E-Paper
Advertisement

జైలర్ 2 విడుదల పై బిగ్ అప్డేట్.. మరింత గ్రాండ్ గా రిలీజ్!

జైలర్ 2 విడుదల పై బిగ్ అప్డేట్.. మరింత గ్రాండ్ గా రిలీజ్!
Advertisement

Jailer 2 : సూపర్ స్టార్ రజినీకాంత్ నెల్సన్ దిలీప్ కుమార్ కాంబినేషన్లో ఇదివరకు ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ అందుకున్న చిత్రం జైలర్. ఈ సినిమా అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో ఈ సినిమాకు సీక్వెల్ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమా విడుదల కావాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల ఆలస్యం అవుతూ వస్తుంది. ఈ సినిమాని అక్టోబర్ 15వ తేదీ ప్రపంచవ్యాప్తంగా విడుదలకు చిత్ర నిర్మాతలు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

ఐమ్యాక్స్ థియేటర్లలో జైలర్ 2..

సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ నిర్మాణంలో నెల్సన్ దిలీప్ కుమార్(Nelson Deelip Kumar) డైరెక్షన్ లో రజనీకాంత్(Rajinikanth) నటించిన జైలర్ 2(Jailer 2) సినిమాపై ఇప్పటికే భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడిన సంగతి తెలిసిందే. ఇకపోతే ఈ సినిమా ఐమాక్స్(IMAX) ఫార్మాట్ లో విడుదల కాబోతోంది అంటూ గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నప్పటికీ చిత్ర నిర్మాతలు మాత్రం ఈ విషయంపై ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు అయితే తాజాగా సన్ పిక్చర్ బ్యానర్ వారు తమ అధికారక సోషల్ మీడియా ఖాతా ద్వారా జైలర్ 2 అక్టోబర్ 15వ తేదీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఐమ్యాక్స్ థియేటర్లలో ప్రదర్శన కాబోతుందనే విషయాన్ని తెలియజేశారు.

ఐమాక్స్ వెర్షన్ లో రిలీజ్..

Advertisement

ఇలా ఈ సినిమా ఐ మ్యాక్స్ లో స్క్రీనింగ్ అవడం అనేది ప్రేక్షకులకు మరింత వినోదాత్మకంగా ఉండబోతుందని చెప్పాలి. ఇక ఈ విషయాన్ని సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ కూడా అధికారికంగా తెలియజేశారు. ఈ సినిమా తెలుగు విడుదల హక్కులను సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై సూర్యదేవర నాగ వంశీ(Nagavamsi) కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఫార్మాట్ ఐమాక్స్ వెర్షన్ లో కూడా విడుదలనేది అద్భుతమైన ఎక్స్పీరియన్స్, మరింత గ్రాండ్ గా ఉండబోతుందని చెప్పొచ్చు. మరి అక్టోబర్ 15వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా ఏ విధమైనటువంటి సక్సెస్ అందుకుంటుందనేది తెలియాల్సి ఉంది.

Advertisement

ఈ సినిమాలో రజనీకాంత్ ప్రధాన పాత్రలో నటించగా మోహన్ లాల్, శివరాజ్ కుమార్, విజయ్ సేతుపతి, ఎస్ జె సూర్య, మిథున్ చక్రవర్తి, యోగి బాబు,రమ్యకృష్ణ, విద్యాబాలన్ వంటి బారీ తారాగణం ఈ సినిమాలో కీలక పాత్రలలో కనిపించబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల చేసిన అప్డేట్స్ సినిమాపై భారీగా అంచనాలను పెంచేశాయి.ఇటీవల బిందాస్ అంటూ సాగిపోయే ఈ స్పెషల్ సాంగ్ ను విడుదల చేశారు. ఇందులో నోరా ఫతేహి స్పెషల్ స్టెప్పులతో సందడి చేశారు. ఇక ఈ సినిమాకు అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందించిన సంగతి తెలిసిందే.

Also Read: ఓటీటీలోకి ‘మహేంద్రగిరి వారాహి’ కొన్ని గంటల్లో స్ట్రీమింగ్!

Related News

బండ్ల గణేష్ ..ఈవెంట్లు ఫుల్ ..సినిమాలు మాత్రం నిల్ !

నటికి భారీ షాక్.. రూ. 89 కోట్లు పెనాల్టీ!

అల్లు రామలింగయ్య జయంతి.. గుడ్ న్యూస్ చెప్పిన అల్లు అర్జున్!

రవితేజ వివేక్ ఆత్రేయ సినిమాకు అదిరిపోయే టైటిల్ ఫిక్స్?

ది ప్యారడైజ్ డైరెక్టర్ శ్రీకాంత్ మోహన్ బాబును మోసం చేశాడా?

అక్టోబర్లో థియేటర్లలో విడుదల కాబోతున్న చిత్రాలివే!

మంచిగా ఉంటూనే తొక్కేయాలని చూస్తుంటారు.. మోహన్ బాబు సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×