Intinti Ramayanam Today Episode September 22nd : అభి కిడ్నాపర్స్ గురించి ఆలోచిస్తూ ఉండగా.. ఒక లేడీ నుంచి ఫోన్ వస్తుంది మీరు అరెస్ట్ చేసిన కిడ్నాప్ ని వెంటనే వదిలేయండి మీకు 10 లక్షలు ఇస్తాను అని ఆఫర్ ఇస్తుంది. నిజాయితీకి మారుపేరుగా ఉన్న అభి ఆ లేడీ ఎవరో తెలుసుకోవాలి అని 10 లక్షల ఆఫర్ కి ఒప్పుకుంటాడు. అనుకున్నట్లుగానే కాసేపటికి ఒక వ్యక్తి వచ్చి 10 లక్షల డబ్బుని ఇస్తారు వాటిని చూసినా అది ఎవరిచ్చారు అని ఆలోచిస్తూ ఉంటాడు. అభికి కిడ్నాపర్స్ పై అనుమానం ఎక్కువ అవుతుంది. వీరి వెనకాల ఎవరో ఉన్నారు అన్న అనుమానం వస్తుంది. ఎవరో ఉన్నారు నేను కనిపెడతాను అని అభి ఫిక్స్ అవుతాడు.
పల్లవి అభికి పది లక్షలు డబ్బులు పంపిస్తుంది. అవి కి ఫోన్ చేసి మీకు 10 లక్షలు పంపించాను కదా మీరు ఆ కిడ్నాపర్స్ ని వదలాలి అని ఎంత చెప్తున్నా సరే అసలు వినకుండా అవి వాళ్ల గురించి తెలుసుకోవాలని ఆలోచిస్తూ ఉంటాడు. అసలు ఈ లేడీ ఎవరు ఎందుకు 10 లక్షల డబ్బులు వీళ్ళ కోసం ఇస్తుంది ఈవిడ వెనకాల ఎవరో ఉన్నారు అని అభి అనుమానంతో డబ్బులు తీసుకుంటాను వాళ్ళని వదిలేస్తాను అని అంటాడు.. అయితే పల్లవి ఎలాగైనా సరే వాళ్ళు వచ్చేస్తారు అని ఆలోచిస్తూ సంతోషంగా ఉంటుంది కానీ అవి మాత్రం కిడ్నాపర్స్ వెనకాల ఎవరో ఉన్నారు అని అడుగుతాడు.. ఏది ఏమైనా కూడా పల్లవి మళ్లీ అడ్డంగా ఇరుక్కోవడం జరుగుతుందని అర్థమవుతుంది.. అభి తెలివిగా వేసిన ప్లాన్ దాదాపు సక్సెస్ అయిపోయినట్టే కనిపిస్తుంది.
బాబు నీ కిడ్నాప్ చేయాలని చుసిన వాళ్ళు ఎవరో తెలుసుకోవాలి అని శ్రేయ అవని అక్క తెలుసుకుంటే బాగుంటుంది. నా బాబుని వాళ్ళు తీసుకెళ్లాలి అనుకుంటున్నారు. అంటే వాళ్ళు ఎందుకు తీసుకెళ్తున్నారు ఏంటి అర్థం కావడం లేదు అని కంగారు పడిపోతూ ఉంటుంది. బాబుకి బాగా జ్వరం వచ్చింది అక్క ఆ కిడ్నాపర్స్ బాబుని బలవంతంగా లాక్కొని వెళ్ళిపోయారు కదా భయపడినట్టున్నాడు అందుకే జ్వరం వచ్చింది అని శ్రేయ.. కానీ అవని మాత్రం ఆ కిడ్నాపర్స్ వెనకాల ఎవరున్నారో తెలుసుకోవాలి . ఒక్కసారి కాదు రెండోసారి కూడా ఇలానే జరిగింది కాబట్టి మనం జాగ్రత్తగా ఉండడం మంచిది అని అవని అనుకుంటూ ఉంటుంది.
అవని ఇంట్లోకి వచ్చి రాత్రికి భానుమతి అవని నీకోసమే వెయిట్ చేస్తున్నానమ్మా నువ్వు రాజేంద్రప్రసాద్ కి ఒకసారి వీడియో కాల్ చెయ్యు అని అడుగుతుంది భానుమతి. ఆ మాట వినగానే అవని ఒక్కసారిగా షాక్ అవుతుంది. వీడియో కాల్ ఏంటి అమ్మమ్మ గారు ఏం మాట్లాడుతున్నారు మీరు అని ఆలోచిస్తుంది అప్పుడే పల్లవి దెబ్బకి దొరికిపోయిందిగా ఇప్పుడు మావయ్య గారు లేరు చనిపోయారు అన్న విషయాన్ని చెప్పాలి అంటూ ఆలోచిస్తూ ఉంటుంది కానీ అవినీతి తెలివిగా ప్లాన్ చేసి భానుమతికి వీడియో కాల్ చేసేందుకు ఫోన్ ఇచ్చేస్తుంది అయితే అక్కడ వీడియో కాల్ చేస్తానా ? డాక్టరు రాజేంద్రప్రసాద్ ని చూపించినట్లే చూపించి వెంటనే ఫోన్ అతనికి బీపీ ఎక్కువైంది అమ్మ అంటూ ఫోన్ పెట్టేస్తాడు. అవని ముందుగానే నేను ఆలోచించి ఇలాంటి పని చేశాను కాబట్టి సరిపోయింది లేదంటే ఖచ్చితంగా మావయ్య గారు లేరట్ల విషయాన్ని అత్తయ్యకి చెప్పాల్సిన పరిస్థితి వచ్చేది..
భానుమతి నా కొడుకు రాజేంద్రప్రసాద్ కి బీపీ పెరిగిందని డాక్టర్లు అంటున్నారు ఇంకొకసారి మాట్లాడిస్తామని చెప్తున్నారు కదా అంతవరకు వెయిట్ చేస్తాను అని అంటుంది అమ్మమ్మ గారికి అత్తయ్య గారికి నిజం తెలియకుండా ఎన్ని రోజులు ఇలా చెప్పాలో అర్థం కావడం లేదు అని ఆలోచిస్తూ ఉంటుంది. కానీ పల్లవి మాత్రం అవని చాలా తెలివిగా ఎప్పటికప్పుడు తనమీదకి రాకుండా బయటపడిపోతూనే ఉంటుంది. అవని నిజంగానే గ్రేట్ అంటూ పల్లవి ఆలోచిస్తూ ఉంటుంది ఇంట్లోనే వాళ్ళందరూ కూడా రాజేంద్రప్రసాద్ చనిపోయారు కదా.. అవ్వని ఎలా వీడియో కాల్ మాట్లాడింది ఏం ప్లాన్ చేస్తుంది అని ఆలోచిస్తూ ఉంటారు. కానీ పల్లవి మాత్రం నా ప్లాను మళ్లీ మళ్లీ ఫెయిల్ అవుతూనే ఉంది అవన్నీ చాలా తెలివిగా ఈ సమస్య నుంచి బయట పడుతుంది అంటూ ఆలోచిస్తూ ఉంటుంది. మరి పల్లవి దొరికిపోతుందా లేదా అన్నది ప్రస్తుతం సస్పెన్స్ గా మారింది. ఇక అభి ఫోన్ చేసి అవనితో ఒక నిజం చెప్పాలి అని అంటాడు అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..