Intinti Ramayanam Today Episode May 23rd: నిన్నటి ఎపిసోడ్ లో.. అక్షయ్-అవని వెతికి వెతికి రోడ్డు మీద కారు ఆపి టెన్షన్ పడుతూ ఉంటారు. మనం ఎంత వెతికినా ఆరాధ్య కనిపించలేదు.. పదండి పోలీస్ కంప్లయింట్ ఇద్దామని అవని సలహా ఇస్తుంది. ఇంతలో సిక్కు వేషంలో ఓ క్యారెక్టర్ ఎంట్రీ ఇస్తుంది. ఇంతకీ అది మారువేషంలో ఉన్న కమల్. అవని-అక్షయ్ దగ్గరికొచ్చి.. ఏమైంది మీకి ఇద్దరూ ఫుల్ టెన్షన్‌లో ఉన్నట్లు కనిపిస్తున్నారు.. మీకి ప్రాబ్లమ్ ఏంటో మాకీ చెబుతారా అని అడుగుతాడు. దీంతో అవని విషయం చెబుతుంది. ఆరాధ్య ఫొటో చూపించి ఎక్కడైనా చూశారా అని అక్షయ్ కూడా అడుగుతాడు. చెప్తా కానీ ఆ పాపకి మీరిద్దరూ ఏమవుతారు.. మీరిద్దరి మధ్య అసలు రిలేషన్ ఏంటి అని కమల్ అడుగుతాడు.. అక్షయ్ అవని పై సీరియస్ అవుతాడు. మొత్తానికి ఆరాధ్య దొరుకుతుంది.. కండీషన్ కు ఒప్పుకోవడంతో ఇంటికి వస్తుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. అవని ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడే ఆరాధ్య అక్కడికి వచ్చి ఏంటమ్మా నా మీద కోపంగా ఉందా ఎందుకు అలా ఉన్నావ్ అని అడుగుతుంది.. నువ్వు ఇలా చేయడం వల్ల నేను ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా? ఎవరైనా నిన్ను తీసుకెళ్ళిపోతే ఏం చేయాలి అని అవని ఆరాధ్యతో అంటుంది అప్పుడే సింగ్ వేషంలో ఉన్న కమల్ ఇంటికి వస్తాడు. అబద్ధం చెప్పలేక అసలు నిజం అని బయట పెడతాడు. ఆరాధ్యను నేను కారులో చూసి ఆరాధ్యను తీసుకెళ్లి అవని అక్షయలను కలపాలని అనుకుంటాడు.. ఆ విషయం మొత్తాన్ని అవనితో చెప్పేస్తాడు.
కమల్ చేసిన పనికి అవని సంతోషపడుతుంది. నువ్వు చేసింది బాగానే ఉంది కానీ అన్నయ్య ఈ విషయం తెలిస్తే బాధపడతారేమో అని అంటుంది. ఆరాధ్య బాధను చూడలేకనే నేను ఇదంతా చేశాను వదిన రేపు తప్పకుండా అన్నయ్య స్కూల్ కి వస్తాడు. చూడు మీరిద్దరూ కలిసి తిరుగుతూ ఉంటేనే మీ ఇద్దరి మధ్య కోపం తగ్గి ప్రేమ పుట్టుతుంది అని కమల్ సలహా ఇస్తాడు. ఇక ఇంటికి వెళ్తాను వదిన ఇప్పటికే లేట్ అయింది ఇంట్లో వాళ్ళకి అనుమానం వస్తుంది అని కమల్ వెళ్ళిపోతాడు. పార్వతి వాళ్ళ కుటుంబం అంతా భోజనానికి కూర్చొని అన్నం తింటూ ఉంటారు. కమల్ ఎడమ పల్లవి ఇంకా రాలేదు అని అవుతుంది పార్వతి. ఏమో అత్తయ్య భోజనానికి పిలిచాను కానీ తన ఫ్రెండ్స్ తో ఎవరితోనో ఫోన్ మాట్లాడుతూ సోది వేసుకున్నాడు వస్తాడులేండి అని అంటుంది.
అక్షయ్ భోజనం చేయకుండా ఆలోచిస్తూ ఉంటాడు. భానుమతి అరే అక్షయ్ భోజనం చేయకుండా ఆలోచిస్తున్నావ్ ఏంటి అని అడుగుతుంది. ఆరాధ్యకు ఇచ్చిన మాట కోసం నేను ఆలోచిస్తున్నాను అని అంటాడు అక్షయ్. స్కూల్ అన్యువల్ డే ఫంక్షన్ కి వస్తేనే నేను ఇంటికి వస్తానని ఆరాధ్య అంది తనకి మాటిచ్చాను అందుకే అవనితో వెళ్ళింది అని అక్షయ్ అంటాడు. మరి నువ్వేమనుకుంటున్నావో చెప్పు అని పార్వతి అంటుంది. నా కూతురు కోసమైతే నేను కచ్చితంగా వెళ్లాలి. అవనీకి భర్తగా నాకు వెళ్లడం ఇష్టం లేదు అని అంటాడు అక్షయ్. ఇక పల్లవి అంత ఇష్టం లేనప్పుడు మీరు అవని అక్కకి విడాకులు ఇవ్వచ్చు కదా బావగారు అని అంటుంది. ఇష్టం లేకుండా కలిసి ఉండడం కంటే విడిపోయి ఎవరి లైఫ్ వాళ్ళు సంతోషంగా గడపొచ్చు కదా అని పల్లవి అంటుంది.
ఆ మాట విన్న అక్షయ్ షాక్ అవుతాడు. అయితే పార్వతి కూడా పల్లవి చెప్పింది కూడా నిజమే కదరా. అవని చేసిన పనులన్నీ గుర్తుకొస్తే నాకు నిద్ర కూడా పట్టడం లేదు. నా ఇంటి కోడలుగా మళ్లీ అవని అడుగు పెట్టడం నాకు అస్సలు ఇష్టం లేదు. ఇక నువ్వు కూడా నీ భార్యగా అవన్నీ ఊహించుకోలేకపోతున్నావు అని అంటుంది. అది విన్న అక్షయ్ కోర్టులో అవినీకి అనుకూలంగా తీర్పు వచ్చింది. ఆరాధ్యను అవని దగ్గరే ఉంచేలా చేశారు.. ఇప్పుడు నేను విడాకులు ఇస్తే నా కూతుర్ని కూడా చూసుకో లేకుండా పోతాను అని అక్షయ్ అంటాడు.
ఆ మాట విన్న కమల్ నువ్వు సూపర్ అన్నయ్య చాలా బాగా చెప్పావు అని అంటాడు. పల్లవి నువ్వు లేవనుకొని చెప్పా నువ్వు వచ్చావా అని ఆలోచిస్తుంది. అన్నయ్య వదిన కలిసి ఉండట్లేదు కదా అని విడాకులు తీసుకోమని చెప్పావు. మరి అమ్మ నాన్న కూడా కలిసి లేరు కదా విడాకులు తీసుకోమని చెప్పొచ్చు కదా అని షాక్ ఇస్తాడు. ఈ ఇంట్లో ఎప్పుడూ భోజనాల టైంలో ఏదో ఒక గొడవ జరుగుతుందని పార్వతి వెళ్ళిపోతుంది. శ్రీకర్ అన్నయ్య రేపు మీ ఆవిడకి కూడా విడాకులు తీసుకోమని పల్లవి చెప్తుంది జాగ్రత్త అనేసి అంటాడు.
వాళ్ళు ఎవరికి వాళ్ళు వ్యతిరేకంగా ఉన్నారు కదా.. అందుకే విడాకులు తీసుకొని హ్యాపీగా ఉండొచ్చు కదా అని అన్నాను బావ అని పల్లవి అంటుంది. అలాగైతే నీకు వ్యతిరేకంగా నేను ఆలోచిస్తాను. మరి నీకు కూడా విడాకులు ఇవ్వమంటావా అని కమల్ అంటాడు. ఇక భానుమతికి ఇంట్లో వాళ్ళిద్దరిని కలపాలని చెప్తాడు. ఆరాధ్య చేత రాజేంద్రప్రసాద్ కేక్ కట్ చేస్తాడు. అందరూ కలిసి ఉంటే బాగుండు కదమ్మా అని ఆరాధ్య అంటుంది. అవును రేపు మీ నాన్న వస్తాడు రాడు నాకు నమ్మకం లేదమ్మా అని అవని ఆరాధ్యతో అంటుంది. అంతా ఇష్టం లేనప్పుడు విడాకులు తీసుకొని హ్యాపీగా ఉండొచ్చు కదా కానీ భరత్ అంటాడు. భరత్ చెంప పగలగొట్టి భార్య భర్తల బంధం గురించి గొప్పగా చెప్తుంది అవని. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..