Kurumurthy Jatara: పోలీసులు అంటే సామాన్యులకు రక్షణగా ఉండాలి. ఏదైనా ఆపద వస్తే కాపాడేందుకు ముందుకు రావాలి. లా అండ్ ఆర్డర్ ను పరిరక్షించాలి. కానీ కొన్ని సార్లు పోలీసులే రౌడీల్లా రెచ్చిపోతుంటారు. సమాన్యులతో కలిసి వారికి సాయం చేయకుండా జులుం ప్రదర్శిస్తుంటారు. తప్పు చేసిన వారిని వదిలేసి ఏ తప్పూ చేయని అమాయక ప్రజలపై తమ ప్రతాపం చూపిస్తుంటారు. నెత్తిమీద టోపీ, చేతిలో లాటీ ఉండగానే తామేదో గొప్పవాళ్లం అని ఫీల్ అయిపోతుంటారు.
Also read: హైదరాబాద్ లో మరో చెరువును కాపాడిన హైడ్రా.. నిఘా పెట్టిమరీ
తాజాగా ఓ పోలీస్ అధికారి ఆ విధంగానే ప్రవర్తించాడు. జాతరలో బొమ్మలు అమ్ముకుంటున్న చిరువ్యాపారులపై అతడి ప్రతాపాన్ని చూపించాడు. ఈ ఘటన మహబూబ్ నగర్ జిల్లాలోని కురుమూర్తి జాతరలో చోటు చేసుకుంది. జాతర అంటే ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వేల సంఖ్యంలో జనాలు వస్తుంటారు. కొన్ని వందల దుకాణాలు పెడతారు. ముఖ్యంగా జాతారలో అంతా చిరువ్యాపారులే కనిపిస్తారు.
అయితే శాంతి భద్రతలు సక్రమంగా చూసుకోవాల్సిన ఓ పోలీస్ అధికారి ఆ పనిచేయకుండా చిరువ్యాపారులపై రెచ్చిపోయాడు. అక్కడ బొమ్మలు అమ్ముకునే ఓ వ్యక్తిని కొడుతూ అతడు అమ్ముకునే బొమ్మలను పాడు చేశాడు. వాటిని కింద పడేస్తూ తొక్కుతూ ఓవర్ యాక్షన్ చేశాడు. చేతిలో కర్రపట్టుకుని అక్కడ ఉన్న చిరు వ్యాపారులను అందరినీ కొట్టుకుంటూ ముందుకు వెళ్లాడు.
అధికారి అలా చేస్తున్న పాపం ఏమీ చేయలేక వ్యాపారులు నిస్సహాయ స్థితిలో చూస్తూ ఉండిపోయారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పోలీస్ ఓవర్ యాక్షన్ పై నెటిజన్లు మండిపడుతున్నారు. ఇలాంటి వారివల్లనే డిపార్ట్మెంట్ అంటే గౌరవం పోతుందని కామెంట్లు పెడుతున్నారు. రోజు రోజుకూ మానవత్వం మంట కలుస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆ పోలీస్ పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.