E-Paper
Advertisement

ఇక హెడ్‌సెట్ అక్కర్లేదు.. గేమింగ్ కోసం Sony Pulse Elevate 3D ఆడియో స్పీకర్లు వచ్చేశాయ్!

ఇక హెడ్‌సెట్ అక్కర్లేదు.. గేమింగ్ కోసం Sony Pulse Elevate 3D ఆడియో స్పీకర్లు వచ్చేశాయ్!
Advertisement

Sony Pulse Elevate: ప్లేస్టేషన్ ప్రేమికులకు సోనీ ఒక అదిరిపోయే వార్త తీసుకొచ్చింది. ఇప్పటివరకు హెడ్‌సెట్‌లకే పరిమితమైన తమ పాపులర్ Pulse సిరీస్‌లో, మొదటిసారిగా డెస్క్‌టాప్ వైర్‌లెస్ స్పీకర్లను మార్కెట్‌లోకి తీసుకువస్తోంది. వీటి పేరు Pulse Elevate. హెడ్‌సెట్ పెట్టుకుని గేమింగ్ ఆడటం కాస్త ఇబ్బందిగా అనిపించే వారిని దృష్టిలో ఉంచుకుని సోనీ ఈ స్పీకర్లను డిజైన్ చేసింది.

సౌండ్ క్వాలిటీ నెక్స్ట్ లెవెల్..

ఈ Pulse Elevate స్పీకర్లలో ప్లానార్ మాగ్నెటిక్ డ్రైవర్లతో పాటు బిల్ట్-ఇన్ వూఫర్లను అందించారు. దీంతో గేమ్ ఆడుతున్నప్పుడు ప్రతి చిన్న శబ్దం కూడా చాలా స్పష్టంగా, మంచి బేస్‌తో వినిపిస్తుంది. ప్లేస్టేషన్ 5కి కనెక్ట్ చేసినప్పుడు ఇది టెంపెస్ట్ 3D ఆడియో టెక్నాలజీని సపోర్ట్ చేస్తుంది. ఫలితంగా గేమ్‌లో మన చుట్టూ నిజంగానే ఆ వాతావరణం ఉందనే అనుభూతి కలుగుతుంది.

Advertisement

Also Read: రక్తంలోకి పోయే దుమ్మును కూడా పట్టుకుంటుంది.. షియోమీ నుంచి రెండు అద్భుతమైన ప్రొడక్ట్స్!

రెండు కనెక్షన్లు ఒకేసారి..

Pulse Elevateలో ప్లేస్టేషన్ లింక్, బ్లూటూత్ అనే రెండు ఆప్షన్లు ఉన్నాయి. గేమింగ్ ఆడుతున్నప్పుడు స్పీకర్లను ఒక్కసారిగా పీసీ లేదా PS5తో పాటు మొబైల్‌కి కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. అంటే గేమ్ ఆడుతూనే మొబైల్ నుంచి పాటలు వినడం లేదా ఫోన్ కాల్స్ మాట్లాడటం చాలా తేలిక. ఇందులో ఏఐ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్రోఫోన్లు ఉన్నందున హెడ్‌సెట్ లేకుండానే స్పష్టంగా మాట్లాడవచ్చు.

పోర్టబుల్ డిజైన్, అడ్జస్టబుల్ ఫీచర్లు..

Advertisement

ఈ స్పీకర్ల కోణాన్ని మనకు నచ్చినట్లు అడ్జస్ట్ చేసుకోవచ్చు. వీటిలో బిల్ట్-ఇన్ రీఛార్జబుల్ బ్యాటరీలు ఉంటాయి కాబట్టి.. డెస్క్ నుంచి పక్కకు తీసుకెళ్లి ఫోన్ లేదా ప్లేస్టేషన్ పోర్టల్‌కి కనెక్ట్ చేసుకుని కూడా వాడుకోవచ్చు. చార్జింగ్ డోక్స్ కూడా వీటితో పాటే వస్తాయి. వాల్యూమ్, మైక్ మ్యూట్ ఆప్షన్లు స్పీకర్ల పైనే ఇచ్చారు.

లాంచింగ్ ఎప్పుడంటే?

ఈ Pulse Elevate స్పీకర్లు నవంబర్ 12 నుంచి అందుబాటులోకి రానున్నాయి. సెప్టెంబర్ 1 నుంచి ప్రీ-ఆర్డర్లు ప్రారంభమవుతాయి. దీని ధర సుమారు రూ.18,500 నుండి రూ.19,000 వరకు ఉంటుంది.. ఇది మిడ్‌నైట్ బ్లాక్, వైట్ రంగుల్లో లభిస్తుంది. బ్లాక్ కలర్ గ్లోబల్‌గా అన్ని స్టోర్లలో దొరుకుతుంది. కానీ, వైట్ వెర్షన్ మాత్రం కేవలం కొన్ని ఎంపిక చేసిన దేశాల్లో సోనీ అధికారిక సైట్ ద్వారా లభిస్తుంది.

Also Read: జియో ప్రైమ్ రీలాంచ్.. రూ.300తో టారిఫ్ పెంపు నుంచి ఉపశమనం, రూ.600 క్యాష్‌బ్యాక్!

Tags

Related News

యూట్యూబ్‌లో ఏ వీడియో క్వాలిటీకి ఎంత డేటా ఖర్చవుతుందో తెలుసా?

ఐఫోన్ బ్యాటరీని బ్యాక్‌గ్రౌండ్‌లో తినేస్తున్నది ఇదే.. ఈ ఒక్క సెట్టింగ్ మార్చండి చాలు!

ఫోన్ అడిక్షన్ అనుకుంటున్నారా? ఉదయాన్నే ఫోన్ చూడటం వెనుక అసలు సైకాలజీ ఇదే!

పవర్ బ్యాంక్‌ వాడుతున్నారా? ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయాలు!

ఆపిల్ వాచ్..పాత లుక్కే అయినా పర్ఫార్మెన్స్‌లో అదుర్స్!

రూ.50 వేలలోపు బెస్ట్ స్మార్ట్ టీవీలు..అమెజాన్,ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో ఇవే బెస్ట్!

ప్రైమ్ డే సేల్ కంటే ముందే ఆఫర్లు.. ఈ 5 గాడ్జెట్స్‌పై అమెజాన్‌లో కళ్లు చెదిరే డిస్కౌంట్లు!

బ్లూటూత్ తరచూ డిస్‌కనెక్ట్ అవుతోందా?నిమిషాల్లో ఇలా సాల్వ్ చేసుకోండి!

Big Stories

Advertisement
×