E-Paper
Advertisement

గుప్పెడంత మనసు జగతి మేడం కొత్త రూట్.. ఫీజు మాత్రం చాలా తక్కువ!

గుప్పెడంత మనసు జగతి మేడం కొత్త రూట్.. ఫీజు మాత్రం చాలా తక్కువ!
Advertisement

Guppedantha Manasu jagati:జ్యోతిరాయ్‌ అంటే ఆడియన్స్ పెద్దగా గుర్తు పట్టరేమో కాని ‘గుప్పెడంత మనసు’ సీరియల్‌లోని జగతి మేడం అంటే ఎవరైనా యిట్టె గుర్తుపట్టేస్తారు. ఆ పాత్రకి ఉన్న డిమాండ్ అలాంటిది మరి.అయితే ఆ సీరియల్ ఆ పాత్ర చనిపోవడంతో అప్పటి నుండి జగతి మేడం కి ఆడియన్స్ కి కనెక్షన్ కాస్త కట్ అయినట్టుగానే అనిపించింది.

దీంతో ఇపుడు సోషల్ మీడియా ద్వారా ప్రేక్షకులకి మరింత దగ్గర అయ్యే ప్రయత్నం చేస్తుంది.అందులో భాగంగా తన లేటెస్ట్ అప్ డేట్స్ ని సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు వదులుతుంది కూడా .అయితే తాజాగా జ్యోతిరాయ్ విషయంలో వినిపిస్తున్న ఒక వార్త ఇపుడు నెట్టింటిని షేక్ చేస్తుంది.అదే సబ్స్క్రిప్షన్ .

Advertisement

ఇంస్టా గ్రామ్ లో సబ్ స్క్రిప్షన్

అవును ..ఇప్పటికే పలు ముద్దుగుమ్మలు మా బోల్డ్ అండ్ ఎక్స్క్లూజివ్ కంటెంట్ మీకు కావాలంటే మా ఇంస్టా గ్రామ్ లో సబ్ స్క్రిప్షన్ తీసుకోవాలి అంటూ అభిమానుల నుండి సబ్ స్క్రిప్షన్ చార్జీలు వసూలు చేస్తున్న సంగతి తెల్సిందే.ఇక ఇంస్టా గ్రామ్ లో సబ్ స్క్రిప్షన్ వ్యవహారంలో బుల్లితెర భామ విష్ణు ప్రియ ఆ మధ్య వార్తల్లో హైలెట్ అయింది కూడా. అయితే విష్ణు ప్రియ లాంటి చాలా మంది భామలు సబ్ స్క్రిప్షన్ 399,499 అంటూ భారీగా చార్జ్ చేస్తున్నారు కూడా.

Advertisement

కేవలం 49 రూపాయల ధర మాత్రమే

కానీ సబ్ స్క్రిప్షన్ ప్లాన్ చేస్తున్న జ్యోతిరాయ్ అభిమానులందరికీ అందుబాటులో ఉండేవిధంగా కేవలం 49 రూపాయల ధర మాత్రమే పెట్టడం ఇక్కడ విశేషం.మరి చాలా మందిలాగే జ్యోతిరాయ్ కూడా మరీ హద్దులు దాటేసిన బోల్డ్ కంటెంట్ అందిస్తుందా..లేక ఇంకేదైనా ఎక్స్ క్లూజివ్ గా ప్లాన్ చేస్తుందా అన్నది సబ్ స్క్రిప్షన్ స్టార్ట్ అయితే కాని తెలీదు.

ఎలాంటి సంచలనం నమోదు చేస్తుందో

ఇక జ్యోతిరాయ్ విషయానికి వస్తే గతంలోనే పెళ్లి చేసుకుని విడాకుల బాట పట్టిన ఈ భామ దర్శకుడు సుక్కు పూర్వజ్‌ను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ఆయన దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘కిల్లర్’ సినిమాలోనూ జ్యోతిరాయ్ కీలక పాత్రలో కనిపించేందుకు రెడీ అయింది.సైన్స్ ఫిక్షన్ జానర్ లో తెరకెక్కుతున్న ఈ ఈ సినిమాతో జ్యోతిరాయ్ ఎలాంటి సంచలనం నమోదు చేస్తుందో చూడాలి.

ఇంకెన్ని మలుపులు తీసుకోనుందో !

ఏది ఏమైనా ఒకవైపు ఈ సబ్ స్క్రిప్షన్ పాలిట ఎంతో మందిమి బలైపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తుంటే ఇపుడు ఇదే బాటలో మరికొందరు యాంకర్లు, నటీమణులు, ఇన్‌ఫ్లూయెన్సర్లు కూడా నడుస్తుండటం గమనార్హం. చూడాలి మరి ముందు ముందు ఈ సబ్ స్క్రిప్షన్ వ్యవహారం ఇంకెన్ని మలుపులు తీసుకోనుందో !

also read :పాట అంటే ఇదిరా సామి.. ‘సువ్వి సువ్వి’ రీక్రియేషన్ చూసి తీరాల్సిందే!

Tags

Related News

పాట అంటే ఇదిరా సామి.. ‘సువ్వి సువ్వి’ రీక్రియేషన్ చూసి తీరాల్సిందే!

కడుపునిండా తిండి పెట్టి.. ఊహించని ట్విస్ట్ ఇచ్చిన బిగ్ బాస్!

జబర్దస్త్ లో ఉన్న ఎవరికి కామెడీ రాదు..కమెడియన్ కామెంట్స్ వైరల్!

బిగ్ బాస్ ఆదిరెడ్డికి కౌంటర్ ఇచ్చిన కృష్ణుడు..వ్యూస్ కోసమే అంటూ!

బిగ్ బాస్ రివ్యూయర్ గా మారిన ప్రభాకర్… సృష్టి పై ప్రశంశలు!

ఝాన్సీని ఇరకాటంలో పెట్టేసిన బిగ్ బాస్.. బలయ్యేది ఎవరు?

శ్రీముఖికి కౌంటర్ ఇచ్చిన బిగ్ బాస్ బోలే.. దెబ్బకు రియాక్షన్?

Big Stories

Advertisement
×