Karthik Subbaraj : తెలుగు ఫిలిం ఇండస్ట్రీ కంటే తమిళ్ ఫిలిమ్ ఇండస్ట్రీలోనే ఎక్కువగా షార్ట్ ఫిలిం నుంచి కెరియర్ మొదలుపెట్టి నేడు సక్సెస్ఫుల్ దర్శకులుగా పనిచేసిన వాళ్ళు ఎక్కువమంది ఉన్నారు. వారిలో ముఖ్యంగా కార్తీక్ సుబ్బరాజు గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎన్నో షార్ట్ ఫిలిమ్స్ తీసిన కార్తీక్ సుబ్బరాజు పిజ్జా సినిమాతో తమిళ్ ఫిలిమ్ ఇండస్ట్రీకి దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చాడు. బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా అద్భుతమైన సక్సెస్ సాధించింది. ముఖ్యంగా టెక్నికల్ గా ఈ సినిమాను కార్తీక్ తెరకెక్కించిన విధానం చాలామందికి ఆశ్చర్యాన్ని కలిగించింది. ఈ సినిమాను తెలుగులో కూడా అదే పేరుతో రిలీజ్ చేశారు. ఈ సినిమా తర్వాత వచ్చిన జిగర్తాండ సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఇదే సినిమాను హరీష్ శంకర్ గద్దల కొండ గణేష్ అనే పేరుతో తెలుగులో రీమేక్ చేశాడు.
స్టార్స్ తో సినిమాలు
రజనీకాంత్ క్రేజ్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతి తమిళ్ దర్శకుడు కూడా రజనీకాంత్ ఒక సినిమా చేయాలి అని కలలు కంటూ ఉంటారు. కానీ కొందరు దర్శకులు వాళ్లకు నచ్చిన కథను రజనీకాంత్ తో చెప్పించే ప్రయత్నం చేస్తారు. కానీ మరికొందరు మాత్రం రజనీకాంత్ ఎటువంటి కథల్లో నటిస్తే ఇష్టపడతారు, ఇటువంటి పాత్ర చేస్తే ఆడియన్స్ హ్యాపీగా ఫీల్ అవుతారు అని ఆలోచించే దర్శకులు ఉంటారు. వారిలో కార్తీక్ ఒకడు. అందుకే పెట్టా సినిమాతో ప్రేక్షకులకి కావలసిన అన్ని ఎలిమెంట్స్ ను వెండితెరపై ఆవిష్కరించాడు. ఆ తర్వాత కార్తీక్ చేసిన సినిమాలు కమర్షియల్ గా పెద్ద సక్సెస్ కాకపోయినా కూడా చాలామందికి విపరీతంగా నచ్చుతూ వచ్చాయి.
మళ్లీ ఇండిపెండెంట్ ఫిలిం
ఇక కార్తీక్ తన కెరియర్లో రజనీకాంత్, విక్రం, సూర్య వంటి హీరోలతో సినిమాలు చేశాడు. ఇక రీసెంట్ గా వచ్చిన రెట్రో సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఊహించిన సక్సెస్ సాధించలేకపోయింది. ఈ సినిమా తర్వాత కార్తీక్ సుబ్బరాజ్ ఎవరు ఊహించిన విధంగా ఒక ఇండిపెండెంట్ సినిమాను చేయనున్నాడు. అతి తక్కువ బడ్జెట్ తో కొత్త వాళ్లతో ఆ సినిమాను చేసి ఫిలిం ఫెస్టివల్ కి పంపించే ప్రయత్నం చేస్తున్నాడు. ఆ సంవత్సరం తర్వాత ఈ సినిమాను విడుదల చేసే ప్లాన్ లో ఉన్నాడు కార్తీక్. అంతమంది స్టార్ హీరోలతో పని చేసిన తర్వాత మళ్లీ ఇండిపెండెంట్ ఫిల్మ్ ఏంటి గురు అని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.