E-Paper
Advertisement

జిమ్ జిమ్ తార ఫీవర్.. చిన్న పాటతో ఇంత పెద్ద సంచలనమా?

జిమ్ జిమ్ తార ఫీవర్.. చిన్న పాటతో ఇంత పెద్ద సంచలనమా?
Advertisement

Jim Jim Tara Song:ఇదసలే సోషల్ మీడియా జమానా.ఇక్కడ ఏది ఎప్పుడు ఎలా వైరల్ అవుతుందో ,ఏది ఎలా సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చెప్పలేము.ముఖ్యంగా ఫేస్ బుక్ ,ఇంస్టా విరివిరిగా వాడుకలోని వచ్చాక పల్లెటూరిలో ఉన్న సరికొత్త టాలెంట్ వెలుగులోకి వచ్చి ఎందరినో ఉన్నపళంగా సూపర్ స్టార్స్ ని చేస్తుంది.

ఇక రీల్స్ పుణ్యాన ,మారు మూల గ్రామాలలో ఉన్న వారు పాడిన సరికొత్త పాటలు విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి.ఇదిగో ఇలాగే పెద్దగా ఎవరికీ తెలీని ఒక సింగర్ పాడిన పాట ఇపుడు సోషల్ మీడియాని దున్నేస్తుంది.అదే జిమ్ జిమ్ తార..జిలేబి తేరా చిన్నోడా అనే పాట.ఇపుడు ఇంస్టా ,ఫేస్ బుక్ ,ఎక్స్ ఇలా ఏది ఓపెన్ చేసినా ఈ పాటే సందడి చేస్తుంది.ముఖ్యంగా సినిమా ప్రమోషన్స్ నుండి స్టూడెంట్స్ ధర్నాల వరకు ఈ పాటనే విరివిరిగా వాడుకోవడం విశేషం.

Advertisement

ఆవిడ పేరు గోకుల లక్ష్మీదేవి

ఈ పాట పాడిన సింగర్ విషయానికి వస్తే ఆవిడ పేరు గోకుల లక్ష్మీదేవి.అయితే సోషల్ మీడియాలో ఆమెని లక్ష్మీ ఆంటీగా పిలుస్తు తమ అభిమనాన్ని ప్రదర్శిస్తున్నారు నెటిజన్లు.ఇక ఈవిడ రాయలసీమ లోని కర్నూల్ ప్రాంతానికి చెందినదని తెలుస్తుంది.అయితే ఇపుడు బాగా పాపులర్ అయిన జిమ్ జిమ్ తార..జిలేబి తేరా చిన్నోడా పాట మాత్రమే కాదండోయ్ ….గతంలో అత్తరు సాయిబో రారా అంటూ మరో పాటని కూడా పాడి వార్తల్లో నిలిచింది.బహుశా అప్పట్లో ఇప్పుడున్నంత సోషల్ మీడియా లేని కారణంగా ఇంతగా వైరల్ అవ్వలేదు కాబోలు.

Advertisement

ఇక కేవలం ఫోక్ టచ్ ఉన్న పాటలు మాత్రమే కాకుండా భక్తిగీతాలని కూడా ఈవిడ పాడుతుందని తెలుస్తుంది.ఇక ప్రస్తుతం వైరల్ అవుతున్న ఈ పాట సింపుల్ గా ఈజీగా క్యాచీగా పాడుకునేందుకు అనువుగా ఉండటం వల్లే నెటిజన్లు ఈ పాటని ఎక్కువగా ఇష్టపడేందుకు కారణం అని తెలుస్తుంది.దీనికి తోడు లక్షీ అంటి పాడే తీరు, ఆమె గొంతులో ఉన్న స్పెషాలిటీ వల్ల ఈ పాట కి ఒక యునిక్ నెస్ వచ్చిందని చెప్పాలి.

మొదటగా ‘పర్ణశాల’అనే సినిమాలో

అయితే ఈ పాటని మొదటగా ‘పర్ణశాల’అనే సినిమాలో వాడినట్టు తెలుస్తుంది.వై.జి. భరత్ దర్శకత్వంలో, మంచి వెంకట్ నిర్మిస్తున్న ఈ సినిమా లో వాడిన పాట అనుకోకుండా బయటికి రావాడం,అది కాస్తా ఇంట్రెస్టింగ్ గా ఉండటంతో క్రమంగా కొద్ది రోజుల్లోనే సోషల్ మీడియాని కమ్మేసింది.అయితే ఇదే పాటని లక్ష్మీ ఆంటీ తన ఇంస్టా అకౌంట్ లో పాడటం కూడా మనం చూడొచ్చు.ఇక ఈ పాట ఎంతలా పాపులర్ అయింది అంటే మూవీ ప్రమోషన్స్ నుండి స్టూడెంట్స్ ధర్నాల వరకు కూడా ఈ పాటని ఉపయోగించుకునేంత వరకు.

మరోసారి సోషల్ మీడియాలో వైరల్

అవును ..తాజాగా క్రేజీ కల్యాణం సినిమా ప్రమోషన్స్ లో భాగంగా అనుపమ పరమేశ్వరన్ ,టీమ్ సభ్యులైన తరుణ్ భాస్కర్ ,అఖిల్ లతో కలిసి ఈ పాట రీమిక్స్ కి డాన్స్ చేయడం అది కాస్తా నెట్టింట్లో వైరల్ అవ్వడం మనకి తెల్సిందే.ఇక ఇదే పాటని జగిత్యాల మెడికల్ కాలేజీకి శాశ్వత భవనం నిర్మించాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు చేపట్టిన నిరసనలో కూడా ఈ పాటను ఉపయోగించుకోవడంతో ఈ పాట మరోసారి సోషల్ మీడియాలో వైరల్ అయిపొయింది.

ఇక ఈ పాట కారణంగా పాడిన లక్ష్మి ఆంటీకి ఇపుడు వరుస సినిమలాతో పాటు ఈవెంట్ లలో కూడా మంచి అవకాశాలు వస్తున్నట్టు తెలుస్తుంది.ఏది ఏమైనా మారు ఊల పల్లెల్లో ఉన్న కొత్త కొత్త టాలెంట్ ఇలా సోషల్ మీడియా వేదికగా వెలుగులోకి రావడం నిజంగా శుభపరిణామం అనే చెప్పాలి.చూడాలి ముందు ముందు ఈ లక్ష్మి ఆంటీ ఇంకెన్ని పాటలతో ఆడియన్స్ ని అలరిస్తుందో !

Tags

Related News

ఆ హీరోయిన్ కు ఫిదా అయ్యానంటున్న జగపతి బాబు..తన క్రష్ బయట పెట్టాడుగా?

ప్రియుడు బిగ్ బాస్ కి.. సన్యాసం పుచ్చుకున్న ప్రియాంక!

హీటెక్కిన నామినేషన్.. మళ్లీ నోరు జారిన రోహిత్..ఈ వారం?

కెప్టెన్ సుధీర్ కి ఘోర అవమానం.. నోరుజారిన త్రిగుణ్, రోహిత్!

నిజమే గెలుస్తుంది.. మరో సంచలన పోస్ట్ తో యూట్యూబర్ నందన!

Telugu Tv Serials : బిగ్ షాక్.. ఆ ఛానెల్లో ఒకేసారి 4 సీరియల్స్ అవుట్..

Telugu TV Serials: ఈ వారం సీరియల్స్ టీఆర్పీ రేటింగ్.. ఇంటింటి రామాయణం అవుట్..

Big Stories

Advertisement
×