E-Paper
Advertisement

గ్రహణం రోజే పాడుబడిన స్కూల్లోకి యూట్యూబర్స్‌… కెమెరాలు తిరిగొచ్చాయి కానీ మనుషులు మాయం… 8.4 రేటింగ్‌ ఉన్న కన్నడ హారర్ థ్రిల్లర్

గ్రహణం రోజే పాడుబడిన స్కూల్లోకి యూట్యూబర్స్‌… కెమెరాలు తిరిగొచ్చాయి కానీ మనుషులు మాయం… 8.4 రేటింగ్‌ ఉన్న కన్నడ హారర్ థ్రిల్లర్
Advertisement

Found-Footage Horror Movie OTT : ఒక వీడియో వైరల్ అయితే లక్షల మంది చూస్తారు. కానీ ఆ వీడియో తీసిన వాళ్లే కనిపించకుండా పోతే, వాళ్ల కెమెరాల్లో రికార్డయిన దృశ్యాలు మరింత భయపెడతాయి. ఓ పాడుబడిన స్కూల్లోకి వెళ్లిన యూట్యూబర్ల బృందం అదృశ్యమవుతుంది. నెలల తర్వాత అక్కడ దొరికిన కెమెరాలు మాత్రం ఆ రాత్రి ఏం జరిగిందో చెప్పడానికి సిద్ధంగా ఉంటాయి. కానీ వాటిలో కనిపించే దృశ్యాలు చూస్తే ఆ స్కూల్‌ లో అడుగు పెట్టిన వాళ్లు ఎందుకు తిరిగి రాలేదో అర్థం చేసుకోవడం అంత సులభం కాదు. నిజంగా జరిగినట్టుగా అనిపించే చిత్రీకరణతో భయపెట్టే కన్నడ ఫౌండ్-ఫుటేజ్ హారర్ మూవీ ‘వీడియో’ (Video). మరి ఈ సినిమా ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుందంటే ?

కథలోకి వెళ్తే…

బెంగళూరుకు చెందిన వ్లాగర్ల బృందం తమ ఛానెల్‌ లో ఒక మిలియన్ ఫాలోవర్ల మైలురాయిని చేరుకున్న సందర్భంగా ప్రత్యేకమైన వీడియో చేయాలని నిర్ణయించుకుంటుంది. సాధారణ ప్రదేశాల్లో చిత్రీకరణ చేస్తే ప్రేక్షకులకు కొత్తగా అనిపించదని భావించి, దేశంలోనే అత్యంత భయంకరమైన ప్రదేశాల్లో ఒకటిగా పేరున్న పాడుబడిన స్కూల్‌ ను ఎంచుకుంటారు.

Advertisement

ఆ స్కూల్‌ కి వెళ్లకూడదని స్థానికులు హెచ్చరిస్తారు. అక్కడ ఓ ఉపాధ్యాయుడు విద్యార్థులను చంపిన ఘటన జరిగిందని, ముఖ్యంగా చంద్రగ్రహణం సమయంలో ఆ ప్రాంతానికి వెళ్లడం ప్రమాదకరమని చెబుతారు. అయితే సోషల్ మీడియాలో ప్రత్యేక గుర్తింపు సంపాదించాలనే ఆలోచనతో ఉన్న యువతకు ఈ హెచ్చరికలే మరింత ఆసక్తిని కలిగిస్తాయి. గ్రహణం రోజునే అక్కడికి వెళ్లి తమ వీడియోను చిత్రీకరించాలని నిర్ణయించుకుంటారు.

కెమెరాలు ఆన్ అవుతాయి. స్కూల్‌ లోని ఖాళీ గదులు, చీకటి కారిడార్లు, పాడైపోయిన తరగతి గదుల్లో బృందం తిరుగుతుంది. మొదట వీడియో కోసం వచ్చిన వాళ్లు, ఆ తర్వాత అక్కడ ఏదో అసాధారణమైన విషయం జరుగుతోందని గ్రహిస్తారు. భయపెట్టే శబ్దాలు, అనుమానాస్పద కదలికలు వారి ప్రయాణాన్ని ప్రమాదకరంగా మారుస్తాయి. ఆ తర్వాత బృందంలోని వ్యక్తులు కనిపించకుండా పోతారు. దాదాపు మూడు నెలల తర్వాత మరో జంటకు అక్కడ వదిలేసిన కెమెరాలు కనిపిస్తాయి.

Advertisement

వాటిలో రికార్డయిన ఫుటేజీని పరిశీలిస్తే ఆ రాత్రి జరిగిన సంఘటనల గురించి భయంకరమైన విషయాలు బయటపడతాయి. ఆ స్కూల్లో నిజంగా ఏం జరిగింది ? అక్కడి నుంచి వ్లాగర్లు ఎందుకు తిరిగి రాలేదు ? కెమెరాల్లో కనిపించిన ప్రతి దృశ్యం నిజమేనా ? అనే ప్రశ్నల చుట్టూ సాగే ‘వీడియో’ మూవీ కథను సాధారణ హారర్ సినిమాలకంటే భిన్నంగా చూపిస్తుంది.

Also Read : బంగారం కోసం సముద్రంలో ప్రాణాంతక వేట… నిధి కోసం నిలువునా ముంచేసే కన్నింగ్ గాళ్ళు… ఊపిరి బిగబట్టి చూడాల్సిన అడ్వెంచర్ థ్రిల్లర్

ఓటీటీలో ఎక్కడ చూడొచ్చు ?

2026లో విడుదలైన ఈ కన్నడ హారర్ థ్రిల్లర్‌కు శ్రీనిధి బెంగళూరు దర్శకత్వం వహించారు. ప్రియా జె. ఆచార్, జీవన్ శివకుమార్, తేజేశ్ ఎస్.ఎం. తదితరులు నటించారు. అక్టోబర్ 9 నుంచి Amazon Prime Videoలో కన్నడతో పాటు తెలుగు, తమిళం, మలయాళం, హిందీ ఆడియోల్లో స్ట్రీమింగ్ అవుతోంది.

Related News

ఏడేళ్లుగా కనిపించని ప్రేయసి… ఆమె ఆచూకీ చెప్పే మాంత్రిక జీవులతో ప్రయోగం… ఓటీటీలోకి వచ్చిన వింత సిరీస్

బంగారం కోసం సముద్రంలో ప్రాణాంతక వేట… నిధి కోసం నిలువునా ముంచేసే కన్నింగ్ గాళ్ళు… ఊపిరి బిగబట్టి చూడాల్సిన అడ్వెంచర్ థ్రిల్లర్

చిన్ననాటి స్నేహితుల ముసుగులో ద్రోహం… ప్రపంచాన్ని కాపాడేందుకు ప్రాణాలకు తెగించే ఏజెంట్… జాన్ సీనా యాక్షన్ అడ్వెంచర్

దెయ్యాలనే బంధువులుగా భావించే వింత మనిషి… నవ్విస్తూ, ప్రేమలో ముంచెత్తే మలయాళం ఫాంటసీ మూవీ ఓటీటీలోకి

పోలీసులకు హింట్ ఇచ్చి మరీ చంపే కిల్లర్… ట్విస్టుల మీద ట్విస్టులు… సీజన్ 2 రచ్చ షురూ

గ్రామ దేవత ప్రతిరూపంగా భావించే దున్నపోతు… బలిచ్చే రోజే మిస్సింగ్… రవితేజ సోదరుడి కొడుకు మూవీ స్ట్రీమింగ్

దొంగతనాలు చేసే అమ్మాయికి సీక్రెట్ స్పై మిషన్… టార్గెట్ కొడుకుతోనే ప్రేమలో… క్రేజీ కొరియన్ థ్రిల్లర్

Big Stories

Advertisement
×