E-Paper
Advertisement

ఎక్స్‌ప్రెస్ హరిపై మనసు పారేసుకున్న బుల్లితెర నటి.. ఎవరంటే?

ఎక్స్‌ప్రెస్ హరిపై మనసు పారేసుకున్న బుల్లితెర నటి.. ఎవరంటే?
Advertisement

Express Hari:ఎక్స్‌ప్రెస్ హరి.. ఈ పేరు గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. తనదైన కామెడీ టైమింగ్ తో అందరి దృష్టిని ఆకట్టుకునే ఈయన.. తొలిసారి పటాస్ షో ద్వారా తన కెరియర్ ను ఆరంభించారు. ఇందులో రచయితగా, కమెడియన్ గా ఎంట్రీ ఇచ్చిన హరి.. ఆ తర్వాత పలు టీవీ షోలు, సినిమాలతో మంచి పేరు సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం టీవీ షోలలో రచయితగా, కమెడియన్ గా దూసుకుపోతున్న ఈయన.. తాజాగా ప్రముఖ యాంకర్ శ్రీముఖి, ముక్కు అవినాష్ లతో కలిసి ఆదివారం విత్ స్టార్ మా పరివారం షోలో తోటి కమెడియన్గా సందడి చేస్తున్న విషయం తెలిసిందే.

ఇకపోతే బతుకమ్మ సంబరాలు పేరిట రిలీజ్ చేసిన తాజా ప్రోమోలో ఒక బుల్లితెర నటి ఎక్స్‌ప్రెస్ హరిపై మనసు పారేసుకుంది. నేను ఎంత ట్రై చేసినా నన్ను వదిలేసి ఇంకొకరిని చూస్తున్నాడు అంటూ కామెంట్లు చేసింది . మరి అసలు ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం.. ఆదివారం విత్ స్టార్ మా పరివారం బతుకమ్మ స్పెషల్ ఎపిసోడ్లో భాగంగా మొదటి ప్రోమోని విడుదల చేశారు నిర్వాహకులు. అందులో సీరియల్స్ లో నటించే ఫిమేల్ సెలబ్రిటీస్ వచ్చి సందడి చేశారు. స్టార్ మా సీరియల్ సెలబ్రిటీస్ ని శ్రీముఖి ఇంట్రడ్యూస్ చేస్తుండగానే.. రోహిణినీ గన్నేరు అంటూ తనదైన మాటలతో నవ్వించింది. వెంటనే ప్రిన్సి బి కృష్ణన్ హరి నీ స్టేజ్ పైకి లాక్కొచ్చి మరీ బాలకృష్ణ మూవీ కి స్టెప్పులేసింది.

హరి పై లవ్ ఎక్స్ప్రెస్ చేసిన ప్రిన్సి..

Advertisement

వీళ్ళిద్దరి జోడిని చూసి అవినాష్ మాట్లాడుతూ..” చాలా బాగుంది మీ జంట.. మీరిద్దరూ పెళ్లి చేసుకుంటే చాలా చక్కగా ఉంటారు” అని అవినాష్ చెప్పగా.. ప్రిన్సి మాట్లాడుతూ..” అవును చాలా బాగుంటుంది. నేను షోకి వచ్చిన ప్రతిసారి ట్రై చేస్తుంటాను. కానీ వీడేమో వేరే వాళ్ళను గోకుతున్నాడు” అంటూ తనదైన కామెడీ టైమింగ్ తో ఆడియన్స్ ని నవ్వించింది.

also read:హీటెక్కిన బిగ్ బాస్ 10 నామినేషన్.. మళ్లీ అతడే టార్గెట్!

నవ్వులు పూయించిన ప్రోమో..

Advertisement

హరి కూడా తనదైన శైలిలో మాట్లాడుతూ..” నాకు ఎవరూ పడరు అనుకున్నాను. ఇది పడిందేంటి?” అంటూ నవ్వులు పూయించారు. మరో సెలబ్రిటీ మాట్లాడుతూ..”నాకు తెలిసి మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ సీజన్ 2 కి విన్నర్ దొరికేశారు” అంటూ కామెంట్ చేసింది. ప్రిన్సి, హరిల దగ్గరకు రోహిణి, శ్రీముఖి వచ్చి మాట్లాడుతూ.. “హరితో నీ పెళ్లి.. అంటే.. ఇది నీ జీవితంలో సవాల్ కాదు.. నీ జీవితమే సవాల్ ” అంటూ బిగ్ బాస్ 10 హోస్ట్ నాగార్జున చెప్పిన డైలాగును ఈ విధంగా వాడేసింది శ్రీముఖి. మొత్తానికి అయితే సరదాగా సాగిన ఈ ప్రోమోలో సెలబ్రిటీలందరూ సందడి చేశారు. ఇక పూర్తి ఎపిసోడ్ చూడాలి అంటే ఆదివారం వరకు ఎదురు చూడాల్సిందే. ఈ ప్రోమోలో ప్రిన్సి , హరిల జోడి ప్రేక్షకులను ఆకట్టుకుంది.

ప్రిన్సి బి కృష్ణన్ కెరియర్..

ప్రిన్సి బి కృష్ణన్ విషయానికి వస్తే.. ఈమెను ప్రెస్ ప్రిన్సి అని కూడా పిలుస్తూ ఉంటారు. కుంకుమపువ్వు సీరియల్ లో అమృత పాత్రతో మంచి ప్రేక్షకు ఆదరణ సొంతం చేసుకున్న ఈమె.. రోజా , కావేరి , మల్లి వంటి సీరియల్స్ లో నటించి తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. ఇక నిత్యం కామెడీ టైమింగ్ తో ఆడియన్స్ ను ఆకట్టుకుంటూ ఉంటారు ప్రిన్సి.

Related News

బిగ్ బాస్ 10లో లేడీ కంటెస్టెంట్స్ సింపథీ ప్లే చేస్తున్నారా?

హీటెక్కిన బిగ్ బాస్ 10 నామినేషన్.. మళ్లీ అతడే టార్గెట్!

మిథిలేష్ పరువు తీయాలనుకున్న బిగ్ బాస్.. కట్ చేస్తే?

ఓటీటీ లవర్స్ కు పండగే.. ఆ రెండు మస్ట్ వాచ్..

ఈ రొమాన్స్ ఏంటి బిగ్ బాస్?

Podarillu Gopika : చక్రీ ప్యాన్స్ కు గుడ్ న్యూస్.. గోపిక అవుట్..

Intinti Ramayanam TRP Rating : ‘గుండెనిండా గుడిగంటలు’ టీఆర్పీ రేటింగ్..సెప్టెంబర్ హైలెట్ ఎపిసోడ్స్..

Big Stories

Advertisement
×