తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో తమ టాలెంట్ నమ్ముకుని ఎంతోమంది ప్రూవ్ చేసుకొని మంచి గుర్తింపు సాధించుకున్న వాళ్ళు ఉన్నారు. రీసెంట్ టైమ్స్ లో షార్ట్ ఫిలిమ్స్ ద్వారా మంచి గుర్తింపు సాధించి సినిమాల్లో అవకాశాలు అందుకున్న నటులు కూడా చాలామంది ఉన్నారు. అయితే గుర్తింపు వస్తున్న టైమ్ లోనే చాలామంది కొన్ని తప్పటడుగులు వేస్తూ ఉంటారు. అవి ఫాస్ట్ గా వెళుతున్న వారి కెరియర్ కి బ్రేకులు వేస్తాయి. ఇదివరకే చాలా మంది యూట్యూబర్స్ లైంగిక వేధింపులు కేసులో జైలు పాలు అయ్యారు. ఇప్పుడు తాజాగా మరో యూట్యూబర్ కూడా అరెస్ట్ అయినట్లు విశ్వసనీయ వర్గాల నుంచి సమాచారం వినిపిస్తుంది.
వెబ్ సీరీస్ యాక్టర్ పిర్యాదు తో యూట్యూబర్ ప్రసాద్ బేహేరా ను జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్టు చేసినట్లు తెలుస్తుంది. అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు సమాచారం వినిపిస్తుంది. ప్రసాద్ బెహరా తో వెబ్ సిరీస్ లో నటించిన ఒక బాధితురాలు గత కొన్ని రోజులుగా తనను లైంగికంగా వేధిస్తున్నాడు అని కంప్లైంట్ చేసింది. దీంతో పోలీసులు యాక్షన్ తీసుకున్నట్లు తెలుస్తోంది. పెళ్లి వారం అండి అనే వెబ్ సిరీస్ టైంలో హరాస్మెంట్ జరిగినట్లు తెలుస్తోంది, అలానే మెకానిక్ అనే వెబ్ సిరీస్ టైంలో కూడా తనపై హరాస్మెంట్ చేశాడు అని వినిపిస్తోంది.
Also Read : Neha Shetty In OG Movie : పవన్ కళ్యాణ్ సినిమాలోనేహాశెట్టి స్పెషల్ సాంగ్.?