Intinti Ramayanam Today Episode May 25th: నిన్నటి ఎపిసోడ్ లో.. అందరూ కలిసి ఆరాధ్య కోసమని స్కూలుకు వెళ్తారు. ముందుగా అవని రాజేంద్రప్రసాద్ ఆరాధ్య అక్కడికి వస్తారు. అయితే అక్షయ్ వాళ్ళు ఇంకా రాకపోవడంతో ఆరాధ్య నాన్న రాడా అమ్మ అంటూ టెన్షన్ పడుతుంది. అప్పుడే అక్కడికి పార్వతీ పల్లవి, శ్రీయా, కమల్ వస్తారు. అందరూ ఆరాధ్యను చూసి సంతోష పడతారు. చూడగానే ఆరాధ్య వాళ్ళ నాన్న దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్తుంది. నువ్వు రావని అనుకున్న నాన్న కానీ అమ్మ చెప్పినట్లే నువ్వు వస్తావని వచ్చేసావు అని ఆరాధ్య అంటుంది. నీకోసం రాకుండా ఎలా ఉంటాను నాన్న అని అక్షయ్ ఆరాధ్యం ఎత్తుకొని ముద్దాడతాడు. ఇక కమ్మలు ఆరాధ్యని ఎత్తుకొని ముద్దులు వర్షం కురిపిస్తాడు..
ఇక పార్వతి రాజేంద్రప్రసాద్ నువ్వు ఎలా ఉన్నారని అడుగుతుంది. మంచి మనసులు మధ్య ఉన్నాను కదా మనశ్శాంతి గానే ఉన్నాను అని రాజేంద్రప్రసాద్ అంటాడు. కమల్ గూడా బాగున్నారు నాన్న అంటే మంచి మనుషులే కదరా బాగానే ఉన్నాను అని సమాధానం చెప్తాడు. ఇక అందరూ కలిసి లోపలికి వెళ్ళిపోతారు.
ఆరాధ్య టీచర్తో మా అమ్మానాన్న వచ్చారు టీచర్ అని చెప్తూ ఉంటుంది. అప్పుడే కమలొచ్చి ఆరాధ్యను ఎత్తుకొని మరి మాట్లాడుతూ ఉంటాడు. నువ్వు చెప్పిన ప్లాన్ సూపర్ సక్సెస్ అయింది బాబాయ్. నన్ను తీసుకెళ్లి ఒక చెట్టు దగ్గరికి వచ్చి పెట్టావు అమ్మ నాన్న అక్కడికి వచ్చారు. నువ్వు చెప్పినట్లుగానే నేను ఫంక్షన్కు వస్తేనే వస్తానని చెప్పాను. అలానే వాళ్ళు ఒప్పుకున్నారు. ఇప్పుడు వచ్చారు నేను చాలా సంతోషంగా ఉన్నాను థాంక్యూ అనేసి అంటుంది.. కమల్ ఆరాధ్యతో నాటకం ఆడాడని తెలుసుకొని పల్లవి షాక్ అవుతుంది.. ఆ విషయాన్ని పార్వతితో చెప్తుంది. పార్వతి వెళ్లి అవనిని అడుగుతుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇక ప్రోమో విషయానికోస్తే.. అక్షయ్ దగ్గరకు వెళ్లిన అవని మీరు రారేమో అనుకున్నానండీ.. మీరు రాకపోతే ఆరాధ్య చాలా ఫీల్ అయ్యేది. వచ్చినందుకు చాలా థాంక్స్ అండీ’అని అంటుంది. ఆ మాటతో అక్షయ్.. నేను వచ్చింది నీ కోసం కాదు.. నా కూతురి కోసం అని అంటాడు. నాకోసం వచ్చారని చెప్పడం లేదు.. నా కోసం రాలేదని అంటున్నారంటే.. నా గురించి కూడా ఆలోచిస్తున్నారన్నమాట అని అంటుంది అవని..
అదంతా నీ భ్రమ మాత్రమే నేను వచ్చింది నా కూతురు కోసమే అని అక్షయ్ తేల్చి చెప్పేస్తాడు. నాది భ్రమకావచ్చు. రేపు అనేది మాత్రం నిజం. మీరు నాకోసం వచ్చేరోజు దగ్గరలోనే ఉంది అని అంటుంది. ఆ మాటతో అక్షయ్.. జరగని వాటి కోసం ఎక్కువ ఆలోచించుకోకు. ఆశలు పెట్టుకోకు అని అంటాడు. మనిషిని బతికించేదే ఆశ. ఆశ అనేదే లేకపోతే ఆశయమే లేదు. అవని మాటలు విన్నా అక్షయ్ కోపంతో వెళ్లిపోతాడు ఇంకా అందర్నీ ఫంక్షన్ లో హాల్లో కూర్చొని టీచర్లు చెప్తారు.. ఫంక్షన్ కి చీఫ్ గెస్ట్ గా కలెక్టర్ వచ్చారని చెప్పారు. అందరూ స్కూల్ గురించి స్కూల్ గొప్పతనం గురించి అలాగే పిల్లల తీరు గురించి గొప్పగా చెప్తారు. అందులో ఆరాధ్యను ఎక్కువగా మెన్షన్ చేస్తూ చెప్పడంతో రాజేంద్ర ప్రసాద్ కుటుంబం సంతోష పడతారు.
అవార్డులను తీసుకోవడానికి ఆరా తిను స్టేజ్ మీదకి రమ్మని టీచర్ పిలుస్తుంది. స్టేజ్ మీదకి వెళ్ళిన ఆరాధ్య. నేను ఈ అవార్డులను మా అమ్మ నాన్న చేత తీసుకోవాలని అనుకుంటున్నాను అని చెప్తుంది. ఆరాధ్యకు వాళ్ళ అమ్మ నాన్న ఎంత సంతోషంగా చూసుకుంటున్నారో అందుకే అమ్మాయి వాళ్ళ అమ్మ నాన్న చేతుల మీదుగాని అవార్డులు తీసుకోవాలని కోరుకుంటుందని కలెక్టర్ అంటాడు. అవార్డులను తీసుకున్న తర్వాత ఒక ఆవిడొచ్చి నేను మాట్లాడాలని స్టేజ్ మీదకు వచ్చి మాట్లాడుతుంది. వాళ్ళ అమ్మ నాన్న కలిసేం లేరు విడివిడిగా ఉన్నారు అని పరువు పోయేలా మాట్లాడుతుంది. ఆ తర్వాత అవని మైకు తీసుకొని మాట్లాడుతుంది. తన భర్తకు తన మీద ఉన్న ప్రేమ గురించి చెప్తుంది. అక్కడితో ప్రోమో ఎండ్ అవుతుంది. సోమవారం ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..