Alapati Rajendra Prasad: ఉమ్మడి కృష్ణా- గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర విజయం సాధించారు. కౌంటింగ్ పూర్తి కాకముందే ఆయన విజయం ఖాయమైంది. మొత్తం 2లక్షల 41వేల 873 ఓట్లు పోలవగా.. 21వేల 577 చెల్లని ఓట్లుగా అధికారులు గుర్తించారు. అయితే.. 7వ రౌండ్ కౌంటింగ్ ముగిసే సరికి ఆలపాటి రాజేంద్రకు లక్షా 18వేల 70 ఓట్లు వచ్చాయి. 50 శాతానికి పైగా ఆలపాటి ఓట్లు సాధించడంతో ఆయనను విజేతగా ప్రకటించారు.
ఏడు రౌండ్లు ముగిసే సరికి ఆలపాటి 67వేల 252 ఓట్ల మెజారిటీ సాధించారు. ఓట్ల లెక్కింపులో కూటమి అభ్యర్ధి ఆలపాటి ప్రతి రౌండులోనూ ఆధిక్యం ప్రదర్శించారు. 9 రౌండ్లలో ఓట్ల లెక్కింపు పూర్తవుతుంది. ఏడు రౌండ్లకే ఆలపాటి విజయం ఖాయమైంది. బ్యాలెట్ పద్ధతి కావడం, బరిలో 25మంది అభ్యర్థులు ఉండడంతో లెక్కింపునకు ఎక్కువ సమయం తీసుకుంది. ఎన్నికల కమిషన్ ఆలపాటిని విజేతగా ప్రకటించినప్పటికీ ఇవాళ 10 గంటల వరకు ఓట్ల లెక్కింపు కొనసాగే అవకాశం ఉంది.
ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీగా PRTU అభ్యర్థి గాదె శ్రీనివాసులు నాయుడు విజయం సాధించారు. సిట్టింగ్ ఎమ్మెల్సీ రఘువర్మపై ఆయన రెండో ప్రాధాన్యత ఓట్లతో గెలిచారు. ఈ స్థానానికి పది మంది పోటీ చేయగా.. ఎనిమిది మందిని ఎలిమినేట్ చేయడంతో శ్రీనివాసులు నాయుడు విజయం ఖాయమైంది. ఉత్తరాంధ్రలో మొత్తంగా 20వేల 783 మంది ఓటు వేశారు. అందులో 19వేల 813 ఓట్లు మాత్రమే చెల్లినవిగా గుర్తించారు అధికారులు.
ఓట్ల లెక్కింపులో తొలి నుంచి ఆధిక్యంలో కొనసాగిన PRTU అభ్యర్థి శ్రీనివాసులు నాయుడు విజయం సాధించారు. ఇక ఉమ్మడి గోదావరి జిల్లాల గ్రాడ్యువేట్ ఎమ్మెల్సీ ఎన్నికల కౌటింగ్ కొనసాగుతోంది. ఇక్కడ కూటమి అభ్యర్థి రాజశేఖర్ ఆధిక్యంలో ఉన్నారు. మొత్తం 28 వేల ఓట్లకు గానూ.. ఆయన 16, 520 ఓట్లు సాధించగా.. స్వతంత్ర అభ్యర్ధి దిడ్ల వీరరాఘవులుకు 5, 815 ఓట్లు వచ్చాయి. ఈ నేపథ్యంలో.. అఫిసియల్‌గా కలెక్టర్ చేతుల మీదగా ఎమ్మెల్సీగా గెలిచినటువంటి సర్టిఫికేట్‌ను ఆళ్లపాటి రాజా మరికాసేపట్లో తీసుకోనున్నారు.
Also Read: చంద్రబాబు సర్కార్ కు భారీ షాక్.. టీచర్ ఎమ్మెల్సీగా పీఆర్టీయూ అభ్యర్ధి విజయం
కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్రప్రసాద్ తన గెలుపు సందర్భంగా మాట్లాడారు. ఎమ్మెుల్సీ ఎన్నికల్లో ఘన విజయం అపూర్వమనీ. కూటమి అభ్యర్ధిని గెలిపించాలని.. ఓటర్లు ముందుగానే డిసైడ్ అయ్యారనీ. ఎన్నికల్లో వైసీపీ ఎప్పటికప్పుడు మాట మారుస్తూ వచ్చిందనీ. చివరికి పీడీఎఫ్ అభ్యర్ధికి వైసీపీ మద్దతిచ్చిందని అన్నారాయన. వైసీపీ సమాజానికి చేసిన అన్యాయం మర్చిపోయారనుకుంటే ప్రజలు గుణపాఠం చెప్పారని అన్నారు ఆలపాటి.
483 బూతులతో ఒక్క బూత్ లో కూడా పీడీఎఫ్ అభ్యర్ధికి మెజార్టీ రాలేదు. తప్పుడు ఆరోపణలు చేస్తూ ఎదుటివారిపై బురద జల్లే విధంగా రాజకీయాలు చేశారు. నాకు వచ్చిన మెజార్టీ అంతా ఓట్లు కూడా పీడీఎఫ్ అభ్యర్ధికి రాలేదు. పీడీఎఫ్ కూడా ఇతర రాజకీయ పార్టీల్లా తయారైతే సమాజంలో గౌరవం తగ్గిపోతుందని అన్నారాయన.