Wasim Akram On Pakistan Team: పాకిస్తాన్ క్రికెట్ జట్టు పై మరోసారి వసీం అక్రమ్ విరుచుకుపడ్డారు. తమ పాకిస్తాన్ ప్లేయర్లకు తిండి పైన ఉన్న ధ్యాస, మ్యాచ్ గెలిపించడంపై లేదని సీరియస్ అయ్యారు. కోతులు తమ జీవిత కాలం తినే అరటి పండ్లను… మా పాకిస్తాన్ ప్లేయర్లు డ్రింక్స్ బ్రేక్ లో ఫినిష్ చేస్తారని షాకింగ్ ఆరోపణలు చేశారు. తినడానికి తప్ప… ఆడటానికి ఏమాత్రం పనికిరాని బాంబు పేల్చారు. తమ కాలంలో పాకిస్తాన్ జట్టు అంటే చాలా ఫిట్నెస్ గా ఉండేదని… కానీ ఇప్పటి ప్లేయర్లు, తినడం తప్ప ఫిట్నెస్ మైంటైన్ చేయడం లేదని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో వసీం అక్రమ్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.
పాకిస్తాన్ క్రికెట్ జట్టు పరిస్థితి అత్యంత దారుణంగా తయారయింది. మహిళలతోపాటు పురుషుల పాకిస్తాన్ క్రికెట్ జట్టు గత రెండు సంవత్సరాలుగా సరిగ్గా ప్రదర్శన చేయడం లేదు. ఏ మ్యాచ్ ఆడిన ఓడిపోవడం తప్ప… గెలిచిన దాఖలాలు లేవు. ఇక మొన్న ఇంగ్లాండ్ వెళ్లిన పురుషుల పాకిస్తాన్ క్రికెట్ జట్టు.. వైట్ వాష్ అయింది. మూడు టెస్టులు జరిగితే.. ఒక్కదానిలో కూడా గెలవలేదు. అసలు పోటీనే ఇవ్వలేదు.
ఈ క్రమంలో పాకిస్తాన్ క్రికెటర్ల ప్రదర్శన పై వసీం అక్రమ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పాకిస్తాన్ ప్లేయర్లు ఫిట్నెస్ మైంటైన్ చేయడం లేదని మండిపడ్డారు. తినడం పైన ఉన్న ధ్యాస.. వీళ్లకు ఆటపైన లేదన్నారు. సరిగ్గా ఫిట్నెస్ మైంటైన్ చేస్తేనే… మ్యాచ్ గెలుస్తారని సూచనలు చేశారు. అలా కాదని, తమకు నచ్చినట్లుగా ఫుడ్ తీసుకుంటున్నారని సీరియస్ అయ్యారు. ఈ క్రమంలోనే ప్లేయర్లు ఫిట్నెస్ కోల్పోయి… చెత్తగా ఆడుతున్నారని ఫైర్ అయ్యారు. దీనిపైన పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేకపోతే పాకిస్తాన్ గెలవడం కష్టమేనని.. హెచ్చరించారు వసీం అక్రమ్.
మిగతా ప్లేయర్ల కంటే పాకిస్తాన్ క్రికెటర్లు విపరీతంగా తింటారని ఓ డ్రెస్సింగ్ రూమ్ చెఫ్ సంచలన ఆరోపణలు చేశారు. పాకిస్తాన్ ప్లేయర్లకు ముక్క లేనిదే ముద్ద దిగబోదని ఆరోపణలు చేశారు. అందరి ప్లేయర్ల కంటే విపరీతంగా పాకిస్తాన్ ప్లేయర్లు తిని… ఫిట్నెస్ విషయాన్ని మరిచిపోతారని సీరియస్ అయ్యారు. క్రికెట్ కంటే ఫుడ్డు పైన దృష్టి పెట్టినట్లుగా వీళ్ళ వ్యవహారం ఉంటుందని ఆరోపణలు చేశారు. ఇక ఇప్పటికే ఇంగ్లాండ్ చేతిలో వైట్ వాష్ అయిన పాకిస్తాన్ జట్టును ఉద్దేశించి మాజీ క్రికెటర్లు విమర్శలు చేస్తున్నారు. అయితే వసీం అక్రమ్ మాత్రం.. బాబర్ ఆజంను టార్గెట్ చేశారు. క్రికెట్ ఆడడానికి వెళ్ళావా ? లేదా ఇంగ్లాండులో శనగలు అమ్ముకున్నావా ? అంటూ రెచ్చిపోయారు.