది. ప్రణతిని పదేళ్లపనించి నేనే అమ్మ లాగా పెంచుతున్నాను అలాంటిది నా బిడ్డ పెళ్లికి నా భర్త చేతనే నువ్వు పెళ్లి పత్రిక తీసుకోవడం నాకు చాలా బాధాకరంగా ఉంది నా అంత దరిద్రం ఎవరికి రాదు అని అవని బాధపడుతుంది. ఇంట్లో వాళ్ళ సంగతి మర్చిపో నేను ఈ పెళ్లి పత్రిక నీకు ఇస్తున్నాను అంటే నువ్వు ఈ పెళ్లికి రావాలనే కదా అని అక్షయ్ అంటాడు. దానికి అవని నేను ఏ మొహం పెట్టుకొని పెళ్లికి రావాలి ఏ అర్హతతో పెళ్లికి రావాలి అని అంటుంది. ఆ ఇంటి పెద్ద కోడలు కావాలా మీ భార్యగా రావాలా లేక నా కూతురికి టీచర్ రావాలా అనేసి అడుగుతుంది.. పార్వతి వియ్యంకులు అవని తప్పకుండ ఉండాలని అడుగుతారు. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది..
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. పెళ్లి వాళ్ళు వచ్చి అవనేని ఎలాగైనా తీసుకురావాలని మా ఇంట్లో వాళ్ళు మా బంధువులు కూడా రాజేంద్రప్రసాద్ గారి పెద్ద కోడలు గురించి మాట్లాడతారు అలాంటి మాటలు రాకుండా ఉండాలంటే కచ్చితంగా మీ పెద్ద కోడలు ఉండేలా చూసుకోండి అనేసి అంటారు. దానికి పార్వతి అలాగే అండి మా పెద్ద కోడలు పెళ్లికొస్తుంది అనేసి అంటుంది. వాళ్లని రాజన్న ప్రసాద్ వాళ్ళు బయటకు వెళ్లి పంపించేస్తారు ఆ తర్వాత పార్వతి దగ్గరికి వచ్చి రాజేంద్రప్రసాద్ అవని పిలిస్తే గాని రాదు మనం వెళ్లి పిలుద్దామా అనేసి అంటాడు కానీ పార్వతి మాత్రం అవనీని పిలుస్తానని ఎలా అనుకున్నారు అని షాక్ ఇస్తుంది. అవని ప్లేస్ లో వేరే అమ్మాయి ఉంటుంది అవనీని మొన్న వచ్చినందుకే ఏదోలా అనిపించింది అలాంటిది ఇప్పుడు మళ్ళీ ఎలా పిలుస్తానని మీరు అనుకున్నారు అని రాజేంద్రప్రసాద్ అంటుంది.
పెద్ద కోడలు అనగానే సరే అన్నావ్ మరి ఎలా తీసుకొస్తావనేసి వాళ్ళు అడిగితే ఏం బాగుంటుంది అని రాజేంద్రప్రసాద్ అంటాడు. దానికి పార్వతి అవని ప్లేస్ లో నాకు తెలిసిన ఒక అమ్మాయి ఉంది పెళ్లి అయ్యేంతవరకు కాసేపు అక్షయ్ భార్యగా ఉంటుంది ఆ తర్వాత వీళ్ళు ఎలాగో అమెరికాకు వెళ్ళిపోతారు కదా ఎవరు పట్టించుకోరు పెళ్లయిపోతుంది అనేసి పార్వతి సింపుల్ గా అనేస్తుంది. ఒక నాటకాలు ఆడే అమ్మాయిని తీసుకొచ్చి నీ కొడుకు పక్కన కూర్చో పెట్టాలనుకుంటున్నావా అని రాజేంద్రప్రసాద్ అడుగుతాడు. అటు అక్షయ్ కూడా ఎవరో అమ్మాయికి నేను భర్తగా ఆడ్ చేయాలి అమ్మ నా పక్కన వేరే అమ్మాయిని భార్యగా ఊహించుకోవాలా.. ఈ పెళ్లయ్యేంతవరకైనా అవని నేను ఆ భార్యగా ఉండనివ్వు అని కాళ్ళు పట్టుకుంటాడు. సరే వెళ్లి అవనిని తీసుకురా పెళ్లయ్యేంతవరకు తను ఇక్కడే ఉంటుందని పార్వతి అనగానే ఇంట్లోని మగాళ్ళందరూ సంతోషపడతారు.
అక్షయ్ ను వెంటనే వెళ్లి పెళ్లికి అవని వదినని తీసుకురమ్మని అంటారు వెంటనే వెళ్లి పెళ్లికి అవని వదినని తీసుకురమ్మని అంటారు. పార్వతి దగ్గరికి పల్లవి శ్రియ ఇద్దరు వచ్చి ఎవరిని తీసుకురమ్మని మీరు సింపుల్ గా చెప్పారు మీరు ఇలా అంటారని అస్సలు ఊహించలేదు అత్తయ్య అని అడుగుతారు. పెళ్లికి అవనీని పిలిస్తే నెత్తినెక్కి కూర్చుంటుంది అనగానే పెళ్లికొచ్చి గెస్ట్ ల లాగే అవని వెళ్ళిపోతుంది దాని గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు అని పార్వతి వెళ్ళిపోతుంది. కానీ పల్లవి మాత్రం అవనిని ఎట్టి పరిస్థితులను ఇంటికి రాకుండా చేయాలని ఆలోచిస్తుంది.
ప్రణతి అవని వదినకు ఫోన్ చేయాలని ఫోన్ చేస్తుంది కానీ దయాకర్ ఆమెకు ఫోన్ ఇవ్వడు. ఈ ప్రణతికి ఏ అవసరం వచ్చిందో అని అవని ఫోన్ చేస్తుంది. పార్వతి ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. పెళ్లి చెడగొట్టాలని చూస్తున్నావా అసలు నా కూతురికి ఎందుకు ఫోన్ చేసావని అవనిని పార్వతి అడుగుతుంది. నేను కావాలని చేయలేదు అత్తయ్య పెళ్లి గురించి మాట్లాడదామని చేశాను అంటే నోరు ముయ్ ఇంకొకసారి నా కూతురికి ఫోన్ చేస్తే బాగోదు అనేసి వార్నింగ్ ఇస్తుంది. పల్లవి వచ్చి అవినీని ఇంటికి రానిస్తే ఖచ్చితంగా పెళ్లి ని ఎలా చెడగొట్టాలని ఆలోచిస్తుందని పార్వతి మనసుని చెడగొడుతుంది.
అక్షయ్ అవనిని తీసుకురావడానికి దయాకర్ వాళ్ళ ఇంటికి వెళ్తాడు. దయాకర్ స్వరాజ్యం ఇద్దరూ సంతోష పడుతూ అవనిని పిలుస్తారు. అక్షయ్ ప్రణతి పెళ్లికి అవని తీసుకెళ్లడానికి వచ్చానని చెప్తాడు. నా మరదలు పెళ్ళికి నా భర్తే వచ్చి నన్ను పిలుస్తున్నాడు భలే విచిత్రంగా ఉంది కదండీ అనేసి అవని అంటుంది.. నేను ఈ పెళ్లికి రావాలంటే అత్తయ్య మామయ్య మనస్ఫూర్తిగా వచ్చిన అని పిలిస్తేనే నేను వస్తాను అలాగే నన్ను కోడలుగా వాళ్లకి పరిచయం చేస్తానంటే నేనొస్తానని అవని అంటుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది. రేపటి ఎపిసోడ్లో అవని ఏం చెప్పిందో అది పార్వతీకి చెప్తాడు. మరి పార్వతి అవనీని పిలుస్తుందా లేదా అన్నది రేపటి ఎపిసోడ్లో చూడాలి..