E-Paper
Advertisement

సింగపూర్ తీరంలో షిప్‌లు ఢీ.. ఎగిరిపడ్డ కార్మికులు, వీడియో వైరల్

సింగపూర్ తీరంలో షిప్‌లు ఢీ.. ఎగిరిపడ్డ కార్మికులు, వీడియో వైరల్
Advertisement

Singapore Strait: బస్సులు, విమానాలు ఎదురెదురుగా గుద్దుకోవడం చూస్తుంటాము. ఇక షిప్‌ల వంతు మొదలైపోయింది. సింగపూర్ తీరంలో పనామా జెండాతో ఉన్న సరుకు రవాణా నౌక.. చైనాకు చెందిన పడవను ఢీ కొట్టింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది. అసలు ఘటన ఎలా జరిగింది?

సింగపూర్ తీరంలో షిప్‌లు ఢీ

బస్సులు, విమానాలు, ఇప్పుడు నౌకలు కూడా ఢీ కొన్న ఘటనలు మొదలయ్యాయి. సింగపూర్ తీరంలో సరుకు రవాణా నౌక.. చైనాకు చెందిన చేపల పడవను ఢీ కొట్టింది. బోటును ఓవర్‌టేక్ చేసే ప్రయత్నంలో సరుకు రవాణా నౌక.. పడవను ఢీ కొట్టినట్టు కనిపిస్తోంది. ఘటన తర్వాత చిన్న పడవ గిరగిరా తిరుగుతూ కనిపించింది. దాని డెక్ అంతా నీరుతో నిండిపోయింది. సిబ్బంది తమను తాము కాపాడుకోవడానికి రెయిలింగ్‌లను పట్టుకోవడం కనిపించింది. ఈ ప్రమాదం సెప్టెంబర్ 17న సాయంత్రం 5 గంటల ప్రాంతంలో చోటు చేసుకుంది.

బోటును బలంగా ఢీ కొట్టిన కార్గో నౌక

Advertisement

రెండు నౌకలు ఆ రోజు ఉదయం సింగపూర్ సమీపంలోని ఒకే ఓడరేవు నుండి బయలుదేరాయి. పశ్చిమం వైపు సింగపూర్ జలసంధిలోకి దారితీసే ఒకే కాలువలో ప్రయాణిస్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది.పనామా సరుకు రవాణా నౌక.. పడవను అధిగమిస్తూ సుమారు 3 నాట్ల వేగంతో ప్రయాణిస్తోంది. బోటును ఢీ కొన్న తర్వాత.. ఆ సరుకు రవాణా నౌక సుమారు రెండు గంటల పాటు గంటకు 10 నాట్ల వేగంతో పడమటి దిశగా ప్రయాణించి ఆగింది. ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదు. ఢీ కొన్న తర్వాత చేపల పడవ ఏఐఎస్ (AIS) సిగ్నల్ అందుతూనే ఉంది. ప్రమాదం తర్వాత పడవ తన ప్రయాణాన్ని కొనసాగించి, ఆ తర్వాత సమీపంలోని ఓడరేవుకు చేరుకుంది.

ఎగిరిపడిన కార్మికులు.. వీడియో వైరల్

బల్క్ క్యారియర్ పనామా కార్గో షిప్ మార్గాన్ని అడ్డగించి ఉండవచ్చని అంటున్నారు. చిన్న పడవను పెద్ద నౌకల మధ్య చిక్కుకుపోయి ఉంటుందని సముద్రయాన విశ్లేషకుడు మెర్కోగ్లియానో ​​సోషల్ మీడియాలో వెల్లడించారు. ఓడల ఢీకొన్న వీడియో ఒక వైపు దృశ్యాన్ని మాత్రమే చూపించింది. బోటులోని కొందరు వ్యక్తులు ఈ సన్నివేశాలను చిత్రీకరించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. కేవలం వీడియో చూడటం ద్వారా మొత్తం పరిస్థితిని అర్థం చేసుకోవడం కష్టమన్నారు. పనామా మారిటైమ్ అథారిటీ ఈ ప్రమాదంపై దర్యాప్తు ప్రారంభించింది. ఈ ఘటనపై సింగపూర్ మారిటైమ్ అండ్ పోర్ట్ అథారిటీ నుండి ఎలాంటి ప్రకటన వెలువడలేదు.

Advertisement

ALSO READ: కెనడాలో విమాన ప్రమాదం.. ఇద్దరు ఇండియన్ స్టూడెంట్స్ మృతి, ఎలా జరిగింది?

ఈ ప్రమాదం మలక్కా జలసంధికి సమీపంలో సింగపూర్ జలసంధి ఉంది. సింగపూర్-మలక్కా జలసంధులు ప్రపంచంలో అత్యంత రద్దీగా ఉండే సముద్ర వాణిజ్య మార్గాలలో ఒకటి. ఆసియా, ఐరోపా, మధ్యప్రాచ్యం మధ్య జరిగే సముద్ర వాణిజ్యానికి కీలకమైన మార్గాలు. ప్రపంచ వాణిజ్యంలో సుమారు 40 శాతం ఈ మార్గాల ద్వారా జరుగుతోంది. అంతేకాకుండా ప్రపంచంలోని సముద్ర మార్గ చమురు రవాణాలో దాదాపు మూడింట ఒక వంతుకు ఈ మార్గాలు కీలకమైనవి. ప్రతిరోజూ పెద్ద సంఖ్యలో కంటైనర్ నౌకలు, చమురు ట్యాంకర్లు, సరుకు రవాణా నౌకలు వీటి గుండా ప్రయాణిస్తాయి.

 

Tags

Related News

కెనడాలో విమాన ప్రమాదం.. ఇద్దరు ఇండియన్ స్టూడెంట్స్ మృతి, ఎలా జరిగింది?

రియాద్‌పై హౌతీల మిసైల్ ఎటాక్.. మిడిల్ ఈస్ట్‌లో హై అలర్ట్!

మాస్కోపై ఉక్రెయిన్ మెగా అటాక్.. 1,000కి పైగా డ్రోన్లతో రష్యాకు భారీ షాక్

రావణకాష్టంగా మారిన మధ్యప్రాచ్యం.. హౌతీల దాడులతో అమెరికా హైఅలర్ట్‌, అర్జెంటుగా వైట్‌హౌస్‌‌కు ట్రంప్

రష్యా ఆంక్షల బిల్లుపై ట్రంప్ సంతకం.. భారత్‌కు 100% టారిఫ్ ముప్పు.. విదేశాంగ శాఖ రియాక్షన్ ఇదే!

పాకిస్థాన్‌లో ఘోరం.. మసీదు వద్ద ఆత్మాహుతి దాడి.. 16 మంది మృతి!

లాక్‌డౌన్ దిశగా పాకిస్థాన్ అడుగులు.. ఆ తరహా ఆంక్షలు, పెళ్లిళ్లలో ఒకే వంటకం

Big Stories

Advertisement
×