E-Paper
Advertisement

ఇదే సరైన టైమ్.. iPhone 17పై ఫ్లిప్‌కార్ట్‌లో భారీ డిస్కౌంట్, ఆఫర్ వివరాలివే!

ఇదే సరైన టైమ్.. iPhone 17పై ఫ్లిప్‌కార్ట్‌లో భారీ డిస్కౌంట్, ఆఫర్ వివరాలివే!
Advertisement

Flipkart Big Billion Days 2026: ఈసారి ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ 2026 సేల్‌లో ఐఫోన్లపై వచ్చే డీల్స్ ఇప్పుడు యాపిల్ లవర్స్‌లో ఆసక్తిని పెంచుతున్నాయి. అక్టోబర్ 9 నుంచి ప్రారంభం కానున్న ఈ మెగా సేల్‌లో ఎలక్ట్రానిక్స్‌పై భారీ ఆఫర్లు అందుబాటులోకి రానున్నాయి. అంతేకాదు.. ఫ్లిప్‌కార్ట్ ప్లస్ మెంబర్లకు ఒక రోజు ముందుగానే ఈ డీల్స్‌ను యాక్సెస్ చేసే అవకాశం ఉంటుంది. ఈసారి ముఖ్యంగా ఐఫోన్ 17, ఐఫోన్ 15 మోడళ్లపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ రెండు మోడళ్లపై ఎంత డిస్కౌంట్ లభించనుంది? అసలు ఏ ధరకు ఐఫోన్ సొంతం చేసుకునే అవకాశం ఉంది? పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.

ఐఫోన్ 17 ఆఫర్లు..

యాపిల్ ఇటీవలే మార్కెట్లోకి తెచ్చిన ఐఫోన్ 17 256జీబీ వేరియంట్ సాధారణ ధర రూ.99,900 వరకు ఉంటుంది. కానీ ఈ సేల్‌లో బ్యాంక్ ఆఫర్లు, డిస్కౌంట్లు కలుపుకుని రూ.79,999 ఆఫర్ ధరకే సొంతం చేసుకోవచ్చు. అంటే దాదాపు రూ.19,901 వరకు నేరుగా తగ్గింపు లభిస్తోంది. క్రెడిట్ కార్డ్ ఈఎమ్‌ఐ చెల్లింపులపై రూ.2,500 అదనపు డిస్కౌంట్‌తో పాటు రూ.3,000 ఎక్స్ఛేంజ్ బోనస్ కూడా పొందే వెసులుబాటు ఉంది.

Advertisement

Also Read: సర్కిల్ మధ్యలో గీత.. శాంసంగ్ ఫోన్‌లో ఈ సింబల్ ఎందుకు వస్తుందో తెలుసా?

బ్యాంక్, ఈఎమ్‌ఐ ఆఫర్లు..

ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ లేదా ఎస్‌బీఐ క్రెడిట్ కార్డులు ఉన్నవారు 5 శాతం క్యాష్‌బ్యాక్ ద్వారా ధరను ఇంకా తగ్గించుకోవచ్చు. దీంతో ఈ ఐఫోన్ ప్రభావవంతమైన ధర రూ.77,999 వరకు దిగివస్తుంది. ఒకేసారి అంత డబ్బు పెట్టలేని వారి కోసం 6 లేదా 9 నెలల నో-కాస్ట్ ఈఎమ్‌ఐ సదుపాయం కూడా ఉంది. నెలకి కేవలం రూ.8,667 చెల్లించి కూడా ఈ ఫోన్‌ను కైవసం చేసుకోవచ్చు.

ఎక్స్ఛేంజ్ బోనస్..

Advertisement

మీ దగ్గర పాత ఫోన్ ఉంటే దాని కండిషన్‌ను బట్టి ఈ సేల్‌లో మైండ్ బ్లోయింగ్ ఆఫర్ పొందవచ్చు. పాత ఫోన్ ఎక్స్ఛేంజ్ చేయడం ద్వారా గరిష్టంగా రూ.89,850 వరకు తగ్గే అవకాశం ఉందని ఫ్లిప్‌కార్ట్ చెబుతోంది. ఇక ఐఫోన్ 17 ఫీచర్ల విషయానికి వస్తే.. ఇది 6.3 అంగుళాల డిస్‌ప్లే, శక్తివంతమైన ఏ19 చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. బ్లాక్, లావెండర్, మిస్ట్ బ్లూ, సేజ్, వైట్ రంగుల్లో అందుబాటులో ఉంది.

ఐఫోన్ 15 ధరల తగ్గింపు..

కొంచెం తక్కువ బడ్జెట్‌లో ఐఫోన్ కావాలనుకునే వారికి ఐఫోన్ 15 మంచి ఛాయిస్. రూ.74,900 ఉండే ఈ మోడల్ సేల్‌లో బ్యాంక్ ఆఫర్లతో కలిపి రూ.63,999 ఆరంభ ధరకే లభిస్తుంది. పాత ఐఫోన్‌ను ఎక్స్ఛేంజ్ చేస్తే రూ.54,400 వరకు ఆదా చేసుకోవచ్చు. 6.1 అంగుళాల డిస్‌ప్లే, ఏ16 బయోనిక్ చిప్‌సెట్‌తో వచ్చే ఈ ఫోన్ బ్లాక్, గ్రీన్, బ్లూ, ఎల్లో, పింక్ కలర్స్‌లో దొరుకుతుంది.

Also Read: పాత ఐఫోన్ స్లో అయిందా? ఈ 5 సెట్టింగ్స్ మార్చితే కొత్తదానిలా దూసుకెళ్తుంది!

Tags

Related News

పాత ఐఫోన్ స్లో అయిందా? ఈ 5 సెట్టింగ్స్ మార్చితే కొత్తదానిలా దూసుకెళ్తుంది!

ట్రాయ్ టెలికాం యూజర్ల గణాంకాలు.. Jio, Airtelకి షాకిచ్చిన BSNL.. పాపం చతికిలపడ్డ వీఐ!

సర్కిల్ మధ్యలో గీత.. శాంసంగ్ ఫోన్‌లో ఈ సింబల్ ఎందుకు వస్తుందో తెలుసా?

MacBook Air M5 ప్రియం అనుకుంటున్నారా? క్రోమా ఆఫర్ చూస్తే పక్కా కొనేస్తారు!

బెస్ట్ డబుల్ డోర్ ఫ్రిడ్జ్‌లపై..భారీ డిస్కౌంట్లు! వెంటనే కొనేయండి

మ్యూజిక్ లవర్స్‌ని ఫిదా చేసేలా..నథింగ్ కొత్త గాడ్జెట్, మీరూ ఓ లుక్కేయండి

మొబైల్ యూజర్లకు గుడ్ న్యూస్ చెప్పిన TRAI.. ఇకపై డాటా లేకుండా తక్కువ ధరకే రీఛార్జ్ ప్లాన్లు!

Big Stories

Advertisement
×