Intinti Ramayanam Today Episode May 6th: నిన్నటి ఎపిసోడ్ లో.. ఆరాధ్య భవిష్యత్తును కోరుకునే దానివైతే నువ్వు ఆ స్కూల్ మానేశాయి అప్పుడే ఆ స్కూల్ కి నేను ఆరాధ్యను పంపిస్తానని అక్షయ్ అంటాడు. ఇక తర్వాత రోజు ఉదయం అవని ఆఫీస్ కి వెళ్లడానికి రెడీ అయ్యి వస్తుంది. నీకు నీ కూతురికి లంచ్ బాక్స్ రెడీ చేసానమ్మా తీసుకొని వెళ్ళు అని స్వరాజ్యం అంటుంది. అయితే అవని ఒక లంచ్ బాక్స్ మాత్రమే తీసుకుంటుంది.. అదేంటి అవని ఎప్పుడు నీకు నీ కూతురికి రెండు బాక్సులు పెట్టమని అడుగుతావు కదా ఇప్పుడేంటి ఒక బాక్స్ తీసుకెళ్తున్నావని అడుగుతారు. అవని నేను స్కూల్ మానేశాను స్కూల్ కి వెళ్లట్లేదు పిన్ని ఆఫీస్ కి వెళ్తున్నాను అని అంటుంది. నేను ఆ ఇంట్లో మనుషుల్ని సంతోషంగా లేకుండా చేస్తున్నానని ఆయన అన్నారు. నేను వాళ్లకి దూరంగా ఉంటే సంతోషంగా ఉంటారు కదా అందుకే నా కూతురికి నేను దూరంగా ఉండాలని అనుకుంటున్నాను అని అవని అంటుంది. అవని బాధను చూసి స్వరాజ్యం అందరూ బాధపడతారు. అవని ఆరాధ్య కోసం స్కూల్ కి వెళ్లి దొంగ చాటుగా ఆరాధ్యను చూసి బాధపడుతుంది. ఆ తర్వాత అవని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆరాధ్య మాత్రం అమ్మ కోసం స్కూల్ అంత వెతుకుతుంది. టీచర్ ని అడిగి తెలుసుకుని ఇక స్కూల్ కి రాదని బాధపడుతుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. అవని ఆరాధ్య కోసం స్కూల్ దగ్గరికి వెళ్లి వెయిట్ చేస్తూ ఉంటుంది. ఆరోగ్యం ఏంటి ఇంకా స్కూల్ కి రాలేదు నేను జాబ్ మానేసిన తర్వాత ఆ స్కూల్ కి పంపిస్తానని అన్నారు కదా ఇప్పుడు స్కూల్ మానింగ్ చేసారా ఏంటి అని ఆలోచిస్తూ ఉంటుంది. ఆరాధ్య చూడకుండా అస్సలు ఉండలేకపోతున్నాను. ఇంకా ఆరాధ్యను స్కూల్ కి తీసుకురాలేదేంటి అని అవని టెన్షన్ పడుతూ ఉంటుంది. అప్పుడే ఆరాధ్య కారు నుంచి బయటకు దిగడం చూసి అవన్నీ సంతోషపడుతుంది. నా కూతుర్ని నేను దూరం నుంచి చూసుకొని సంతోష పడాలి అని బాధపడుతుంది.
ఆరాధ్య కారు నుంచి దిగగానే కారు నుంచి దిగగానే అవని కోసం వెతుకుతుంది. అక్షయ మాత్రం నువ్వు మీ అమ్మ గురించి ఆలోచించడం మానేసి నీ ఎగ్జామ్ ని ఎలా ముందుకు తీసుకెళ్లాలి. ఎలా పాస్ అవ్వాలి ఫస్ట్ ర్యాంక్ ఎలా తెచ్చుకోవాలి అని ఆలోచించాలని క్లాస్ పీకుతాడు.. ఆరాధ్య మాత్రం తన తల్లి కోసం అటు ఇటు వెతుకుతూ ఉంటుంది. స్కూల్ బస్సు వెనకాల తన తల్లి ఉండడం గుర్తించి ఆరాధ్య పరిగెత్తుకుంటూ అవని దగ్గరికి వెళ్తుంది. అమ్మ నువ్వు వచ్చావా నీకోసమే నేను చూస్తున్నాను అమ్మ అని కన్నీళ్లు పెట్టుకుంటుంది. అవని కూడా ఆరాధ్యను చూసి ఏడ్చేస్తుంది. అక్షయ్ మాత్రం వాళ్ళిద్ద దగ్గరికి వెళ్లి నేను ఆరాధ్యుని ఈ స్కూల్లో ఉంచాలంటే నువ్వు ఈ స్కూల్ నుంచి వెళ్ళిపోవాలని ఆరాధ్యకు కనిపించకుండా ఉండాలని చెప్పిన నువ్వు వినట్లేదు కదా నీకు ఎంత చెప్పినా అర్థం కాదా అని అవని పై సీరియస్ అవుతాడు.
తల్లి నుంచి బిడ్డను వేరు చేయడం మీకు అంతా కరెక్ట్ అనిపిస్తుందా మీరేం చేయాలనుకుంటున్నారో మీకు తెలుస్తుందా అని అవని అడుగుతుంది. కానీ అక్షయ్ మాత్రం నా కూతుర్ని నా నుంచి దూరం చేయాలని చూస్తే మాత్రం నేను అస్సలు ఊరుకోను.. అంటూ ఆరాధ్యను తీసుకొని కారెక్కించుకొని వెళ్ళిపోతాడు. అవని ఏం చేస్తున్నారండి మీరు అని అడుగుతుంది. అవని బాధపడుతూ ఇంటికి వెళుతుంది. ఏమైంది అని ఇంట్లో వాళ్ళు అందరు అడుగుతారు. తల్లి నుంచి బిడ్డను వేరు చేయడం అంత సంస్కారమా అని స్వరాజ్యం అక్షయ్ పై సీరియస్ అవుతుంది. నువ్వు అప్పుడు చెప్పినట్లే వినింటే పోలీస్ కేసు పెట్టి లేదా కోర్టు కేసునుంటే వాళ్లే నీ కాళ్ళ దగ్గరికి వచ్చేవాళ్ళు కదా అవన్నీ అరుస్తుంది..
ఆ ఇంటి వాళ్ళు నా వాళ్ళు ఎప్పటికైనా నేను ఆ ఇంటికి వెళ్లాల్సిందనే కదా పిన్ని ఇప్పుడు నేను కోర్టు కేసులు అంటే వాళ్ళు నన్ను క్షమిస్తారా? నన్ను ఇంట్లోకి రానిస్తారా? ఇది ఆలోచించాను. దాని గురించి మీరు ఇంకేమీ పట్టించుకోకండి నేను చూసుకుంటానని అవని లోపలికి వెళ్ళిపోతుంది. అయితే అవని కి న్యాయం జరిగేలా మనమే ఏదో ఒకటి చేయాలి లేకుంటే కచ్చితంగా ఆ ఇంట్లో వాళ్ళు తల్లి బిడ్డను వేరు చేస్తారు అని అందరూ అనుకుంటారు. ఇక భానుమతిని కమల్ కమలాకర్ వేషంలోనూ కమల్ వేషంలోనూ వచ్చి ఓ ఆట ఆడుకుంటాడు. భానుమతికి ఎలాగైనా బుద్ధి రావాలని అవని గురించి తప్పుగా అనకూడదని తెలుసుకోవాలని నాటకం ఆడుతాడు.
భానుమతి అదంతా నిజమే అనుకోని నమ్ముతుంది. కమల్ వెళ్ళిపోతుంటే అడుగుతుంది. ఓ తాతయ్య చెప్పింది అంతా నమ్మే కదా ఆ పని వదినకి ఆరాధ్యని దూరం చేయాలని చూస్తున్నారు. నువ్వు ఆ పని జరగకుండా చూడాలని భానుమతికి చెప్తాడు. ఆవని కోసం ఆరాధ్య కోసం ఇంట్లో వాళ్ళ కోసం నా మొగుడిని నేనెందుకు వదులుకోవాలి నా మొగుడి కోరిక పేరుకు నేను అలానే చేస్తానని భానుమతి గట్టిగా అనుకుంటుంది. అవని ఆరాధ్య కోసం వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్తుంది. ఆరాధ్యను చూసి కన్నీళ్లు పెట్టుకుంటుంది. నాన్న నీతో మాట్లాడద్దు నన్ను అంటున్నారు నాన్న ఎందుకమ్మా నువ్వు తప్పు చేసావా? ఏంటమ్మా నాన్న అలా చెప్పాడు అయితే నాన్న చెడ్డవాడా? అని అడుగుతుంది.. నాన్న చాలా మంచి వాడి అమ్మ నా మీద కోపం ఉంది. నువ్వు ఆయన్ని పట్టించుకోవద్దు అని అంటుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్లో అవనిని అరెస్ట్ చేసేందుకు పోలీసులు వస్తారు.. ఆ తర్వాత ఏం జరుగుతుందో చూడాలి..