Intinti Ramayanam Today Episode September 25th : అక్షయ్ అవని దగ్గరికి వచ్చి ఏమైంది ఎందుకు ఇలా ఉన్నావు అని అడుగుతాడు. ఏమీ లేదండి కొన్ని కొన్ని విషయాల్లో నమ్మకుండా ఉంటే మనమే మనసిపోతాను నాకు అర్థమైంది అని గొంతులో కులం మాట్లాడడంతో అక్షయ్ ఏమైనా చెప్పు అని పదే పదే అడుగుతాడు. అక్షయ్ కి అవని మీద అనుమానం వస్తుంది.. ఎందుకు అవని ఇలా మాట్లాడుతుంది అని అక్షయ్ కంగారు పడిపోతూ ఉంటాడు. అక్షీ కూడా నిజం చెప్పకుండా అవని దాచాలి అని అనుకుంటుంది. అయితే పల్లవి గురించి నిజం చెప్తే తన చెల్లిని తనని తప్పుగా అనుకుంటారని ఏదో ఒకటి కవర్ చేసి బయటకు వెళ్ళిపోతుంది.
అక్షయ్ ఏమైందని నిజం చెప్పు అని అడుగుతుండగా ఆరాధ్య ఎక్కడ అని అవని బయటకు వెళ్ళిపోతుంది. పార్వతిని హారతి గురించి అడిగితే ఒక ముఖ్యమైన పని మీద బయటకు వెళ్లిందమ్మా వచ్చేస్తూ ఉంటుంది నువ్వు ఏమి కంగారు పడుకొని అవనీతో అంటుంది పార్వతి.. అదేం తాతయ్య ఆరాధ్య ఎక్కడ అంటే ఏదో మాట్లాడుతున్నారు అని అవని అడుగుతుంది. ఇటు పల్లవి పార్వతికి ఎలాగైనా సరే నిజం చెప్పాలి అని అనుకుంటుంది.
ఆరాధ్య ఎక్కడ చూసినా కనిపించడం లేదు. మీకేమైనా కనిపించిందా అత్తయ్య ఎక్కడ కనిపించలేదు కదా ఎక్కడికి వెళ్ళింది అని పార్వతిని అడుగుతుంది అవని. తను ఒక మంచి కార్యమేదే బయటికి వెళ్లిందమ్మా? ఎలాగైనా సరే వచ్చేస్తుందిలే.. నువ్వెందుకు భయపడుతున్నావు ఏం భయపడదు తను ఒక మంచి పని చేయడానికి వెళ్ళింది కాబట్టి నువ్వు కంగారు పడాల్సిన అవసరం లేదు అని అవనితో పార్వతి చెప్పగానే అవనికి కాస్త టెన్షన్ మొదలవుతుంది. అప్పుడే అక్కడికి వచ్చిన ఆరాధ్య కమల్ని అవని ఎక్కడికి వెళ్లారు అని అడుగుతుంది. నన్ను చెప్పకుండానే ఆరాధ్య ఆశ్రమానికి తీసుకెళ్ళింది వదిన అని చెప్తాడు. అయితే నాకు చెప్పకుండా ఎందుకు వెళ్లావు అని ఆరాధ్య పై అవని సీరియస్ అవుతుంది.. అత్తయ్యకి ఏదో ఒక రోజు నిజం చెప్పాలి అని అవని ఆలోచిస్తూ ఉంటుంది.
అత్తయ్యకు నిజం తెలియనివ్వకుండా వీళ్ళు చేసిన ప్లాన్లు బాగానే వర్కౌట్ అవుతున్నాయి ఏదో ఒక రోజు తనకి నిజం చెప్పాల్సిందే అని పల్లవి మనసులో అనుకుంటుంది. అయితే మీకు తెలియకుండా ఒకటి జరుగుతుంది అని మీరు అనుమానం పడుతున్నారు కదా అత్తయ్య కచ్చితంగా విషయం మీకు తెలియాలి ఇప్పుడు కాదు ఇంకొన్ని రోజుల తర్వాత నేనే మీకు ఆ విషయం చెప్తాను అని పార్వతి తో అవని అనడంతో పార్వతి ఏంటి ఆ విషయము అని టెన్షన్ పడిపోతూ ఉంటుంది. అవని దగ్గరికి వచ్చిన పల్లవి నువ్వు అత్తయ్యకి నిజం చెప్పకుండా దాస్తున్నావు. ఈ నిజాన్ని ఎప్పుడూ చెప్పాలనుకుంటున్నావో నాకు అర్థం కావడం లేదు అని మాట్లాడుతుంది. ఆ మాట వినగానే అవని పల్లవి చంప పగలగొడుతుంది. అత్తయ్యకి నిజం చెప్పిన తర్వాత నీ సంగతి కూడా చూస్తాను అని అవని పల్లవికి వార్నింగ్ ఇస్తుంది.
భానుమతి వంటగదిలో స్వీట్లు ఎక్కడున్నాయని వెతుకుని మరి తినడానికి ప్రయత్నాలు చేస్తుంది. మొత్తానికి స్వీట్ డబ్బాని తీసుకొని పెట్టుకుంటుంది అయితే అప్పుడే ఆరాధ్య ఎదురుగా రావడంతో ఈ పిల్ల రాక్షసి వచ్చేసి నీకు సీట్లు కూడా తిననివ్వదు. అని ఆలోచిస్తూ ఉంటుంది. నువ్వు స్వీట్లు తినడానికి నేను అస్సలు ఒప్పుకోను బాబాయ్ కి ఇప్పుడే చెప్తాను అని ఆరాధ్య చెప్తుంది. కమల్ ప్రవర్తన చూసి భానుమతికి అనుమానం కూడా మొదలవుతుంది. కానీ కమల్ మాత్రం ఏమీ మాట్లాడకుండా స్వీట్ తినాలనిపిస్తుందా అయితే తినేసేయని పెద్ద క్లాస్ పీకి మరి తినడానికి ఇస్తాడు. భానుమతికి కమల్ పై అనుమానం ఇంకాస్త పెరిగిపోతుంది. అయితే కమల్ ఎందుకు మాట్లాడాడో తెలియలేదు కానీ వాడు మాత్రం నాకు స్వీట్ ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది అని భానుమతి సంతోష్ పడిపోతూ ఉంటుంది.
అవని ఏంటమ్మా వంటగదిలో నువ్వు ఎప్పుడు ఏదో ఒక పని చేస్తూ ఉంటావు. నువ్వేమీ పనిచేయదమ్మా అని ఎంత చెబుతున్నా సరే.. మీనాక్షి మాత్రం అస్సలు వినకుండా నేను జస్ట్ సాయి మాత్రమే చేస్తున్నాను మిగతా పనులన్నీ నువ్వే చేస్తున్నావు అని అంటుంది. అయితే పల్లవికి నాన్ వెజ్ అంటే ఇష్టం కదా మా చికెన్ తీసుకొని వచ్చాను తనకోసం చికెన్ కర్రీ చేస్తాను అని అవనితో అనగానే దానికి చికెన్ కాదమ్మా మనుషుల మనసులని విడగొట్టి ఎంజాయ్ చేశారు రాక్షసి అని ఆలోచిస్తూ ఉంటుంది. చికెన్ కన్నా మటన్ తీసుకొని వచ్చి ఉంటే బాగుండేది కదమ్మా పాయ చేసి పెట్టేదాన్ని అని అవని అంటుంది. నెక్స్ట్ టైం నుంచి అలానే చేసి తీసుకొని వస్తానమ్మా అని మీనాక్షి అంటుంది అప్పుడు అక్కడికి వచ్చిన పల్లవి నాకు తలనొప్పిగా అందుకు కాఫీ ఇవ్వమని అడుగుతుంది. అయితే పల్లవికి ఎలాగైనా సరే దిమ్మ తిరిగే షాక్ ఇవ్వాలని అవని కాఫీలో కారం కలిపి పల్లవికి తీసుకొని వెళుతుంది అంతే అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి.