E-Paper
Advertisement

బిగ్ బాస్ 10.. ఇంట్లోకి వెళ్ళే తొలి కంటెస్టెంట్ ఎవరంటే?

బిగ్ బాస్ 10.. ఇంట్లోకి వెళ్ళే తొలి కంటెస్టెంట్ ఎవరంటే?
Advertisement
Bigg Boss 10 : బిగ్ బాస్ దశావతారం అంటూ చాలా కొత్తగా ఊహకందని టాస్కులతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది అంటూ హోస్ట్ నాగార్జున మొదటి నుంచి ఈ సీజన్ పై అంచనాలు పెంచుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా వినోదం, గొడవలు, ప్రేమ అన్ని పదిరెట్లు ఎక్కువే అంటూ మిగతా సీజన్లతో కంపేర్ చేస్తూ ఈ సీజన్ పై భారీ అంచనాలు పెంచుతున్నారు. ఈ క్రమంలోనే బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లే సెలబ్రిటీస్ ఎవరు?  కామనర్స్ కోటాలో ఎవరెవరు హౌస్ లోకి అడుగుపెడుతున్నారు?  అనే విషయాలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతున్న విషయం తెలిసిందే .అంతేకాదు హౌస్ లోకి వెళ్లబోయే వారి జాబితా ఇదే అంటూ కొన్ని పేర్లు కూడా వైరల్ అవుతున్నాయి.. ఈ క్రమంలోనే బిగ్ బాస్ సీజన్ 10 గ్రాండ్గా లాంచ్ కాబోతున్న నేపథ్యంలో హౌస్ లోకి అడుగుపెట్టబోయే తొలి కంటెస్టెంట్ ఈమె అంటూ మరో వార్త వైరల్ గా మారుతోంది.

హౌస్ లోకి అడుగుపెట్టే తొలి కంటెస్టెంట్..

అసలు విషయంలోకి వెళ్తే.. సెలబ్రిటీలను నేరుగా హౌస్ లోకి తీసుకుంటుంటే.. సామాన్యులను అగ్ని పరీక్ష అనే షో ద్వారా హౌస్ లోకి తీసుకుంటున్నారు. ఇప్పటికే సామాన్యుల నుండి 25 వేలకు పైగా దరఖాస్తులు రాగా , అందులో 70 మందిని పలు రౌండుల ద్వారా ఎంపిక చేశారు. ఆ 70 మందిలో అగ్నిపరీక్ష షోలో వారి బలాబలాలను పరీక్షించి, 15 మందిని ఎంపిక చేయడం జరిగింది. అయితే ఆ 15 మందికి ఇప్పుడు పెద్ద ఎత్తున టాస్కులు నిర్వహిస్తూ.. వారి టాలెంట్ ను గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు జడ్జెస్. ఈ క్రమంలోనే 6 మంది కామనర్స్ హౌస్ లోకి అడుగుపెడుతున్నారట. ఇదిలా ఉండగా ఇప్పుడు హౌస్ లోకి వెళ్లే తొలి కంటెస్టెంట్ ఎవరు అంటూ వార్తలు రాగా అందులో ఝాన్సీ (Jhansi )పేరు ప్రథమంగా వినిపిస్తోంది.

ఎవరీ ఝాన్సీ..

తన పాటలతో, పొలం పనులతో భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న ఝాన్సీ అగ్నిపరీక్షలో తన పెర్ఫార్మన్స్ తో జడ్జెస్ ను మెప్పించి మంచి మార్కులు కొట్టేసి,  ఇప్పుడు హౌస్ లోకి వెళ్లే మొదటి లేడీ కంటెస్టెంట్ గా ఈమెను ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. నిజానికి మొదటి నుంచి అగ్నిపరీక్షలో తన తెలివితేటలతో,  కష్టపడే తత్వంతో, అంకితభావంతో ముందుకు సాగుతోంది ఝాన్సీ . ఈ నేపథ్యంలోనే జడ్జీలు కూడా ఈమెపై పాజిటివ్ గానే ఉన్నట్టు తెలుస్తోంది.

ఝాన్సీ బ్యాక్ గ్రౌండ్..

ఝాన్సీ బ్యాక్ గ్రౌండ్ విషయానికి వస్తే.. సూర్యాపేట జిల్లా చివ్వెం మండలంలోని కోమటికుంట గ్రామానికి చెందింది.  జానపద పాటలతో పాటు పొలం పనులు చేస్తూ ఆ ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ మరింత క్రేజ్ దక్కించుకుంది. ఇక ఆ క్రమంలోనే అగ్నిపరీక్షకు దరఖాస్తు చేసుకొని షోలో పార్టిసిపేట్ చేసింది. అక్కడ తన తెలివితేటలతో సక్సెస్ సాధించింది. ఇప్పుడు హౌస్ లోకి అడుగుపెట్టబోతున్నట్లు తెలుస్తోంది. మరి బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చాక ఆమె ఎలాంటి గుర్తింపును సంపాదించుకుంటుందో చూడాలి. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఝాన్సీ కచ్చితంగా టైటిల్ విన్నర్ అవ్వాలి.. అంటూ కోరుతున్నారు. ఇకపోతే సెప్టెంబర్ 6వ తేదీన సాయంత్రం 7:00 గ్రాండ్ గా స్టార్ మా ఛానల్ వేదికగా కొత్త సీజన్ ప్రారంభం కాబోతోంది.

Related News

Podarillu Kanna : సీరియల్ ఫ్యాన్స్ కు షాకింగ్ న్యూస్.. కన్నా అవుట్..

Gundeninda GudiGantalu Today episode: రోహిణి ఇరుక్కుంటుందా..? మీనాకు కొత్త టెన్షన్.. బాలు, ప్రభా ఫైట్..

Podarillu Today Episode : నారాయణ మాటతో షాక్.. జమునకు మైండ్ బ్లాక్.. మహాకు నిజం తెలుస్తుందా..?

Intinti Ramayanam Today Episode: అవని జైలుకేనా..? పల్లవిని కొట్టిన కమల్.. అవనిని కొట్టిన పోలీసులు..

Karthika Deepam 2 Serial Today Episode October 15th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: జ్యోత్స్న చనిపోయిందన్న ఎస్సై – అయోమయంలో సూరజ్‌          

Illu Illalu Pillalu Today Episodes: రామరాజు కోసం కన్నీళ్లు.. భద్రకు తల్లి వార్నింగ్.. వల్లికి, భాగ్యంకు దిమ్మతిరిగే షాక్..

Illu Illaalu Pillalu : రామరాజు అరెస్ట్.. స్టోరీలో ఊహించని ట్విస్ట్.. శ్రీవల్లి అవుట్..

Brahmamudi Serial Today Episode October 15th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: సొంత ఆఫీసుకు వెళ్తూ రేఖకు షాక్‌ ఇచ్చిన ఐశ్వర్య

Big Stories

Advertisement
×