Dhee 20 Promo: బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న డాన్స్ షో ఢీ.. ఎంతోమంది టాలెంట్ డాన్సర్లను పెండితెరకు పరిచయం చేసింది ఈ షో. గత 20 ఏళ్లుగా ఈ షో ద్వారా ఎంతో మంది కొరియోగ్రాఫర్లుగా సినిమాలు చేస్తున్నారు. ప్రస్తుతం 20 వ సీజన్ ని జరుపుకుంటుంది. గత సీజన్ కి టీఆర్ఫీ రేటింగ్స్ పెద్దగా రాలేదు. అందుకే ఈ సీజన్ అదిరిపోవాలనే ఉద్దేశ్యంతో పాత సీజన్స్ కి సంబంధించిన బెస్ట్ డ్యాన్సర్స్ అందరినీ ఈ సీజన్ లోకి తీసుకొచ్చారు. వీళ్ళ మధ్య పోటీ చాలా రసవత్తరంగా సాగుతుంది. ఎవరు తక్కువ కాదు నువ్వా నేనా అనే పోటీ తప్ప. ఈ షో నెక్స్ట్ ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమో ని రిలీజ్ చేశారు. ఆ ప్రోమోలో ఓ తాత అద్భుతంగా డ్యాన్స్ చేశాడు. ఇది ప్రస్తుతం హాట్ టాపిక్ అవుతుంది.
ఢీ 20 లేటెస్ట్ ప్రోమో..
ప్రతి ఎపిసోడ్ కు సంబందించిన ప్రోమో వీడియో సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతున్నాయి. ఢీ డ్యాన్స్ షో లేటెస్ట్ ప్రోమో వచ్చింది. ఫ్రెండ్‌షిప్ డే స్పెషల్ పేరుతో చేసిన ఈ ఎపిసోడ్‌లో అందరూ డ్యాన్స్ చిదగ్గొట్టేశారు. అందులో కంటెస్టెంట్ అభి డ్యాన్స్ పెర్ఫామెన్స్‌లో ఒక ముసలతను గెస్టుగా వచ్చి అందరినీ తన స్టెప్పులతో ఆశ్చర్యపోయేలా చేశారు. మెగాస్టార్ చిరంజీవి స్టయిల్, గ్రేస్ అన్నీ మక్కీకి మక్కీ అన్నట్లు దించేశారు.. ఆయన పెర్ఫార్మన్స్ కు సెట్ మొత్తం విజిల్స్ పడ్డాయి.. ఇక ప్రోమోలో మణికంఠ, కండక్టర్ ఝాన్సీ, రాజు, సంకేత్ ఇలా అందరూ పెర్ఫామెన్స్‌లు చించిపారేశారు. ఈ ప్రోమో చూసి ఢీ షోకి మళ్లీ పూర్వ వైభవం వచ్చిందంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
Also Read:మంగళవారం టీవీలల్లోకి రాబోతున్న సినిమాలు.. ఆ రెండు వెరీ స్పెషల్..
ముసలోడు చిరంజీవిని దించేసాడు..
ఒక ముసలి తాత మెగాస్టార్ చిరంజీవి పాటకు కళ్ళు చెదిరిపోయే రేంజ్ లో డ్యాన్స్ వేయడం అందరినీ షాక్ కి గురి చేసింది. అవేమి స్టెప్పులు, అదేమీ స్పీడ్, అదేమీ గ్రేస్ బాబోయ్, కుర్రోళ్ళు కూడా ఈ రేంజ్ లో డ్యాన్స్ వెయ్యలేరు కదా? చిరంజీవి స్టైల్ ను దించేసాడు. ఆ తాత చిరు పాటలకే అద్భుతమైన స్టెప్పులు వేసాడు. చిరంజీవి గ్రేస్ ని మ్యాచ్ చేయడం అంత తేలికైన విషయం కాదు, అంత సాహసం కూడా ఎవ్వరూ చెయ్యరు, కానీ ఈ తాత చిరంజీవి గ్రేస్ ని మ్యాచ్ చేయడమే కాదు, ఒకానొక సందర్భం లో ఆయన్ని దాటేశాడు కూడా.. ఇప్పుడు సోషల్ మీడియాలో ఒకటే చర్చ ఈ బాబాయ్ ఎవడ్రా..? ఎక్కడి నుంచి వచ్చాడు.. ఇంత టాలెంటెడ్ ఏంట్రా అని.. ఇలాంటి టాలెంటెడ్ వ్యక్తులు మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇంకా ఎంత మంది ఉన్నారో అంటూ నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. ఏది ఏమైన తాత పెర్ఫార్మన్స్ అదిరిపోయింది.. ఈ తాత ఓవర్ నైట్ హీరో అయ్యాడు.. ఈ వీడియో పై ఒక లుక్ వేసుకోండి..