E-Paper
Advertisement

ఏథర్ కోనార్క్ ఎలక్ట్రిక్ స్కూటర్ గ్రాండ్ ఎంట్రీ, జస్ట్ రూ. లక్షకే కొత్త ఫ్యామిలీ ఈవీ!

ఏథర్ కోనార్క్ ఎలక్ట్రిక్ స్కూటర్ గ్రాండ్ ఎంట్రీ, జస్ట్ రూ. లక్షకే కొత్త ఫ్యామిలీ ఈవీ!
Advertisement

Ather Konark Electric Scooter: ఇండియన్ ఎలక్ట్రిక్ టూ వీలర్ మార్కెట్లోకి ఏథర్ ఎనర్జీ మరో కొత్త స్కూటర్‌ ను తీసుకురావడానికి రెడీ అయ్యింది. ఈ సరసమైన ఫ్యామిలీ ఎలక్ట్రిక్ స్కూటర్‌ కు ‘కోనార్క్’ అనే పేరును ఖరారు చేసింది. ఈ కొత్త స్కూటర్‌ ను ఆగస్టు 29న జరిగే ఏథర్ కమ్యూనిటీ డే కార్యక్రమంలో ఆవిష్కరించనుంది. ఈ స్కూటర్‌ ను ఏథర్ పూర్తిగా కొత్తగా రూపొందించిన EL ప్లాట్‌ ఫామ్ ఆధారంగా డెవలప్ చేసింది. ఈ ప్లాట్‌ ఫామ్‌పై  భవిష్యత్తులో మరిన్ని ఎలక్ట్రిక్ టూ వీలర్లను తీసుకురావాలని కంపెనీ భావిస్తోంది.

కోనార్క్ ధర ఎంత అంటే?

ధర విషయానికి వస్తే, కోనార్క్ బేస్ వేరియంట్ సుమారు రూ.1 లక్ష ఉంటుందని ఆటో నిపుణులు భావిస్తున్నారు.  ప్రస్తుతం మార్కెట్లో ఉన్న ఏథర్ 450 సిరీస్, రిజ్టా మోడళ్ల కంటే ఇది తక్కువ ధరలో అందుబాటులోకి రానుంది. దీంతో తొలిసారి ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలనుకునే వారికి బెస్ట్ ఆప్షన్ కానుంది. ఏథర్ గత ఏడాది కమ్యూనిటీ డే కార్యక్రమంలో EL01 కాన్సెప్ట్ పేరుతో ఈ కొత్త ప్లాట్‌ఫామ్‌ను పరిచయం చేసింది. ఇప్పుడు అదే కాన్సెప్ట్‌ ను ఆధారంగా చేసుకుని కోనార్క్‌ ను ప్రొడక్షన్ వెర్షన్‌ గా తీసుకొస్తోంది. కంపెనీ విడుదల చేసిన టీజర్ ను చూస్తే, కాన్సెప్ట్ మోడల్‌ లో కనిపించిన డిజైన్‌ ను అలాగే కొనసాగించినట్లు తెలుస్తోంది.

EL ప్లాట్‌ఫామ్ ప్రత్యేకత ఏంటి?

Advertisement

కొత్త EL ప్లాట్‌ ఫామ్ ప్రత్యేకత ఏమిటంటే, దీని మీద పలు రకాల ఎలక్ట్రిక్ స్కూటర్లను తయారు చేసే అవకాశం ఉంది. ఇందులో 2 kWh నుంచి 5 kWh వరకు సామర్థ్యం కలిగిన బ్యాటరీ ప్యాక్‌ లను అమర్చవచ్చు. వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా భవిష్యత్తులో వేర్వేరు బ్యాటరీ ఎంపికలతో కొత్త మోడళ్లను కూడా విడుదల చేసే అవకాశం ఉంది.

డిజైన్ గురించి..

డిజైన్ పరంగా చూస్తే, కోనార్క్‌ లో 14 అంగుళాల ఫ్రంట్ వీల్, 12 అంగుళాల రియర్ వీల్ ఉండే అవకాశం ఉంది. బ్రేకింగ్ కోసం ముందు భాగంలో డిస్క్ బ్రేక్, వెనుక భాగంలో డ్రమ్ బ్రేక్ అందించవచ్చని సమాచారం. ఈ సెటప్ రోజువారీ నగర ప్రయాణాలకు అనుకూలంగా ఉంటుందని భావిస్తున్నారు.

ఫీచర్ల గురించి..

Advertisement

ఫీచర్ల విషయంలో కూడా ఏథర్ ఎలాంటి రాజీ పడే అవకాశం కనిపించడం లేదు. ఈ స్కూటర్‌ లో 7 అంగుళాల TFT డిజిటల్ డిస్‌ ప్లే ఇవ్వనున్నట్లు అంచనా. దీనికి స్మార్ట్‌ ఫోన్ కనెక్టివిటీ ఉండటంతో పాటు నావిగేషన్, రైడ్ వివరాలు, వెహికల్ సమాచారం, సాఫ్ట్‌ వేర్ ఆధారిత కనెక్టెడ్ ఫీచర్లు లాంటి సౌకర్యాలు కూడా లభించే అవకాశం ఉంది. అంతేకాకుండా, ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్, ఎల్ఈడీ టెయిల్‌ ల్యాంప్, పొడవైన సీటు, కుటుంబ అవసరాలకు ఉపయోగపడే స్టోరేజ్ స్పేస్ లాంటి ఫీచర్లు కూడా ఇందులో ఉండొచ్చని తెలుస్తోంది.

ఏ స్కూటర్లకు పోటీ ఇస్తుందంటే?

మార్కెట్లోకి వచ్చిన తర్వాత ఏథర్ కోనార్క్‌ కు గట్టి పోటీ ఉండనుంది. ముఖ్యంగా టీవీఎస్ ఆర్బిటర్, ఓలా S1X సిరీస్, హీరో వీడా VX2, బజాజ్ చేతక్ లాంటి ఎలక్ట్రిక్ స్కూటర్లతో నేరుగా పోటీ పడే అవకాశం ఉంది.

Read Also: కొనుగోలుదారులకు టీవీఎస్ షాక్.. ఐక్యూబ్ సహా పలు స్కూటర్ల ధరలు భారీగా పెంపు!

Tags

Related News

కొనుగోలుదారులకు టీవీఎస్ షాక్.. ఐక్యూబ్ సహా పలు స్కూటర్ల ధరలు భారీగా పెంపు!

ఇదేందయ్యా ఇది.. స్కూటీ రేటు రూ.లక్ష.. పెండింగ్ చలాన్లు మాత్రం రూ.10 లక్షలు!

కొత్త స్కార్పియో-N వచ్చేసింది.. ధర ఎంతో తెలుసా?

టాటా ఎలక్ట్రిక్ కార్లపై సూపర్ ఆఫర్లు.. ఆ మోడల్ పై ఏకంగా రూ.3.35 లక్షల తగ్గింపు!

టాటా కార్లపై భారీ ఆఫర్లు.. ఆ మోడళ్లపై కళ్లు చెదిరే తగ్గింపు!

భారత్‌లో మిష్లిన్ ప్రైమసీ 5 టైర్లు లాంచ్.. ఇప్పుడు మేడ్ ఇండియా వెర్షన్ లో!

దేశంలో బెస్ట్ 5 స్ట్రాంగ్ హైబ్రిడ్ కార్లు.. మైలేజీ, ఫీచర్లలో టాప్ మోడల్స్ ఇవే!

Big Stories

Advertisement
×