Intinti Ramayanam Today Episode October 11th: అక్షయ్ అవని ఇంకా నిద్ర లేవలేదా ఏమైంది ఎందుకు ఇంకా నిద్ర లేవలేదు అని లోపలికి వెళ్లి చూడగానే.. అవనికి ఫుల్ జ్వరంగా ఉంటుందని అనుకుంటాడు. ఇక ఆరాధ్య అమ్మకి రాత్రి నుంచి బాగా జ్వరంగా ఉంది నాన్న అని అంటుంది.. మరి రాత్రి నుంచి ఇలానే ఉంటే ఎందుకు చెప్పలేదు. అవని నువ్వు ఎందుకు ఇలా మొండిగా ఉంటున్నావు. జ్వరం వచ్చింది అన్న విషయం కూడా ఇంట్లో ఎవరికీ చెప్పవా అని అక్షయ్ అడుగుతాడు. అప్పుడే ఆరాధ్య వెళ్లి ధర్మామీటర్ టాబ్లెట్స్ అని శ్రీయాని అడుగుతుంది. శ్రేయ అలాగే నేను తీసుకుని వస్తాను నువ్వు వెళ్ళు అని చెప్తుంది అవనికి జ్వరం అని చెప్పగానే ఇంట్లో వాళ్ళందరూ ఒక్కసారిగా కంగారు పడిపోతూ అవని దగ్గరికి వెళ్తారు అయితే ఏంటమ్మా అవని నీకు ఇంత జ్వరం వస్తే కనీసం చెప్పేది లేదా అని పార్వతి అడుగుతుంది నాకు జ్వరం ఇప్పటినుంచి వచ్చిన అత్తయ్య మరేం పర్వాలేదు. అని అంటున్న సరే పార్వతి మాత్రం నువ్వు అందరికీ బాగోలేనప్పుడు చూసుకుంటావు కదా.. కనీసం నువ్వు చెప్పలేకపోతున్నావు అంటే ఏమని అర్థం చేసుకోవాలి అని పార్వతి అంటుంది. పార్వతి తన కోడలికి జ్వరం రావడంతో నేను అవనీని దగ్గరుండి చూసుకుంటాను అని అంటుంది.
పల్లవి ఆవేశంలో చేతిని కాల్చుకుంటూ ఉంటుంది.. అవని మీద కోపం ఇలానే కాలిపోవాలి నాకు ఇంత బాధని మిగిల్చిన అవని నేను అస్సలు వదిలిపెట్టను. అన్ని ఇంట్లో నుంచి గెంటేస్ ఎలా చేస్తుందో అవని అంత చూస్తాను అంటూ తన చేతి మీద వాతలు పెట్టుకుంటూ ఉంటుంది. అప్పుడే లోపలికి వచ్చిన భరత్ ని చూసి చేతిని దాస్తుంది. కానీ భరత్ దాన్ని చూసి ఎందుకు సిస్టర్ మీరు ఇలా చేతులనే కాల్చుకుంటున్నారు అని అడుగుతాడు. మీ అక్క నాకు కాపురంలో చిచ్చు పెట్టింది నన్ను ఆ ఇంట్లో నుంచి గెంటేసేలా చేసింది ఆ బాధ నేను మర్చిపోలేకనే నన్ను నేను కాల్చుకుంటున్నాను అని పల్లవి అంటుంది. ఇక అప్పుడే అక్కడికి వచ్చిన ప్రణతిని ఎలాగైనా సరే భరత్ చేత తిట్టించాలి అని పల్లవి అనుకుంటుంది. మేమిద్దరం ఏం మాట్లాడుకుంటున్నామో తెలుసుకొని మీ అవ్వని వదినకు చేరవేసేందుకే లోపలికి వచ్చావా అని పల్లవి ప్రణతిని అంటుంది దానికి భరత్ కూడా అనడంతో ప్రణతి చాలా ఫీల్ అవుతుంది.
ప్రణతిని ఇలానే రెచ్చగొట్టి ఇంట్లో నుంచి పంపించాలి అని పల్లవి అనుకుంటుంది. ప్రణతిని గనక ఇంట్లో నుంచి పంపిస్తే ఖచ్చితంగా కమల్ మళ్లీ పల్లవి దగ్గరికి వస్తాడు అని ఆశ పడిపోతూ ఉంటుంది.. భరత్ నీ రెచ్చగొట్టి ప్రణతిని ఎలాగైనా సరే ఇంట్లో నుంచి పంపించాలి అని పల్లవి చేసిన ప్లాను మొత్తానికి సక్సెస్ అవుతుంది. పల్లవి ఎలా చెప్తే భరత్ అలా వింటూ ఉంటాడు. నిజంగానే మంచిది అని నమ్మించే ప్రయత్నం కూడా చేస్తూ ఉంటాడు. కానీ ప్రణతి నేను ఏమి ఎవరికీ ఏది చెప్పను అని ఎంత చెప్పినా సరే పల్లవి మాత్రం వినకుండా కావాలని అందరిని రెచ్చగొట్టేలా మాట్లాడుతుంది. తనకి మీనాక్షిని అటు భరత్ నీ తన వైపు తిప్పుకుంటుంది పల్లవి. ఇక ప్రణతి పల్లవి వల్ల భరత్ మళ్లీ మారిపోతాడు అని టెన్షన్ పడిపోతూ ఉంటుంది. మరి పల్లవి పుట్టింటికి వెళ్తుందా లేదంటే భరత్ కోపానికి భయపడుతూ ఉంటుందా అన్నది చర్చించుకున్నారు.
ఉదయం లేవగానే అందరూ కూర్చుని ఉండగా చక్రధర ఒకసారిగా ఇంట్లోకి రావడంతో ఎందుకు వచ్చారు అని ఆలోచిస్తూ ఉంటారు. పల్లవి గురించి మాట్లాడటానికి నేను ఇంటికి వచ్చాను అని చక్రధర అనగానే కమల్ పల్లవి గురించి మాట్లాడడానికి అయితే మాత్రం మీరు ఇంకేం మాట్లాడాల్సిన అవసరం లేదు మావయ్య అనేసి సీరియస్ అవుతాడు. చక్రధర్ని అందరూ తలా ఒక మాట అనడంతో భానుమతి మీరేంటి బ్రతిమలాడుతున్నార అల్లుడుగారు పల్లవి గురించి ఏదో ఒకటి తేల్చుకొని వెళ్లాలి కానీ ఇలా బ్రతిమలాడితే వీళ్ళు వింటారా అని అంటుంది. దేని గురించి మాట్లాడాల్సిన పనిలేదు పల్లవి ఇంట్లోకి వస్తే చంపేస్తాను అని కమల్ వార్నింగ్ ఇస్తాడు. నేను చెప్పేది ఒకసారి వినండి అల్లుడుగారు అని చక్రధర్ ఎంతగా చెప్పిన సరే కమల్ మాత్రం పల్లవి ఇంట్లోకి అడుగుపెట్టడానికి వీల్లేదు అని చెప్పేస్తాడు.
చక్రధర్ ఇక ఏమీ మాట్లాడకుండా అవని ఎక్కడుంది అని అడుగుతాడు అవనికి జ్వరం వచ్చింది అన్నయ్య అని పార్వతి చెప్తుంది. తనకు జ్వరం తగ్గిన తర్వాత నేను వచ్చి మాట్లాడతాను అని చక్రధర్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. చక్రధర్ వెళ్లిన కొద్దిసేపటికి పోలీసులు పార్వతి ఇంటికి వస్తారు. కమలి ఎవరు పెళ్ళాన్ని అరెస్ట్ చేస్తున్నారని తన భార్య తన మీద కంప్లైంట్ ఇచ్చింది అని ఎస్ఐ అనగానే అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. అంతేకాదు అవని ఎవరు అవని మీద కూడా తను కంప్లైంట్ ఇచ్చింది తనని కొట్టి ఇబ్బంది పెడుతుంది అని అవని ఈ నుంచి కూడా పోలీస్ స్టేషన్ కి తీసుకురావాలని కంప్లైంట్ ఇచ్చింది అని చెప్పగానే ఒక్కసారిగా అందరూ షాక్ అవుతారు ఇక పోలీసులు ఎవరైనా చెప్పిన వినకుండా అవనీని కమల్ని అరెస్ట్ చేస్తారు అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది సోమవారం ఎపిసోడ్లో పల్లవి ప్లాన్ ఏంటో తెలిపే అవకాశం ఉంది..
Also Read :Gundeninda GudiGantalu Today episode: బాలు దెబ్బకు రచ్చ రచ్చ.. రోహిణి ఫుల్ హ్యాపీ.. మనోజ్ కు షాక్…