E-Paper
Advertisement

Mukku Avinash : హాస్పిటల్ లో పిచ్చోడిలా తిరిగాను.. కన్నీళ్లు పెట్టించే స్టోరీని బయటపెట్టిన అవినాష్…

Mukku Avinash : హాస్పిటల్ లో పిచ్చోడిలా తిరిగాను.. కన్నీళ్లు పెట్టించే స్టోరీని బయటపెట్టిన అవినాష్…
Advertisement

Mukku Avinash : బుల్లితెర ప్రేక్షకులకు ముక్కు అవినాష్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ప్రస్తుతం బుల్లితెరపై ప్రసారమవుతున్న పలు కామెడీ షోలలో తనదైన స్టైల్ లో కామెడీని పండిస్తూ ప్రేక్షకులను కడుపుబ్బనవిస్తుంటాడు.. వెండితెరపైనా అవినాష్ అడపాదడపా కనిపిస్తూ నవ్విస్తుంటాడు.. కానీ ఇప్పటివరకు తన మార్కు కామెడీకి సంబంధించిన పాత్ర మాత్రం దక్కలేదు. ఇక బిగ్ బాస్ లో ఇప్పటికే రెండుసార్లు ఎంట్రీ ఇచ్చి తన నటనతో అలాగే ఆటతో అందరిని ఆకట్టుకున్నాడు. ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తూ కనిపించే అవినాష్ జీవితంలో కూడా ఎన్నో కష్టాలను అనుభవించాడు అన్న విషయం అతి కొద్ది మందికి మాత్రమే తెలుసు. తాజాగా సినీ నటి తేజెస్వి మాదివాడ హోస్ట్గా వ్యవహరిస్తున్న కాకమ్మ కథలు ప్రోగ్రాం కి గెస్ట్ గా వెళ్ళాడు. సినీ నటి సునైనా తో కలిసి అతని ఎపిసోడ్లో సందడి చేశాడు. ఈ క్రమంలో తేజు అడిగిన ప్రశ్నకు సునైనా, అవినాష్ చెప్పిన సంఘటనలు అందరినీ కదిలించాయి. మరి అవినాష్ తన ఎమోషనల్ స్టోరీ గురించి ఏమని చెప్పాడో ఒక్కసారి మనం వివరాల్లోకి వెళ్లి తెలుసుకుందాం…

తన బిడ్డగురించి చెప్పి బాధపడ్డ అవినాష్..

ప్రముఖ తెలుగు నటి తేజశ్రీ మదివాడ హోస్ట్గా వ్యవహరిస్తున్న కాకమ్మ కథలు షో కి రోజురోజుకీ మంచి రెస్పాన్స్ వస్తుంది.. ఇప్పటికే ఎంతోమంది సెలబ్రిటీలు గెస్ట్లుగా విచ్చేసి తమ గురించి ఎన్నో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. తాజాగా ఈ షో కి వచ్చిన ముక్కు అవినాష్ అలాగే సునైనా ఇద్దరు కూడా తమ జీవితంలో ఎదురైన కొన్ని సంఘటనలను గుర్తుచేసుకొని బాధపడ్డారు. ముందుగా ముక్కు అవినాష్ తన గురించి చెప్పి ఎమోషనల్ అయ్యాడు. సునైనా అవినాష్ బిడ్డ గురించి చెప్పగానే కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఫస్ట్ ప్రెగ్నెన్సీని పోవడంతో అవినాష్ కొన్ని రోజులు బయటకు కూడా రాలేదన్న సంగతి తెలిసిందే.. ఆ బిడ్డని బ్రతికించమని ఆరోజు డాక్టరు అలాగే అక్కడ పనిచేస్తున్నాను. పిచ్చోడిలా హాస్పిటల్లో అటూ ఇటూ తిరుగుతూ.. నర్సు కాళ్లు పట్టుకున్న విషయాన్ని కూడా అవినాష్ చెప్పి ఎమోషనల్ అయ్యాడు. తన మాటలతో అందరినీ కంటతడి పెట్టేలా చేశాడు.

సునైనా కామెడీ పీక్స్..

Advertisement

ఎప్పుడు నవ్వించే అవినాష్ అందరినీ ఏడ్పించేసాడు.. అదే ప్రోమోలో సునైనా మాత్రం తన కామెడీతో కడుపుబ్బ నవ్వించేసింది.. అవినాష్ మీద సునైనా, తేజు కౌంటర్ల మీద కౌంటర్లు వేశారు. అవినాష్ మైక్ కట్ చేయండి అని తేజు అంటే.. దానికి కౌంటర్లు వేస్తూ అవినాష్ ముందు ఈమెను కట్ చేయండి అని సెటైర్లు వేస్తాడు. నాకు ఒక బ్యాడ్ హ్యాబిట్ ఉంది అని అవినాష్ అంటాడు. ఆ మాటకు తేజు దిమ్మ తిరిగిపోయేలా కౌంటర్ వేస్తుంది.. నీకున్న బ్యాడ్ హ్యాబిట్ అమ్మాయిలా అని అనడంతో అవినాష్ ఒక్కసారి షాక్ అవుతాడు.. ఇక సునైనా తేజు ఇద్దరు కలిసి అవినాష్ని ఒక ఆట ఆడుకుంటారు.. ప్రోమో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండడంతో ఎపిసోడ్ అంతకుమించి ఉంటుంది అని అర్థమవుతుంది.. మరి ఈ ఎపిసోడ్ని మిస్ అవ్వకుండా చూడాల్సిందే…

Also Read : పల్లవి, శ్రీయ సూపర్ డ్యాన్స్.. వాట్ ఏ టాలెంట్ గురు..

Advertisement

Related News

బిగ్ బాస్ చరిత్రలో సరికొత్త రికార్డు సృష్టించిన సీజన్ 10!

స్టేజ్ పై అషూ రెడ్డితో గొడవ పెట్టుకున్న మరో బిగ్ బాస్ కంటెస్టెంట్?

పరారీలో ప్రముఖ యూట్యూబర్.. నగదుతో పాటు బంగారం చోరీ!

Gundeninda GudiGantalu Today episode: బాలుకు అనుమానం.. పిల్లాడిలా మారిన మనోజ్.. బాలు రచ్చ రచ్చ..

Podarillu Today Episode : కేశవ కోరిక తీరుతుందా? మహా, విక్కీ మధ్య దివ్య..మహాకు గుడ్ న్యూస్..

Nindu Noorella Saavasam Serial Today Episode October 8th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరి, పార్థును చంపేసిన నిజం సీతారాం అందరికీ చెప్తాడా..?  

Illu Illalu Pillalu Today Episodes: రామరాజుకు మైండ్ బ్లాక్.. వేదవతి మాటతో షాక్..శ్రీవల్లి అవుట్..

Intinti Ramayanam Today Episode: అయ్యో పార్వతి.. కమల్ పై రివేంజ్.. పల్లవికి వాతలు..

Big Stories

Advertisement
×