OTT Movie : హారర్ సినిమాలు ఇప్పుడు ప్రతి భాషలో ట్రెండ్ అవుతున్నాయి. మంచి కంటెంట్ తో వస్తున్న ఇటువంటి సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు మేకర్స్. అందుకే వీటిని భాషతో ప్రమేయం లేకుండా ఆదరిస్తున్నారు ప్రేక్షకులు. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమా పిల్లల్ని టార్గెట్ చేసే ఒక దెయ్యం చుట్టూ తిరుగుతుంది. ఈ మూవీ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే
స్టోరీలోకి వెళితే
రమోనా, డేవిడ్ అనే దంపతులు తన ఇద్దరు పిల్లలు టేలర్, ఆనీ లతో కలసి జీవిస్తుంటారు. డేవిడ్ ఒక కారు ప్రమాదంలో గాయపడి చనిపోతాడు. ఆ తరువాత రమోనా తన ఇద్దరు పిల్లలతో ఒక ఫామ్‌హౌస్‌లో నివసిస్తుంది. రమోనా కూడా ఈ ప్రమాదంలో గాయపడి డిప్రెషన్ లోకి వెళ్ళిపోతుంది. ఆమె ఒంటరిగా బాధపడుతూ, తన పిల్లలతో కూడా కాస్త దూరంగా ఉంటుంది. ఒక రోజు నల్లటి వస్త్రాలు ధరించిన ఒక మహిళ వారి ఇంటి ముందు యార్డ్‌లో కనిపిస్తుంది. ‘ఇవాళ్టి రోజు’ అని భయంకరంగా అరుస్తూ ఉంటుంది. ఈ మహిళ ఎవరో, ఆమె ఉద్దేశ్యం ఏమిటో ఎవరికీ తెలియదు. రమోనా తన పిల్లలను ఆమె నుండి దూరంగా ఉంచడానికి ప్రయత్నిస్తుంది.
ఎందుకంటే అది పిల్లల్ని తినేస్తాను అని భయపెడుతుంది. రమోనా దానికి దూరంగా ఉండమని, పిల్లలకి ధైర్యం చెప్తుంది. కానీ టేలర్ ఆమె తల్లి మాటలను వినకుండా ఆ మహిళని ఎదిరించాలని అనుకుంటాడు. ఈ విషయం తెలుసుకున్న రమోనా అతనిపై బాగా కొప్పడుతుంది. రమోనా తన పిల్లలను సురక్షితమైన పొరుగు ఫామ్‌కు పంపి, ఈ వింత ఆకారాన్ని ఎదుర్కొంటుంది. చివరికి రమోనా ఇంట్లో ఉన్న ఆ వింత ఆకారం ఎవరు ? ఆమె భర్త మరణం వెనుక అసలు నిజం ఏమిటి ? రమోనా ఆ వింత ఆకారంతో ఎటువంటి సమస్యలను ఎదుర్కొంటుంది. అనే విషయాలను తెలుసుకోవాలి అనుకుంటే, ఈ సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ సినిమాను మిస్ కాకుండా చూడండి.
Read Also : ఓటీటీలో ఉన్న బెస్ట్ 5 తెలుగు డబ్బింగ్ వెబ్ సిరీస్ లు… ఇందులో మీరెన్ని చూశారు?
అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో
ఈ సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ మూవీ పేరు ‘ది వుమన్ ఇన్ ది యార్డ్’ (The Woman in the Yard). 2025 లో విడుదలైన ఈ అమెరికన్ మూవీకి జామ్ కొలెట్-సెర్రా దర్శకత్వం వహించారు. ఇందులో డేనియల్ డెడ్‌వైలర్, ఓక్వుయ్ ఓక్‌పోక్వాసిలి, పేటన్ జాక్సన్, రస్సెల్ హార్న్స్‌బీ వంటి నటులు ప్రధాన పాత్రల్లో నటించారు. ‘ది వుమన్ ఇన్ ది యార్డ్’ 2025 మార్చి 28న యూనివర్సల్ పిక్చర్స్ ద్వారా యునైటెడ్ స్టేట్స్‌లో విడుదలైంది. రమోనా అనే మహిళ చుట్టూ ఈ స్టోరీ తిరుగుతుంది. అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది.