Intinti Ramayanam Today Episode March 4th: నిన్నటి ఎపిసోడ్ లో.. అక్షయ్ మాత్రం అవని కోసం బాధపడుతూ ఉంటాడు ఆరాధ్య అవనికి ఫోన్ చేయమని అడుగుతుంది. ఆరాధ్య దయాకర్ కి ఫోన్ చేసి మాట్లాడుతుంది అవనికి ఇవ్వమని అడుగుతుంది. అవనితో అక్షయ్ ఫోన్ మాట్లాడుతాడు. ఆ తర్వాత అవని మాటలు విని అక్షయ్ ఎమోషనల్ అవుతాడు. ఆరాధ్య అమ్మని ఎప్పుడు తీసుకొద్దాం నాన్న అని అడుగుతుంది ఇంకొద్ది రోజుల్లో తీసుకొద్దామని అంటాడు. ఆరాధ్యకు నాన్నను బాగా చూసుకోవాలమ్మా అని అవని చెప్తుంది. అలాగే అమ్మ నాన్న నేను చాలా బాగా చూసుకుంటున్నాను నువ్వు ఎప్పుడొస్తావ్ అమ్మ నువ్వు త్వరగా వస్తే మనందరం కలిసే ఉండొచ్చు కదా అని ఆరాధ్య అంటుంది. రాజేంద్రప్రసాద్ ఇంట్లోని వాళ్లందరినీ పిలుస్తాడు. ప్రణతికి పెళ్లి సంబంధం మాట్లాడినట్లు అందరికీ చెప్తాడు. అయితే ఆ అబ్బాయి త్వరగా పెళ్లి చేసుకొని అమెరికా వెళ్లిపోతాడు. వాళ్ళ కుటుంబానికి పట్టింపులు ఎక్కువ. ఏదైనా పద్ధతిగా ఉండాలని అనుకుంటాడు అందుకే ఇంట్లో ప్రతిదీ అతనికి చెప్పాలని అనుకున్నాను అని రాజేంద్రప్రసాద్ అంటాడు. పట్టింపులు ఎక్కువ ఉన్నారు కదా నాన్న మరి అవని వదిన గురించి తెలిస్తే బాగోదేమో అనగానే రాజేంద్రప్రసాద్ అవనిని ఇంటికి పిలుద్దామని అనుకుంటున్నాను ఇలాంటి మంచి సంబంధం మళ్లీ మళ్లీ రాదు. అవి నేను పిలిచి పెళ్లి వరకు ఉంచితే బెటర్ అని నేను అనుకుంటున్నాను అని అనగానే అందరూ సంతోష పడతారు.. పార్వతి మాత్రం అవనిని తీసుకురావొద్దు అని అంటుంది. అందరు షాక్ అవుతుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. ప్రణతి పెళ్లికి ఒప్పుకోవడంతో ఇంట్లోని వాళ్లంతా గుడికి వెళ్తారు. అక్షయ్ కూడా అక్కడికి వస్తాడు. అవినీతో మాట్లాడుతుంటే అవని మాట్లాడడానికి ఇష్టపడదు. చూశారు కదండీ నేనెంత పరాయిదాన్ని అయిపోయాను. అక్కడ ప్రణతి పెళ్లి అన్న విషయం కూడా నాకు చెప్పడానికి అత్తయ్య ఇష్టపడడం లేదు ప్రణతి కూడా నా మొహం చూడడానికి ఇష్టపడటం లేదు నేను అక్కడి నుండి ఏం చేయాలి అని అవని వెళ్ళిపోతూ ఉంటుంది. బయట పల్లవి అవనీని ఆపుతుంది. నిన్ను ప్రణతి పెళ్లికి రాకుండా చేస్తానని శపధం చేస్తుంది. నేను అసలు ఇంట్లోకి రానివ్వనని పల్లవి అవనితో అంటుంది దానికి అవని కింద ఉన్న మట్టిని తీసుకొని చేతులు దులుపుకొని పల్లవి చంప మీద ఒకటిస్తుంది. నువ్వు నన్ను ఎప్పటికీ ఆపలేవు నీ నిజస్వరూపం ఏంటో అందరికీ తెలిసే రోజు వచ్చేసింది నువ్వు వెయిట్ చెయ్ ఆ తర్వాత ఏం జరుగుతుందో ఇంతకీ ఇంట్లో నువ్వు ఉంటావో నేనుంటాను చూడాలి అని వార్నింగ్ ఇస్తుంది.
అవని ఇంటికి రాగానే ఏడుస్తూ ఉంటుంది. స్వరాజ్యం, దయాకర్ ఇద్దరు అవని దగ్గరికెళ్ళి ఓదారుస్తారు ఏమైందమ్మా అసలు అని అడుగుతారు. కానీ అవని మాత్రం ప్రణతి నిశ్చితార్థం కి నన్ను పిలవలేదు నా కూతురు లాగా చూసుకున్నాను. కానీ ఇప్పుడు తన పెళ్లి చూపులకి పెళ్లికి నేను దగ్గర లేకపోవడంతో నాకు బాధగా ఉంది పిన్ని అనేసి బాధపడుతుంది. నువ్వు గట్టిగా అనుకుంటే ఆ విషయం కూడా జరిగిపోతుంది కానీ నువ్వు బాధపడితే ఏం ప్రయోజనం లేదని స్వరాజ్యం అవనీతో అంటుంది..
అటు రాజేంద్రప్రసాద్ ఇంట్లో ప్రణతి పెళ్లిచూపులు గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. ఒకేసారి నిశ్చితార్థం కోసం అన్ని ఏర్పాట్లు చేస్తారు. అయితే రాజేంద్రప్రసాద్ మాత్రం బాధపడుతూ ఉంటాడు. ఇంట్లో అవని లేకపోవడం ఇలాంటి శుభకార్యాలు చేసుకోవడం ఎలా అని అనుకుంటూ ఉంటాడు ఆ పార్వతి వెళ్లి అడగగానే ఇంక ఇంట్లో వాళ్ళందరూ కూడా అవన్నీ వస్తే బాగుండని అంటారు కానీ పల్లవి మాత్రం నిప్పు రాజేస్తుంది అవని వస్తే అవని గురించి అడుగుతారు అని అంటుంది. దానికి పార్వతి అవని ఇంటికి వస్తే బాగోదని అందరికీ వార్నింగ్ ఇస్తుంది.
ఇక పార్వతి అవని ఎలాగైనా ఇంటికి రాకుండా చేయాలని మగాళ్ళతో అవనీ ఇక పార్వతి అవని ఎలాగైనా ఇంటికి రాకుండా చేయాలని మగాళ్ళతో అవనీ పై ఓట్లు వేయిస్తుంది చేత ఓట్లు వేయిస్తుంది. అటు ప్రణతి తను ప్రేమించిన అబ్బాయికి ఫోన్ చేసి కాసేపట్లో ఎంగేజ్మెంట్ అయిపోతుంది అంటే నాకు పెళ్లి కూడా ఫిక్స్ అయిపోయిందని ఇంక అర్థం కానీ నువ్వు ఇంకా రాలేదు నన్నేం చేయమంటావని టెన్షన్ పడుతూ మాట్లాడుతుంది దాన్ని అక్షయ్ వింటాడు. పెళ్లి జరుగుతున్న సమయంలో ఇలా టెన్షన్ పడుతూ ఉంటావేంటి పెళ్లంటే ఎలా ఉండాలి అని అక్షయ్ ప్రణతితో అంటాడు.
ఇక రాజేంద్రప్రసాద్ ఇంటికి పెళ్లి వాళ్ళు వచ్చేస్తారు. అందరూ పలకరింపులు తర్వాత ఇంట్లోకి రావడానికి నీళ్లు ఇస్తే కాళ్ళు కడుక్కుంటామని అంటారు. పద్ధతులు పట్టింపులు రాజేంద్రప్రసాద్ కుటుంబం వాళ్లకి పద్ధతులు పట్టింపులు ఎక్కువమని చెప్పాను కదా ఈ మాత్రం ఉంటాయనేసి అనుకుంటారు. ఇంట్లో ఏర్పాటు చేస్తారు. ఇక ఇంటికి వచ్చిన వాళ్ళందరూ పరిచయాలు పెంచుకోవడానికి అందరితో మాట్లాడతారు. ఇక అక్షయ్ భార్య అవని గురించి అడుగుతారు అందరూ నీళ్లు నమ్ముతారు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. అవని ఇంట్లోకి వచ్చేస్తుంది ఆ తర్వాత ఏం జరుగుతుందో చూడాలి..