BigTV English

Gundeninda GudiGantalu Today episode: శృతి, రోహిణి కి మీనా క్లాస్.. ప్రభావతికి షాకిచ్చిన బాలు..

Gundeninda GudiGantalu Today episode: శృతి, రోహిణి కి మీనా క్లాస్.. ప్రభావతికి షాకిచ్చిన బాలు..

Gundeninda GudiGantalu Today episode march 10th : నిన్నటి ఎపిసోడ్ లో.. రోహిణి ఇంటికి వచ్చేస్తుంది. మనోజ్ పై మాట పడనివ్వదు. తిరిగి మళ్లీ మనోజ్ నే అంటుంది. దానికి మీనా ఇది మరీ బాగుంది మీ ఆయన చేసిన తప్పుకి మరి మా ఆయనను ఎందుకు అంటారు అని మీనా కూడా బాలుపై మాట పడనివ్వకుండా అరుస్తుంది.. పొయ్యి పార్కులో పడుకోవడం మా ఆయన ఇచ్చిన సంపాదనని వాడుకోవడం ఇవన్నీ ఏంటి మీ ఆయన మన డబ్బులు ఇస్తున్నాడా? ఇంటి ఖర్చులకోసం మా ఆయన డబ్బులు ఇస్తే దాన్ని మీ ఆయనకి ఇచ్చారు అది చూడలేదు అనుకుంటున్నారా అని ఇన్ డైరెక్టుగా ప్రభావతికి కౌంటర్ ఇస్తుంది మీనా.. దాంతో మనోజ్ ఎలాగైన జాబ్ తెచ్చుకోవాలని అనుకుంటాడు. మనోజు ఇంటర్వ్యూల కోసం చెప్పులరిగేలా ఆఫీసులో చుట్టూ తిరుగుతాడు. ఇంట్లో రోహిణి మనోజ్ కి జాబ్ వస్తుందా లేదా అని టెన్షన్ పడుతూ ఉంటుంది. అటు ప్రభావతి మీనా పై ఆధిపత్యం చెలాయించాలని చూస్తుంది కానీ మీనా ఎప్పటికప్పుడు ప్రభావతికి కౌంటర్లు ఇస్తూనే ఉంటుంది అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.


ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. రోహిణి గదిలో కూర్చుని బాధపడుతూ ఉంటుంది అప్పుడే శృతి అక్కడికి వెళ్లి నువ్వు చేసింది ఇదేనా రోహిణి ఎందుకు నువ్వు ఇంట్లోంచి వెళ్ళిపోయావు మళ్లీ ఎందుకు వచ్చావు అని శృతి అడుగుతుంది. నేను ఇంట్లోంచి వెళ్లిపోవడానికి కారణం బాలు అన్న మాటలే ఆ క్షణం నాకు ఇంట్లో ఉండాలనిపించలేదు అసలు నేనేం చేశాను కూడా నాకు తెలియలేదు అంతగా నాకు నేను తెలియకుండానే వెళ్ళిపోయాను అని అంటుంది. మనోజ్ కి జాబ్ లేదని బాలు ఎన్ని మాటలు అన్నారో విన్నావు కదా అలాంటి మాటలు పడ్డ తర్వాత ఎలా ఉండాలనిపిస్తుంది శృతి అందుకే వెళ్ళిపోయానని అంటుంది రోహిణి. జాబు వెతుక్కోడానికి మనోజ్ వెళ్ళాడు లేదంటే జాబ్ రాకుంటే ఎంత చులకనగా చూస్తారో అర్థం చేసుకోవచ్చు అని రోహిణి అనగానే మీ నాన్న పెద్ద బిజినెస్ మాన్ కదా మీ పార్లర్ లోనే మీ ఆయన్ని సీఈఓ గా చేయొచ్చు మళ్లీ బ్రాంచీలు కూడా పెట్టుకోవచ్చు. లేదంటే మీ మావయ్య బిజినెస్ మాన్ కదా ఆయన్ని అడిగి కాస్త డబ్బులు తీసుకొని కార్ షోరూమ్ పెట్టించొచ్చు కదా మళ్లీ తిరిగి డబ్బులు ఇవ్వచ్చు కదా అనేసి అంటుంది. ఇది విన్న ప్రభావతి మంచి ఐడియా లేస్తుంది అనేసి లోపలికి వెళుతుంది.

మనోజ్ కి ఎలాగో వారం రోజులు పనిచేసిన ఎక్స్పీరియన్స్ ఉంది కదమ్మా అలానే మీ మామయ్య చేతను మీ నాన్న చేతను ఒక కార్ షోరూమ్ పెట్టిస్తే వాడే చూసుకుంటాడు కదా అని సన్నగాని నాకు మనోజ్ మీద నమ్మకం లేదా ఆంటీ ఆ నమ్మకం వస్తాను నేను మా వాళ్లతో మాట్లాడేసి పెట్టేస్తాను అని రోహిణి సైడ్ అయిపోతుంది. బయటికి వెళ్లి మనోజ్ కి ఫోన్ చేస్తుంది ఒకవేళ మనోజ్ కి జాబ్ రాకపోతే మాటలన్నీ నా వైపు డైవర్ట్ అవుతాయని టెన్షన్ పడుతుంది. ఇంకా జాబ్ రాలేదన్నడంతో రోహిణి టెన్షన్ పడుతుంది. కింద మనోజ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది.


రవి శృతీలు ఇంట్లోకి రావడంతో మనోజ్ అనుకున్నాను మీరు వచ్చారా అని అంటుంది.. అన్నయ్య ఎక్కడికి వెళ్లాడు వదిన ఎందుకు నువ్వు ఇంత టెన్షన్ పడుతున్నావ్ అంటే ఇంటర్వ్యూ కి వెళ్ళాడు రవి రెండు మూడు ఇంటర్వ్యూలు ఉన్నాయని చెప్పాడు ఏదో ఒకటి వచ్చేస్తుందని అనుకుంటున్నాను కానీ మనోజ్ ఇంకా రాలేదు అని వాళ్ళతో అంటుంది. దానికి శృతి ఒక్కరోజులో జాబ్ రావాలంటే కష్టం కదా కొద్ది రోజులు వెయిట్ చేయాలి జాబ్ కోసం తిరగాలి అని అంటుంది. ఇంట్లో జాబ్ రాకపోతే బాలు మమ్మల్ని ఎలా చూస్తాడో మీకు తెలియదు అనేసి రోహిణి టెన్షన్ పడుతుంది. అది నిజమే ఆ బాలు అందరి జీవితాల్లోకి వెళ్లి వాళ్ళ జీవితాలని గెలిచేస్తూ ఉంటాడు అలా చేయడం తప్పు కదా అనేసి రోహిణి శృతి మాట్లాడుకుంటారు..

అప్పుడే మీనా అక్కడికి వచ్చి ఇంట్లో లేని వాళ్ళ గురించి అత్తగారి లాగా మాట్లాడుకోవడం ఎందుకు ఆయన ముందర ఏదైనా మాట్లాడుకోవచ్చు కదా అనేసి అనగానే ప్రభావతి పైనుంచి కిందకు వచ్చి ఇక్కడ అందరూ చదువుకున్న వాళ్లే మీ ఆయన లాగా నీలాగా చదువు లేని వాళ్ళు లేరు. ఇంటి పరువం అవుతుంది ఇప్పుడు నువ్వు ఈ పంచాయతీ పెడ్తే బయట తెలిస్తే అందరూ ఏమనుకుంటారు అని ప్రభావతిపై మీనా అరుస్తుంది. డిగ్రీలు చేయడం ఎంత కష్టమో నీకు తెలుసా ఒక్కరోజులో డ్రైవింగ్ నేర్చుకున్నంత సులువు అనుకుంటున్నావా నువ్వు మీ ఆయన పూల కొట్టు పెట్టడం అంత ఈజీ అనుకుంటున్నావా అనేసి మీనా ను దారుణంగా అవమానిస్తుంది ప్రభావతి.

ఆయన ఒక డ్రైవరు అది నేను చెప్పుకోలేక ఇన్నాళ్లు ఇలా సాగించాను అని ప్రభావతి అనగానే బాలు వెంటనే ఇంట్లోకి ఎంట్రీ ఇస్తాడు. చూసావా నాన్న అమ్మ ఏం మాట్లాడుతుందో నువ్వు ఒక డ్రైవర్ అంట అది చెప్పుకోలేకపోతుందంట.. లక్షలు మింగినోడికి ఇంత చదువులు ఎలా వచ్చాయి ఆ డ్రైవర్ సంపాదించే వచ్చాయి ఈ లేచిపోయినోడికి హోటల్ మేనేజ్మెంట్ ఎలా వచ్చింది? ఆ డ్రైవర్ డబ్బులతోనే వచ్చింది లేదా మీ డబ్బులు ఏమైనా ఇచ్చిందా అనేసి అందరిని కలిపి ప్రభావతికి క్లాస్ పీకుతాడు..

ఇక మనోజ్ ఇంటికి వస్తాడు. ప్రభావతి రాగానే ఏమైందిరా జాబ్ వచ్చిందంటే లేదమ్మా నేను అన్ని కంపెనీలు తిరిగాను వెతుకుతున్నాను కచ్చితంగా ఏదో ఒక జాబ్ అయితే వస్తుందిలే అనేసి అంటాడు అప్పుడే రోహిణి పైనుంచి కిందికి వస్తుంది. మనోజ్ వెళ్లిన పని ఏమైంది అనగానే ప్రభావతి రోహిణి పక్కకు పిలిచి నేను ఇవన్నీ అడిగాను జాబ్ రాలేదని చెప్పాడు వెతుకుతున్నాడు కదా బాగా అలసిపోయాడు వెళ్లి కాఫీ ఇవ్వు అనేసి రోహిణి కి చెప్తుంది. బాలు ఎంట్రీ ఇచ్చి ఏంట్రా ఇప్పుడు కూడా జాబ్ రాలేదా అని ఎగతాళి చేస్తాడు అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్లో మీనా దగ్గర బాలు అప్పు తీసుకుంటాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో చూడాలి..

Related News

Today Movies in TV : సోమవారం టీవీల్లోకి రాబోతున్న సినిమాలు.. వీటిని మిస్ చెయ్యొద్దు…

Sravanthi Chokkarapu: తెల్లారితే పెళ్లి.. రాత్రికి రాత్రే ఆపని చేసిన  స్రవంతి..బయటపడ్డ నిజాలు!

Intinti Ramayanam Today Episode: భరత్, ప్రణతిలను విడగొట్టిన పల్లవి.. పోలీస్ స్టేషన్ పార్వతి.. నిజం బయటపడిందా?

Gundeninda GudiGantalu Today episode: మనోజ్ కు గుడ్ న్యూస్.. బాలును ఇరికించేసిన కల్పన..

Illu Illalu Pillalu Today Episode: భర్తను కాపాడిన భాగ్యం.. నర్మదకు మొదలైన అనుమానం.. శ్రీవల్లి సేఫ్..

Today Movies in TV : ఆదివారం టీవీలల్లోకి రాబోతున్న సినిమాలు.. ఆ రెండు మస్ట్ వాచ్..

Big Stories

×