OTT Movie : సూపర్‌నాచురల్ హారర్ సినిమాలు ఇచ్చే ఎంటర్టైన్మెంట్ మరో లెవెల్ లో ఉంటుంది. ఈ సినిమాలు అతీంద్రీయ శక్తులతో గుండె ఝల్లుమనిపిస్తాయి. ఈ సినిమాలో ఒక స్కూల్ విద్యార్థికి శక్తులు రావడంతో, తనని ఏడిపించిన వాళ్ళపై రివేంజ్ తీర్చుకుంటాడు. ఈ క్రమంలో స్టోరీ ఊహించని మలుపులు తీసుకుంటుంది. ఈ సినిమా పేరు ఏమిటి ?ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే.
రెండు ఓటీటీలలో స్ట్రీమింగ్
“The Unhealer” ఒక అమెరికన్ సూపర్‌నాచురల్ హారర్-థ్రిల్లర్ చిత్రం. కెవిన్ E. మూర్ దర్శకత్వంలో ఇది తెరకెక్కింది. ఈ చిత్రంలో లాన్స్ హెన్రిక్సెన్, నటాషా హెన్‌స్ట్రిడ్జ్, ఆడమ్ బీచ్, ఎలిజా నెల్సన్, గావిన్ కాసలెగ్నో నటించారు. 1 గంట 34 నిమిషాల రన్ టైమ్ ఉన్న ఈ సినిమాకి IMDbలో 5.4/10 రేటింగ్ ఉంది. అమెజాన్ ప్రైమ్ వీడియో, ఆపిల్ టీవీలలో ఈసినిమా అందుబాటులో ఉంది.
స్టోరీలోకి వెళితే
అరిజోనాలోని ఒక చిన్న పట్టణంలో జరిగే ఈ కథ కెల్లీ అనే టీనేజర్ చుట్టూ తిరుగుతుంది. అతను పైకా అనే అరుదైన తినే వ్యాధితో బాధపడుతుంటాడు. దీనివల్ల చెత్తను తినే అలవాటు చేసుకుంటాడు. ఈ కారణంగా పాఠశాలలో అతన్ని ఏడిపిస్తుంటారు. అతని తల్లి బెర్నిస్, స్నేహితురాలు డొమినిక్ మినహా అతనికి ఎవరూ సహాయం చేయరు. డొమినిక్‌తో అతను ప్రేమలో ఉంటాడు. ఇక స్కూల్ పిల్లలు కెల్లీని చెత్త డబ్బాలో వేసి, వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తారు. ఒక రోజు రాత్రి, ఫ్లూగర్ అనే డ్రిఫ్టర్, ఒక సమాధి నుండి ఆధ్యాత్మిక శక్తులను పొంది, వాటిని ఉపయోగించి ఫెయిత్ హీలర్‌గా మారుతాడు. ఆ సమాధిని రక్షించే రెడ్ ఎల్క్ అనే వ్యక్తి, ఫ్లూగర్‌ను శక్తులను తిరిగి ఇవ్వమని హెచ్చరిస్తాడు. కానీ ఫ్లూగర్ అతన్ని పట్టించుకోడు.
Read Also : రహస్య నిధి కోసం వేట… పనీపాటా మానేసి తింగరోళ్ల సాహసం… కితకితలు పెట్టే మలయాళ కామెడీ డ్రామా