Intinti Ramayanam Today Episode October 15th: పల్లవి అవనికి ఎలాగైనా దిమ్మ తిరిగిపోయేలా షాక్ ఇవ్వాలని అనుకుంటూ ఉంటుంది. అవని నేను బయటికి రానివ్వకుండా చూడాలి అని పల్లకి ఆలోచిస్తూ ఉంటుంది. అయితే అక్కడున్న పోలీసు అవనికి ఫోన్ చేసి వచ్చారు ఏం చేయాలి చెప్పండి అని. అడుగుతుంది ఒకవేళ అవనికి బెయిల్ వస్తే ఇక మీదట ఏమీ చేయలేము అని పోలీస్ అనగానే ఆ అవినీతి పేరు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీదే అని అంటుంది పల్లవి ఇక పోలీసు ఎలాగైనా సరే అవి నీకు బెయిల్ రాకుండా చేయాలి అని ఆలోచిస్తూ ఉంటుంది. పల్లవి చెప్పినట్లే చేయలేని పోలీసు అనుకుంటూ ఉంటుంది..
అవని కి ఎలాగైనా సరే బెయిల్ ఇవ్వాలి అని శ్రీకర్ లాయర్ దగ్గరికి వెళ్లి పేపర్స్ ని తీసుకుని వస్తాడు. అయితే కమల్ కి మాత్రమే పోలీసులు బెయిల్ ఇస్తారు కానీ అవి బెయిల్ ఇవ్వడానికి అస్సలు ఒప్పుకోరు. ఆమె మీద మీరు పెట్టిన సెక్షన్లు రెండు మాత్రమే బెయిల్ వచ్చింది. ఇప్పుడు మరో రెండు కేసులు ఆమె మీద ఉన్నాయని మీరు చూసుకోలేదు అందుకే ఆమెకు బెయిల్ ఇవ్వడం కుదరదు అని ఎస్ఐ అనగానే అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. టైం అయిపోయింది కాబట్టి కోర్టు బెయిల్ కూడా ఇవ్వదు అని పోలీసులు అనడంతో స్వీకతో పాటు మిగిలిన వాళ్ళందరూ కూడా షాక్ అవుతారు అవని మరో రెండు రోజులు పాటు పోలీస్ స్టేషన్ లోనే ఉండాలా అని అందరూ బాధపడిపోతున్నారు. ఇక అవని మాత్రం పల్లవి తన మీద కచ్చి తీర్చుకుంటుంది అని బాధ పడిపోతుంది.
కమల్ కి బెయిల్ రావడంతో అవనికి బెయిల్ రాలేదన్న కోపంతో కమల్ చాలా ఆవేశంగా పల్లవి దగ్గరికి వెళ్తాడు. పల్లవి కమల్ ని చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది. కమల్ పల్లవి అంటూ కేకలు పెడుతూ ఇంట్లోకి కోపంగా వచ్చి అక్కడ ఉన్న వస్తువులన్నిటిని పగలగొట్టడంతో ప్రణతి వచ్చి షాక్ అవుతుంది. ఎందుకు ఇదంతా చేస్తున్నావ్ అన్నయ్య ఆది అన్నయ్య ఏంటి ఆవేశం అంటూ ప్రణతి ఆపిన కూడా కమల్ ఆగడు.. మా వదిన ఏం తప్పు చేసిందని తనమీద లేనిపోని కేసులు పెట్టి నువ్వు పోలీస్ స్టేషన్ లో ఉండేలా చేసావు అని కమల్ చాలా సీరియస్ గా పల్లవి పై కొడుతూ ఉంటాడు. అయితే పల్లవి ఈరోజు చంపేస్తాను అని అసలు వినకుండా కమల్ పల్లవిని కొట్టేందుకు సిద్ధపడతాడు. పల్లవి మాటకు మాట సమాధానం చెప్పడంతో ఒక్కసారిగా షాక్ అవుతుంది ఎలాగైనా సరే పల్లవి నీ చంపేస్తాను అని అనడంతో ప్రణతి అడ్డుపడుతుంది దాంతో కమల్ ఒక్కసారిగా కూల్ అవుతాడు.
చక్రధర్ పోలీసుల దగ్గరికి వెళ్లి ఎలాగైనా సరే నా బిడ్డను కాపాడుకోవాలి అని అనుకుంటాడు. ఎన్నో కేసులను పోలీసుల దగ్గర చూసి వాదించి మరి నాకు కావాల్సినట్లు చేసుకున్నాను అలాంటిది ఇప్పుడు కూడా నేను అలానే చేసుకుంటాను ఇది నా బిడ్డ జీవితం.. బిడ్డని ఎలాగైనా కాపాడుకోవాలి అని చక్రధర్ పోలీసులు దగ్గరికి వెళ్లి ఎంత ఖర్చవుతుందో చెప్పండి నా బిడ్డకు జ్వరం వచ్చింది నేను తీసుకుని వెళ్ళిపోతాను అని అనగానే ఆ ఎస్సై ఒక్కసారిగా షాక్ అయ్యేలా మాట్లాడుతుంది. అసలు చక్రధర్ ఆ మాట అనగానే నాకే లంచం ఇస్తావా నిన్ను మెడ పట్టుకొని బయటికి గెంటేయాల్సిన పరిస్థితి వచ్చింది. కాకపోతే నీ వయసుకి మర్యాద ఇచ్చి వదిలేస్తున్నాను ఇకనుంచి వెళ్లిపోండి అని అనగానే అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు.
తల్లి కోసం ఆరాధ్య కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది. ఎలాగైనా సరే.. అమ్మని నేను చూడాలి అమ్మ దగ్గరికి నేను వెళ్ళాలి అంటూ బాధ పడిపోతూ ఉంటుంది. అయితే తల్లి కోసం బాధపడుతూ ఉండటం చూసి అందరూ బాధపడతారు. కమల్ ఇంటికి రావడంతో ఏంటి బాబాయ్ నువ్వు ఒక్కడివే వచ్చావో అమ్మ ఎందుకు రాలేదు అని బాధపడిపోతుంది. ఆరాధ్య తల్లి కోసం పడే బాధని అందరూ అర్థం చేసుకొని కన్నీళ్లు పెట్టుకుంటారు. అమ్మని చూడాలి నేను అమ్మతో మాట్లాడాలి అని ఆరాధ్య అంటూ ఉండగా అప్పుడే వచ్చిన అక్షయ్ కూడా అమ్మ వస్తుంది అమ్మ రెండు రోజుల్లో అని ఎంత చెప్తున్నా సరే ఆరాధ్య మాత్రం అసలు వినదు. శ్రియ ఏదో ఒక మాటలు చెప్పి ఆరాధ్యకు భోజనం పెడుతుంది.
భరత్ కమల్ ఇంట్లో వచ్చి అంతర్ రచ్చ చేస్తూ ఉంటే నువ్వు ఎందుకు నాకు చెప్పలేదు.. ఒక్క మాట చెప్పి ఉంటే నేను బావని వచ్చి కొట్టేవాడిని కదా బావకి సరైన బుద్ధి చెప్పే వాడిని కదా అని పల్లవి తో మాట్లాడుతూ ఉండగా.. అప్పుడే ఇంట్లోకి వచ్చినా చక్రధర్ ఏం చెప్తావ్ నువ్వు.. నువ్వు ఒక మనిషివేనా అక్కడ ఉన్నది మన ఇంటి మనుషులేని గుర్తించకుండా పల్లవితో కలిసి వెళ్లి కేసు పెట్టాలని అనుకున్నావు. నీకు కొంచెం కూడా బుద్ధి లేదా అని చక్రధర్ భరత్ ని చంపలు పగలగొట్టేస్తాడు. మీనాక్షి కూడా భరత్ ని కొట్టడంతో ఈ ఇంట్లో ఒక్క నిమిషం కూడా ఉండను నేను వెళ్ళిపోతాను అని భరత్ అంటాడు అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.. రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి..