Intinti Ramayanam Today Episode May 13th: నిన్నటి ఎపిసోడ్ లో.. రాజేంద్రప్రసాద్ కిందకు వస్తాడు.. అక్కడ పార్వతి తినడం చూసి షాక్ అవుతాడు. నేను రాకపోతే మీ అమ్మ అన్నం తినదు అన్నావు కదా.. ఇప్పుడు ఇదేంటి నాకన్నా ముందు మీ అమ్మ అన్నం తింటుంది. అంటే నేను మీ అమ్మకు అక్కర్లేదు కదా ఇది నువ్వు ఆలోచించరా నాకు భోజనం చేయాలని లేదు అని వెళ్ళిపోతాడు. అన్ని పట్టించుకోకుండా రండి నాన్న అని కమల్ తీసుకెళ్లి కూర్చోబెడతాడు.. శ్రీయని వడ్డించమని చెప్తాడు.. కానీ తను వడ్డించదు.. కమల్ రాజేంద్రప్రసాద్ ప్లేట్లో భోజనం వడ్డిస్తాడు. అక్షయ్ కోపంతో వాళ్ళ నాన్న చెప్పిన మాటలు గుర్తు చేసుకొని చేయి కడిగేసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.. తర్వాత పార్వతి కూడా చెయ్యి కడుక్కొని వెళ్ళిపోతుంది. అలా ఒక్కొక్కరు భోజనం దగ్గర నుంచి వెళ్ళిపోతారు. రాజేంద్రప్రసాద్ కూడా అక్కడినుంచి వెళ్ళిపోతాడు. ఇంట్లో వాళ్ళందరూ చేసిన పరిస్థితిని తలుచుకుంటూ బాధపడుతూ ఉంటాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. బిక్షగాడు వస్తేనే ఇంటికి భోజనం పెడతారు అలాంటిది నేను రాగానే నన్ను భోజనానికి కూడా పట్టించుకోకుండా మీ పార్టీకి మీరు తింటున్నారు అట్లే వెళ్లిపోయారు కూడా.. నేను మీకు ఎవరికి అక్కర్లేదని నాకు అర్థం అయిపోయిందని అంటాడు. నాకు మాది తప్పయింది మీ మమ్మల్ని క్షమించండి అని పార్వతి రాజేంద్ర ప్రసాద్ ని అడుగుతుంది. అక్షయ్ ఇంట్లో లేడు అక్షయ్ ద్వారా కూడా క్షమాపణ చెప్పిస్తాను మీరు దయచేసి వెనక్కి రండి మీ నిర్ణయాన్ని మార్చుకోండి అని అడుగుతుంది. కానీ రాజేంద్రప్రసాద్ ఇదే మాటని నేను అవని విషయంలో అంటే మీరు ఒప్పుకుంటారా అని అడుగుతాడు.
అవని నేను క్షమించి ఇంటికి తీసుకురండి అంటే మీరు క్షమించి ఇంటికి తీసుకొస్తారా..? అవని విషయంలో మీరు చేసేది తప్పు అంటే మీరు నమ్ముతారా ఇప్పటికైనా మీరు అవనిని ఇంటికి తీసుకొస్తారా అప్పుడైతే తప్ప నేను ఇంట్లో ఉండను అని రాజేంద్రప్రసాద్ అడుగుతాడు. కానీ పార్వతి నా ప్రాణానైనా మీకు ఇస్తాను గాని అవనిని ఇంటికి తీసుకురాను అని చెప్పేస్తుంది దాంతో రాజేంద్రప్రసాద్ నేను కూడా ఇక్కడ మీ అందరితో ఉండలేనని వెళ్లిపోతాడు.
ఇక రాజేంద్రప్రసాద్ అక్కడ నుంచి వెళ్ళిపోయి దయాకర్ వాళ్ళింటికి రాజేంద్రప్రసాద్ వెళ్లిపోతాడు. ఎంతో ప్రేమగా అందరూ పలకరిస్తారు. స్వరాజ్యం మీరు కూర్చొని నుండి అన్నయ్య నేను ఒక అరగంటలో భోజనం చేసుకుని తీసుకొస్తానని అంటుంది. ఒక్కరోజు భోజనం చేసి వెళ్లిపోవడానికి రాలేదమ్మా మీ సంతోషంలో నేను భాగం పంచుకోడానికి వచ్చాను నన్ను ఇక్కడ ఉండనిస్తారని అడుగుతాడు.. స్వరాజ్యం మీరు ఇక్కడ నిరభ్యంతరంగా ఉండవచ్చు ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు మీరు ఇక్కడే ఉన్నాను అన్నయ్య మీరు ఇక్కడ ఉండటం వల్ల మాకు ఎటువంటి సమస్య లేదు అని అంటుంది..
కానీ మీరు తప్పు చేసారు మామయ్య అక్కడ వాళ్ళందరూ మీకోసం ఎదురు చూస్తూ ఉంటారు అని అవని అంటుంది.. రాజేంద్రప్రసాద్ ప్రసాద్ నువ్వు అనుకున్నట్లు నాకోసం ఎవరు అక్కడ వెయిట్ చేయలేదమ్మా కనీసం నాతో కలిసి భోజనం చేయడానికి కూడా ఎవరు ఇష్టపడట్లేదు అని అంటాడు. పార్వతి ఏడుస్తూ ఉంటుంది ఇంట్లోనే వాళ్ళందరూ ఆమెను ఓదార్చడానికి ప్రయత్నిస్తారు. అప్పుడే అక్షయ అక్కడికొస్తాడు.
ఏమైంది అమ్మ ఎందుకు ఏడుస్తుంది అని అక్షయ్ అడుగుతాడు.. శ్రీయా మావయ్య గారు ఇంట్లో నుంచి వెళ్లిపోయారని చెప్తుంది. అవని అక్క మంచిదని అవని ఇంటికి తీసుకొని వస్తే నేను ఇక్కడ ఉంటానని రాజేంద్రప్రసాద్ అన్నట్లు పల్లవి అంటుంది. అవినికి ఎలా బుద్ధి చెప్పాలో నాకు తెలుసు అని అక్షయ్ అవనికి కోర్టు నోటీసులు పంపిస్తాడు. అది చూసిన అవని షాక్ అవుతుంది. ఎందుకు ఏమైంది అని అందరూ అడుగుతారు. రేపు కోర్టులోనే తేల్చుకుందామని రాజేంద్ర ప్రసాద్ అంటాడు.
ఇక ఉదయం లేవగానే అక్షయ పార్వతి వాళ్ళ కుటుంబం కోర్టు కొస్తారు.. అలాగే అవని రాజేంద్రప్రసాద్ వాళ్ళందరూ కలిసి కోర్టుకు వస్తారు. అక్షయ్ చేసింది తప్పు అని అందరూ వాదిస్తారు.. కానీ అక్షయ్ మాత్రం నేను చేసింది తప్పైతే మీరు చేసింది కూడా తప్పే అని అందరిని అరుస్తాడు.. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపు ఎపిసోడ్ విషయానికి వస్తే ఏం జరుగుతుందో..