E-Paper
Advertisement

తక్కువ రేట్ అని బట్టలు కొంటున్నారా? ఈ మోసం గురించి తెలిస్తే అస్సలు షాపింగ్ చేయరు!

తక్కువ రేట్ అని బట్టలు కొంటున్నారా? ఈ మోసం గురించి తెలిస్తే అస్సలు షాపింగ్ చేయరు!
Advertisement

Smart shopping hacks: మారిన కాలానికి తగ్గట్టుగా ట్రెండీ బట్టలు వేసుకోవడానికి అందరూ ఇష్టపడతారు. ముఖ్యంగా ఫెస్టివల్ సేల్స్, ఎండ్‌ ఆఫ్ సీజన్ సేల్స్ సమయంలో ఈ-కామర్స్ వెబ్‌సైట్లు, రిటైల్ షాపులు భారీ ఆఫర్లను ప్రకటిస్తుంటాయి. ‘బై 1 గెట్ 2 ఫ్రీ’ లేదా ‘ఫ్లాట్ 70% ఆఫ్’ వంటి ప్రకటనలు చూడగానే.. మన మనసు వెంటనే ఆకర్షితమవుతుంది. తక్కువ ధరకు ఎక్కువ బట్టలు వస్తున్నాయని సంతోపపడి గుడ్డిగా కొనుగోలు చేస్తుంటాం. కానీ.. ఈ ఆనందం ఎంతోకాలం నిలవదు. ఆ భారీ తగ్గింపుల వెనక పెద్ద మోసమే దాగి ఉంటుంది.

తక్కువ ధర :

చాలా కంపెనీలు క్వాలిటీ లేని..మార్కెట్‌లో అమ్ముడుపోని పాత స్టాక్‌ను లేదా డిఫెక్టివ్ ప్రొడక్ట్స్‌ను ఇలా భారీ తగ్గింపుల పేరిట అమ్ముతుంటారు. మనం బ్రాండ్ లేదా ధర చూసి మోసపోతాం కానీ, ఆ క్లాత్ క్వాలిటీ చెక్ చేయము. ఒక సారి ఉతికిన తర్వాత ఆ బట్టలు కుంచించుకుపోవడం, కుట్లు ఊడిపోవడం లేదా రంగు తెల్లారిపోవడం జరుగుతుంది. అంటే. మనం పెట్టిన తక్కువ మొత్తానికి కూడా అది న్యాయం చేయదు.

బట్టలు కొనేముందు తప్పక గమనించాల్సిన విషయాలు:

ఫ్యాబ్రిక్ లేదా మెటీరియల్ చెక్ చేయడం:

Advertisement

షాపింగ్ చేసేటప్పుడు కేవలం డిజైన్ చూసి మురిసిపోకుండా, దాని లేబుల్‌పై.. ఉన్న ఫ్యాబ్రిక్ వివరాలు చూడండి. పాలిస్టర్ లేదా సింథటిక్ బట్టలు చర్మానికి అలర్జీలను కలిగించే అవకాశం ఉంటుంది. వీలైనంత వరకు కాటన్ లేదా సహజ సిద్ధమైన దారాలతో తయారైన వాటిని కొనడం ఆరోగ్యానికి మంచిది.

ఉతకడం, మెయింటెనెన్స్:

కొన్ని ఖరీదైన లేదా ట్రెండీ బట్టలను కేవలం ‘డ్రై క్లీన్’ మాత్రమే చేయాల్సి ఉంటుంది. వాటిని మామూలుగా వాషింగ్ మిషన్‌లో వేస్తే.. మొదటిసారికే పాడైపోతాయి. కాబట్టి ఆ బట్టలను మెయింటెనెన్స్ చేయడం మనకు సాధ్యమవుతుందో లేదో ముందే ఆలోచించాలి. దీనిని బట్టి కొనడం అలవాటు చేసుకోవడం మంచిది.

సైజ్, ఫిట్టింగ్:

Advertisement

ఆన్‌ లైన్‌లో సేల్స్ సమయంలో ‘నో రిటర్న్’ లేదా ‘నాన్-ఎక్స్ఛేంజ్’ పాలసీతో బట్టలు అమ్ముతుంటారు. సైజ్ సరిగ్గా చూసుకోకుండా.. ఆఫర్ ఉంది కదా అని ఆర్డర్ చేస్తే, ఆ తర్వాత అవి వేసుకోలేక, మార్చుకోక ఇబ్బంది పడాల్సి వస్తుంది. అందుకే ముందు జాగ్రత్త అవసరం.

Also Read: ఇయర్‌బడ్స్ Vs వైర్డ్ ఇయర్‌ఫోన్స్..ఏది బెస్ట్? ఏది చెవులకు డేంజర్?

అవసరమా లేదా అనే ప్రశ్న:

మన వార్డ్‌రోబ్‌లో ఇప్పటికే అలాంటి బట్టలు చాలా ఉన్నప్పటికీ.. కేవలం తక్కువ ధరకు వస్తుంది కదా అనే ఆశతో కొనడం మానుకోవాలి. అనవసరమైన కొనుగోళ్లు మన బడ్జెట్‌ను దెబ్బతీస్తాయి. బడ్జెట్ ప్రకారం షాపింగ్ చేయడం అలవాటు చేసుకోవాలి.

డబ్బు అనేది కష్టపడి సంపాదించింది. భారీ తగ్గింపులు, ఆఫర్లు మనల్ని ఆకర్షించిన ప్పటికీ, గుడ్డిగా వాటి వెనక పరిగెత్త కుండా క్వాలిటీ, అవసరానికి ప్రాధాన్యత ఇవ్వాలి. ‘చీప్ అండ్ బెస్ట్’ అనే మాట కొన్నిసార్లు సేవ్ చేసుకున్న డబ్బు ఖర్చే చేసేలా చేస్తుంది కాబట్టి.. షాపింగ్ చేసేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించి కొనడం బెస్ట్!

Related News

తల్లి, భార్య, కూతురు కోసం.. అదిరిపోయే పోస్టాఫీసు స్కీమ్‌లు.. జీరో రిస్క్, గ్యారెంటీ లాభం!

రూ.5వేల పెట్టుబడితో రూ.5 లక్షలు చేతికి ! సిప్ మ్యాజిక్ ఇదే

కారణం లేకుండా కంపెనీ మిమ్మల్ని తీసేయొచ్చా? లేబర్ లా ప్రకారం ఉద్యోగులకు ఉండే పవర్ ఫుల్ రైట్స్!

కేంద్రంపై వర్తకుల తిరుగుబాటు.. అక్టోబర్ 2న క్యూఆర్ కోడ్స్ పని చేయవు! No UPI Day

స్టాక్ మార్కెట్ భారీ పతనం.. చివరిలో విదేశీ మదుపరులు అమ్మకాలు, అసలు కారణాలు ఇవే

ఆన్‌లైన్ షాపింగ్‌‌కు కొత్త రూల్స్, జనవరి ఒకటి నుంచి అమల్లోకి, ఎట్టి పరిస్థితుల్లోనూ

పండగ సీజన్‌ వేళ కేంద్రం శుభవార్త.. వంట నూనె ధరలకు ఊరట!

Big Stories

Advertisement
×