Intinti Ramayanam Today Episode May 24th: నిన్నటి ఎపిసోడ్ లో.. అవని ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే ఆరాధ్య అక్కడికి వచ్చి ఏంటమ్మా నా మీద కోపంగా ఉందా ఎందుకు అలా ఉన్నావ్ అని అడుగుతుంది.. నువ్వు ఇలా చేయడం వల్ల నేను ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా? ఎవరైనా నిన్ను తీసుకెళ్ళిపోతే ఏం చేయాలి అని అవని ఆరాధ్యతో అంటుంది అప్పుడే సింగ్ వేషంలో ఉన్న కమల్ ఇంటికి వస్తాడు. అబద్ధం చెప్పలేక అసలు నిజం అని బయట పెడతాడు. ఆరాధ్యను నేను కారులో చూసి ఆరాధ్యను తీసుకెళ్లి అవని అక్షయలను కలపాలని అనుకుంటాడు.. ఆ విషయం మొత్తాన్ని అవనితో చెప్పేస్తాడు. కమల్ చేసిన పనికి అవని సంతోషపడుతుంది. నువ్వు చేసింది బాగానే ఉంది కానీ అన్నయ్య ఈ విషయం తెలిస్తే బాధపడతారేమో అని అంటుంది. ఆరాధ్య బాధను చూడలేకనే నేను ఇదంతా చేశాను వదిన రేపు తప్పకుండా అన్నయ్య స్కూల్ కి వస్తాడు. చూడు మీరిద్దరూ కలిసి తిరుగుతూ ఉంటేనే మీ ఇద్దరి మధ్య కోపం తగ్గి ప్రేమ పుట్టుతుంది అని కమల్ సలహా ఇస్తాడు. అక్కడ పల్లవి విడాకుల సలహా ఇవ్వడంతో కమల్ సీరియస్ అవుతాడు. అటు భరత్ చెంప పగలగొడుతుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. తర్వాత రోజు ఉదయం అందరూ కలిసి ఆరాధ్య కోసమని స్కూలుకు వెళ్తారు. ముందుగా అవని రాజేంద్రప్రసాద్ ఆరాధ్య అక్కడికి వస్తారు. అయితే అక్షయ్ వాళ్ళు ఇంకా రాకపోవడంతో ఆరాధ్య నాన్న రాడా అమ్మ అంటూ టెన్షన్ పడుతుంది. అప్పుడే అక్కడికి పార్వతీ పల్లవి, శ్రీయా, కమల్ వస్తారు. అందరూ ఆరాధ్యను చూసి సంతోష పడతారు. చూడగానే ఆరాధ్య వాళ్ళ నాన్న దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్తుంది. నువ్వు రావని అనుకున్న నాన్న కానీ అమ్మ చెప్పినట్లే నువ్వు వస్తావని వచ్చేసావు అని ఆరాధ్య అంటుంది. నీకోసం రాకుండా ఎలా ఉంటాను నాన్న అని అక్షయ్ ఆరాధ్యం ఎత్తుకొని ముద్దాడతాడు. ఇక కమ్మలు ఆరాధ్యని ఎత్తుకొని ముద్దులు వర్షం కురిపిస్తాడు..
ఇక పార్వతి రాజేంద్రప్రసాద్ నువ్వు ఎలా ఉన్నారని అడుగుతుంది. మంచి మనసులు మధ్య ఉన్నాను కదా మనశ్శాంతి గానే ఉన్నాను అని రాజేంద్రప్రసాద్ అంటాడు. కమల్ గూడా బాగున్నారు నాన్న అంటే మంచి మనుషులే కదరా బాగానే ఉన్నాను అని సమాధానం చెప్తాడు. ఇక అందరూ కలిసి లోపలికి వెళ్ళిపోతారు. ఆరాధ్య టీచర్తో మా అమ్మానాన్న వచ్చారు టీచర్ అని చెప్తూ ఉంటుంది. అప్పుడే కమలొచ్చి ఆరాధ్యను ఎత్తుకొని మరి మాట్లాడుతూ ఉంటాడు. నువ్వు చెప్పిన ప్లాన్ సూపర్ సక్సెస్ అయింది బాబాయ్. నన్ను తీసుకెళ్లి ఒక చెట్టు దగ్గరికి వచ్చి పెట్టావు అమ్మ నాన్న అక్కడికి వచ్చారు. నువ్వు చెప్పినట్లుగానే నేను ఫంక్షన్కు వస్తేనే వస్తానని చెప్పాను. అలానే వాళ్ళు ఒప్పుకున్నారు. ఇప్పుడు వచ్చారు నేను చాలా సంతోషంగా ఉన్నాను థాంక్యూ అనేసి అంటుంది..
అయితే కమల్ఆరాధ్య మాట్లాడుకోవడం పల్లవి వింటుంది.. నేను అవని అక్షయలను విడగొట్టాలని చూస్తుంటే.. ఈ తింగరోడు మాత్రం కలపాలని ప్లాన్లు వేస్తున్నాడా అంటూ పల్లవి కమల్ ని తిట్టుకుంటుంది. ఈ విషయాన్ని వెంటనే పార్వతీతో చెప్పాలని అక్కడికి వెళుతుంది. అత్తయ్య ఆరాధ్య మిస్ అవ్వడానికి ఇలా అక్షయ్ బావ అవని కలిసి స్కూల్ కి రావడానికి కారణం ఎవరో తెలుసా? మీ చిన్న కొడుకు కమలే అని నిజం చెప్తుంది. ఏంటి పల్లవి నువ్వు చెప్పేదే అని పార్వతి అడుగుతుంది. కమల్ కి ఇంత తెలివి లేదు ఇదంతా చేయడానికి కారణం అవనీనేని పల్లవి అంటుంది.. ఇక అవనీని అడగాలని పార్వతి వెళుతుంది.
వీళ్ళు మాట్లాడుకోవడం రాజేంద్రప్రసాద్ వింటాడు. పార్వతి అవని దగ్గరికెళ్ళి మాకు దగ్గర వాళ్ళని నువ్వు ఇలాంటి చెత్త పనులు చేస్తా అని మేము అసలు ఊహించలేదు అంటూ నోటికొచ్చినట్టు మాట్లాడేస్తుంది. ఏదని గురించి మాట్లాడుతున్నారత్తయ్య నేనేది చెప్పినా కూడా మీరు నమ్మరు. నాదే తప్పు అని అంటారు అందుకే నేను మీకు ఏమీ చెప్పాలని అనుకోవట్లేదు మీరు దేని గురించి మాట్లాడుతున్నారు అది చెప్పండి అని అడుగుతుంది. దొంగ నాటకాలు ఆడి మళ్లీ మాకు దగ్గర అవ్వాలని చూస్తున్నావా అంటూ పార్వతి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేస్తుంది.
దొంగ నాటకాలు ఆడాల్సిన అవసరం నాకు లేదు.. నేను అలాంటి దాన్నే అయితే ఎప్పుడో నా స్వార్థం చూసుకొని వెళ్ళిపోయే దానిని అవని అంటుంది. పల్లవి నువ్విలా మోసం చేసి అక్షయ్ బావకి దగ్గర అవ్వాలని చూస్తున్నావా అని ఏదేదో అంటుంది. దానికి అవని సీరియస్ అవుతుంది. నీలాంటి వాళ్లకు సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు అత్తయ్య నన్ను ప్రశ్న వేసింది నేను సమాధానం చెప్తున్నాను అని దిమ్మతిరిగేలా చెప్తుంది. ఇక వీళ్ళ మాటలు విన్న రాజేంద్రప్రసాద్ ఇంటి పరువుని ఇక్కడ కూడా తీస్తారా కొంచమైన బుద్ధుండాలి అని అందరినీ కడిగి పడేస్తాడు. ఆ తర్వాత అక్కడికి వెళ్లి కూర్చుంటారు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి.