E-Paper
Advertisement

Karthika Deepam 2 Serial Today Episode October 15th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: జ్యోత్స్న చనిపోయిందన్న ఎస్సై – అయోమయంలో సూరజ్‌          

Karthika Deepam 2 Serial Today Episode October 15th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: జ్యోత్స్న చనిపోయిందన్న ఎస్సై – అయోమయంలో సూరజ్‌          
Advertisement

Karthika Deepam 2 serial today Episode: శివనారాయణ, సుమిత్ర, దశరథ, కార్తీక్‌, దీపలు కలిసి పోలీసులను తీసుకుని దక్షిణమూర్తి ఇంటికి వెళ్తారు. పోలీసులు మాలినిని అరెస్టు చేస్తున్నామని చెప్తారు. అందుకు సూరజ్‌ అరెస్ట్ ఎందుకు చేస్తున్నారు అని అడిగితే.. మాలిని గారు జ్యోత్స్నను కిడ్నాప్‌ చేశారు అందుకు వాళ్ల అమ్మ సుమిత్ర గారు కంప్లైంట్‌ చేశారు అని పోలీసులు చెబితే.. మా అమ్మే కిడ్నాప్‌ చేసిందని సాక్ష్యాలు ఉన్నాయా..? అని సూరజ్‌ అడుగుతాడు. వాళ్లు కంప్లైంట్‌ చేశారు కాబట్టి అరెస్ట్‌ చేస్తున్నామని పోలీసులు చెబితే.. అయితే నేను కంప్లైంట్‌ చేస్తున్నాను.. జ్యోత్స్నను శివనారాయణ తాతే కిడ్నాప్‌ చేశారు. అంటూ చెప్పగానే.. అందరూ షాక్‌ అవుతారు.

ఎస్సై మాత్రం జ్యోత్స్న గురించి మీకు తెలియదని ఎలా నమ్మాలి అని అడిగితే.. తన ఫోన్‌ తీసి రెండు రోజుల నుంచి జ్యోత్స్న కోసం కాల్స్‌ చేస్తున్నాను, మెసేజ్‌లు పెడుతున్నాను కావాలంటే చూడండి అంటూ తన ఫోన్‌ చూపిస్తాడు. వీళ్లు ఇలాగ ఏవేవో కథలు చెప్తారు మీరు అరెస్ట్‌ చేయండి సార్‌ అంటూ సుమిత్ర చెబితే.. నేను కూడా మా అమ్మను అక్రమంగా అరెస్ట్ చేశారని కేసు పెడతాను అంటూ బెదిరించగానే.. జ్యోత్స్నను ఎలా కాపాడుకోవాలో మాకు తెలుసు. ఆధారం అయితే దొరకని అప్పుడు చెప్తా మీ సంగతి అంటూ వార్నింగ్‌ ఇచ్చి అందరినీ తీసుకుని వెళ్లిపోతాడు కార్తీక్‌.

Advertisement

తర్వాత కార్తీక్‌ ఒకవైపు, సూరజ్‌ ఒకవైపు జ్యోత్స్న కోసం వెతుకుతుంటారు. ఎక్కడా జ్యోత్స్న కనిపించదు. సూరజ్‌ నిరాశగా ఇంటికి వెళ్తాడు. ఎదురుగా వెళ్లిన దక్షిణమూర్తి జ్యోత్స్న కనిపించిందా..? అని అడిగితే.. లేదని సూరజ్‌ చెప్తాడు. అయితే మన మీద పడిన నింద పోగొట్టుకుందాం పద అని సూరజ్‌ను తీసుకుని దక్షిణమూర్తి వెళ్లిపోతాడు. మాలిన అంతా గమనిస్తుంది. మరోవైపు సుమిత్ర ఏడుస్తూ.. ఆ మాలిని తన జ్యోత్స్న ప్రాణం తీయకముందే మీరు వెళ్లి కాపాడండి అంటూ ఏడుస్తుంది. అప్పుడే దక్షిణమూర్తి, సూరజ్‌ వస్తారు. దక్షిణమూర్తి ఇంట్లోకి వెళ్లబోతుంటే.. సుమిత్ర కోపంగా తిడుతూ నువ్వు ఇంట్లోకి అడుగుపెట్టొద్దు అంటుంది.

అయితే జ్యోత్స్న వచ్చేవరకు నేను ఇక్కడే ఇంటి ముందు కూర్చుంటాను. కొడుకును పోగొట్టుకున్నాను.. కూతురును దూరం చేసుకున్నాను.. ఇప్పుడు నా మనవరాలిని పోగొట్టుకోలేను అంటూ కూర్చుంటాడు. శివనారాయణ కోపంగా ఒరేయ్‌ కార్తీక్‌ వాళ్లను గెంటేయ్‌రా అంటాడు. ఎన్నిసార్లు గెంటేసినా మళ్లీ మళ్లీ వస్తాను అంటూ జ్యోత్స్నను కిడ్నాప్‌ చేసింది శివనారాయణే అంటూ మొండిగా కూర్చుంటాడు. సుమిత్ర ఏడుస్తూ.. జ్యోత్స్నను వదిలేయమని ప్రాదేయపడుతుంది. నీ కాళ్లు పట్టుకుంటే మమ్మల్ని వదిలేస్తానన్నావు కదా అందుకే ఇలా చేస్తున్నావా..? అయితే మీ కాళ్లు నేను పట్టుకుంటాను నా కూతురును వదిలేయండి అంటూ దక్షిణమూర్తి కాళ్లపై పడుతుంది. కార్తీక్‌, దీప, సుమిత్రను ఓదారుస్తారు. దక్షిణమూర్తి కూడా జ్యోత్స్నతో తాను మాట్లాడే వరకు ఇక్కడి నుంచి కదిలేది లేదు అంటాడు.

Advertisement

సూరజ్‌ బయటకు వెళ్లి ఫోన్‌ మాట్లాడుతుంటే ఎస్సై ఫోన్‌ చేసి ఒక యాక్సిడెంట్‌ జరిగిందని ఆ యాక్సిడెంట్‌లో ఒకమ్మాయి చనిపోయిందని ఫేస్‌ గుర్తు పట్టలేనంతా డ్యామేజ్‌ అయిందని కానీ మీరు చెప్పిన గుర్తులు ఆ అమ్మాయిలో కనిపిస్తున్నాయని మీరొకసారి హాస్పిటల్‌కు రండి ఐడెంటిఫై చేయండి అని చెప్తాడు. ఆ మాటలకు సూరజ్‌ కుప్పకూలిపోతాడు. అది చూసిన కార్తీ్‌క్‌, దీప దగ్గరకు వెళ్లి అడిగితే సూరజ్‌ విషయం చెప్తాడు. అక్కడ ఉన్న డెడ్‌ బాడీ జ్యోత్స్నదే అయితే ఇక ఈ సూరజ్‌ ఉండడు.. అంటూ వెళ్లిపోతాడు. అక్కడున్నది జ్యోత్స్న కాకూడదని దీప, కార్తీక్‌ ఎమోషనల్‌ అవుతూ బాధపడతారు.

హాస్పిటల్‌కు వెళ్లిన సూరజ్‌ను ఎస్సై మార్చురీ రూంలోకి తీసుకెళ్తాడు. అదే డెడ్‌బాడీ చూడండి అంటూ ఎస్సై చెప్పగానే.. సూరజ్‌ దగ్గరకు వెళ్లి చీర చూసి అది జ్యోత్స్న కట్టుకున్నదే అనుకుని ఏడుస్తుంటాడు. ఎస్సై వచ్చి చూశారా సార్‌ అని అడిగితే.. లేదు చూడలేదు అంటూ మొత్తం చూసి ఈ అమ్మాయి కాదని హ్యాపీగా ఫీలవుతూ ఏడుస్తూ.. బయటకు వెళ్లి బెంచ్‌ మీద కూర్చుని ఎమోషనల్‌ అవుతుంటాడు. అప్పుడే ఎదురుగా జ్యోత్స్న  వచ్చి నిలబడుతుంది. జ్యోత్స్నను చూసి సూరజ్‌ షాక్‌ అవుతాడు. ఇంతలో ఇవాళ్టీ కార్తీకదీపం2 ఏపిసోడ్‌ అయిపోతుంది.

 ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

Podarillu Today Episode : నారాయణ మాటతో షాక్.. జమునకు మైండ్ బ్లాక్.. మహాకు నిజం తెలుస్తుందా..?

Intinti Ramayanam Today Episode: అవని జైలుకేనా..? పల్లవిని కొట్టిన కమల్.. అవనిని కొట్టిన పోలీసులు..

Illu Illalu Pillalu Today Episodes: రామరాజు కోసం కన్నీళ్లు.. భద్రకు తల్లి వార్నింగ్.. వల్లికి, భాగ్యంకు దిమ్మతిరిగే షాక్..

Illu Illaalu Pillalu : రామరాజు అరెస్ట్.. స్టోరీలో ఊహించని ట్విస్ట్.. శ్రీవల్లి అవుట్..

Brahmamudi Serial Today Episode October 15th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: సొంత ఆఫీసుకు వెళ్తూ రేఖకు షాక్‌ ఇచ్చిన ఐశ్వర్య

Thursday TV Movies : గురువారం టీవీ సినిమాలు.. ఆ ఒక్కటి డోంట్ మిస్..

Nindu Noorella Saavasam Serial Today Episode October 15th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: వైజయంతికి మనోహరి గురించి సరస్వతి నిజం చెప్తుందా..?  

Big Stories

Advertisement
×