Jagapathi Babu: సినీ నటుడు జగపతిబాబు (Jagapathi Babu)ప్రస్తుతం వ్యాఖ్యాతగా మారి జయమ్ము నిశ్చయమ్మురా(Jayammu Nischayammuraa) అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ టాక్ షోలో భాగంగా పలువురు సినీ సెలబ్రిటీలు హాజరవుతూ ఎన్నో విషయాలను అభిమానులతో పంచుకున్నారు. ఇప్పటికే ఈ కార్యక్రమం మూడు ఎపిసోడ్లను పూర్తి చేసుకుంది. ఈ మూడు ఎపిసోడ్లలో భాగంగా నాచురల్ స్టార్ నాని, నాగార్జున, శ్రీ లీల హాజరై సందడి చేశారు. తాజాగా నాలుగవ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో విడుదల చేశారు. ఈ ప్రోమోలో భాగంగా టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ(Ramgopal Varma)తో పాటు సందీప్ రెడ్డి (Sandeep Reddy)కూడా హాజరయ్యారు.
సెల్ఫ్ రెస్పెక్ట్ డైరెక్టర్స్..
ఈ ప్రోమోలో భాగంగా జగపతిబాబు మాట్లాడుతూ అందరికీ ఈయన ఆర్జీవీ అయితే నాకు మాత్రం సైతాన్ అంటూ మాట్లాడారు. ప్రేక్షకుల కోసం సినిమా ఎప్పుడు చేస్తున్నారు అంటూ జగపతిబాబు ప్రశ్నించారు. అయితే వర్మ మాట్లాడుతూ మనం ప్రజలకు ఏది చెప్పిన ఎవరి మాట ఎవరు వినరని చెప్పగా వెంటనే జగపతిబాబు 10 నిమిషాలు నీతో పాటు నేను కూర్చుంటే నేను కూడా నీలా అయిపోతానని నవ్వులు పూయించారు. నాకు తెలిసి ఇండస్ట్రీలో మరో సెల్ఫ్ రెస్పెక్ట్ డైరెక్టర్ కూడా ఉన్నారంటూ సందీప్ రెడ్డిని ఇన్వైట్ చేశారు. ఇక సందీప్ రెడ్డి రాగానే జగపతిబాబు వెంటనే తనకు ఒక వోడ్కా బాటిల్ అందజేశారు.
గర్ల్ ఫ్రెండ్స్ గురించి వర్మ కామెంట్స్..
జగపతిబాబు రాంగోపాల్ వర్మకు ఇవ్వకుండా సందీప్ రెడ్డికి వోడ్కా బాటిల్ ఇవ్వడంతో వెంటనే వర్మ అరే నాకెందుకు వోడ్కా ఇవ్వలేదు.. అంటే ఇప్పుడు సందీప్ రెడ్డి పెద్ద డైరెక్టర్ నేను అలా కాదనా నీ ఉద్దేశం? అంటూ మాట్లాడారు. సందీప్ ఏ విషయం గురించేనా చెంప మీద కొట్టినట్టు మాట్లాడతారని వర్మ తెలిపారు. ఇక జగపతిబాబు గర్ల్ ఫ్రెండ్స్ గురించి అడగడంతో వెంటనే వర్మ మాట్లాడుతూ మమ్మల్ని మేము ప్రేమించుకోవడానికి సమయం లేదు. ఇక మాకు గర్ల్ ఫ్రెండ్స్ ఎక్కడుంటారు అంటూ సమాధానం ఇచ్చారు.
ఇక సందీప్ రెడ్డి మాట్లాడుతూ వర్మ గారు మనం కనుక క్లాస్మేట్స్ అయి ఉంటే ఎలా ఉండేది అంటూ ప్రశ్నించడంతో మనం క్లాస్మేట్స్ అయితే ఇద్దరిలో ఎవరో ఒకరు అమ్మాయి అయి ఉంటే బాగుండేది అంటూ తనదైన శైలిలోనే సమాధానం ఇచ్చారు. ఒక డెవిల్, యానిమల్ కూర్చుని ముద్దు ముద్దుగా నవ్వుతూ ఉంటే చూడముచ్చటగా ఉంది అంటూ వీరిద్దరి గురించి జగపతిబాబు మాట్లాడారు. ప్రస్తుతం ఈ ప్రోమో వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా వర్మ సందీప్ రెడ్డి ఎలాంటి విషయాలు గురించి మాట్లాడారనేది తెలియాలి అంటే పూర్తి ఎపిసోడ్ ప్రసారమయ్యే వరకు ఎదురు చూడాల్సిందే. ఇక ప్రస్తుతం సందీప్ రెడ్డి ప్రభాస్ తో స్పిరిట్ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే . ప్రస్తుతం సందీప్ ఈ సినిమా పనులలో ఎంతో బిజీగా ఉన్నారు. మరి ఈ కార్యక్రమంలో భాగంగా స్పిరిట్ సినిమాకు సంబంధించి ఏదైనా అప్డేట్ ఇస్తారేమో తెలియాల్సి ఉంది.
Also Read: Kissik Talks Show : గీతా సింగ్ పెళ్లి చేసుకోకపోవడానికి అదే కారణమా.. ఇప్పటికీ ఒంటరిగానే