E-Paper
Advertisement

ఈ పొగను పీలిస్తే పోతారు మొత్తం పోతారు… దిమ్మతిరిగే కొరియన్ మిస్టరీ హర్రర్ సిరీస్

ఈ పొగను పీలిస్తే పోతారు మొత్తం పోతారు… దిమ్మతిరిగే కొరియన్ మిస్టరీ హర్రర్ సిరీస్
Advertisement

Supernatural horror thriller : హర్రర్ సినిమాలకైనా, రొమాంటిక్ లవ్ స్టోరీలకైనా, మైండ్ బెండింగ్ థ్రిల్లర్స్ కైనా కేరాఫ్ అడ్రస్ కొరియన్ సినిమా. ఈ కే-డ్రామాలకు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. అలాంటి వారి కోసమే ఈ మూవీ సజెషన్. నల్లటి రంధ్రం నుండి బయటపడిన భయంకర శాపం అనే కథాంశం ఆధారంగా తెరకెక్కిన సిరీస్ ‘డార్క్ హోల్’ (Dark Hole). 2021లో విడుదలై కొరియన్ సూపర్ నేచురల్ హారర్, సైకలాజికల్ థ్రిల్లర్ సిరీస్‌ ఇది. భారీ సంచలనం సృష్టించిన ఈ సిరీస్ ను ఏ ఓటీటీలో చూడవచ్చు ? స్టోరీ ఏంటి ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.

కథలోకి వెళ్తే…

ముజి అనే చిన్న పారిశ్రామిక నగరంలో కథ మొదలవుతుంది. ఒకరోజు ఆ నగరం సమీపంలోని అడవిలో ఒక లోతైన నల్లటి రంధ్రం అంటే సింక్ హోల్ ఏర్పడుతుంది. దాని నుండి వెలువడే వింతైన నల్లటి పొగను పీల్చిన వ్యక్తుల కళ్లు నల్లగా మారిపోతాయి. అలా మారిపోయిన వాళ్ళ మనసులో దాగి ఉన్న భయాలు, క్రోధం బయటకు వచ్చి, క్రూరమైన రాక్షసులుగా మార్చేస్తుంది. ఇలా మారిపోయిన ఆ మ్యూటంట్స్, తమ చుట్టూ ఉన్నవారిని వేటాడి వెంటాడి చంపుతారు.

Advertisement

ఈ డిజాస్టర్ జరుగుతున్న నేపథ్యంలోనే లీ హ్వా-సున్ అనే పోలీస్ డిటెక్టివ్ ముజి నగరానికి వస్తుంది. ఆమె భర్తను ఒక సైకో కిల్లర్ దారుణంగా హత్య చేసి ఆ నగరానికి పారిపోతాడు. ఆ హంతకుడిని పట్టుకోవాలని వచ్చిన హ్వా-సున్ కూడా ఈ భయంకరమైన నల్లటి పొగ విపత్తులో చిక్కుకుంటుంది. మరోవైపు యూ టే-హాన్ అనే మాజీ పోలీస్ ఆఫీసర్ ప్రస్తుతం రెక్కింగ్ ట్రక్ డ్రైవర్‌గా పని చేస్తుంటాడు. బయటకు సరదాగా కనిపించే ఆయన, న్యాయం కోసం గట్టిగా నిలబడే వ్యక్తి.

నగరం మొత్తం రాక్షసులతో నిండిపోతున్న తరుణంలో అతను హ్వా-సున్‌తో కలిసి ప్రజల ప్రాణాలు కాపాడటానికి ముందుకు వస్తాడు. సిటీలోని మిగిలిన ప్రజలు హాస్పిటల్, స్కూల్‌లలో దాక్కుంటారు. కానీ భయం, స్వార్థం వల్ల వారిలో కూడా ఒకరినొకరు మోసం చేసుకుంటారు. ఈ క్రమంలో నల్లటి పొగ వెనుక ఒక భయంకరమైన పరగ్రహ జీవి ఉందని తెలుస్తుంది. హ్వా-సున్, టే-హాన్ కలిసి ఆ శక్తిని అంతం చేయడానికి ప్రయత్నిస్తారు. మరి ఆ నల్లటి రంధ్రం వెనుక దాగి ఉన్న నిజం ఏమిటి ? ఈ పరిస్థితి నుండి గ్రామస్తులను ఎలా కాపాడారు ? హ్వా-సున్ తన భర్త హంతకుడిని పట్టుకుందా ? అనే ప్రశ్నలు చివరి ఎపిసోడ్ వరకు ప్రేక్షకులను ఉత్కంఠలో ఉంచుతాయి.

తెలుగులో అందుబాటులో ఉంది

Advertisement

‘డార్క్ హోల్ (Dark Hole)’ కిమ్ బాంగ్-జు దర్శకత్వంలో రూపొందిన 12 ఎపిసోడ్ల సిరీస్. ఈ సర్వైవల్ థ్రిల్లర్ ప్రస్తుతం JioCinemaలో తెలుగులోనే స్ట్రీమింగ్ అవుతోంది. ఇంకా చూడకపోతే వెంటనే ఒక లుక్కేయండి మరి.

Read Also: హెడ్ మాస్టర్ కూతురితో ప్రేమాయణం… మళ్లీ మళ్ళీ చూడాలన్పించే తెలుగు సిరీస్

Tags

Related News

కులం పిచ్చితో ప్రేమికుల ప్రాణాలు తీసే రాక్షసత్వం… హార్డ్ హిట్టింగ్ మూవీ

తీరప్రాంతాన్ని వణికించే మిస్టరీ క్రియేచర్… ఊరిని కాపాడుకోవడానికి మత్స్యకారుడి పోరాటం… గూస్‌బంప్స్ తెప్పిస్తున్న సర్వైవల్ థ్రిల్లర్

యూనికార్న్ ఐలాండ్‌లో ఊహించని విపత్తులు… ఆ వింత రహస్యం ఏంటి ? నెట్‌ఫ్లిక్స్‌లో కొత్త మ్యాజికల్ అడ్వెంచర్

అవుట్‌వర్ల్డ్ క్రూర చక్రవర్తిపై తిరుగుబాటు… హాలీవుడ్ హీరో ఎంట్రీతో నెక్స్ట్ లెవెల్ వార్… తెలుగులోనే స్ట్రీమింగ్

విలన్ గా సుహాస్ 150 కోట్ల మాస్ ర్యాంపేజ్… తెలుగులో స్ట్రీమింగ్ కి వచ్చేసిన ‘మందాడి’

కొట్టేసిన 300 కోట్ల బంగారాన్ని తన్నుకుపోయే ఖిలాడి… ఓన్ ఫ్రెండే మోసం చేస్తే రివేంజ్ ఇలాగే ఉంటది… ఓటీటీలో తెలుగులోనే

చనిపోయిన ప్రతిసారీ మళ్లీ బతుకుతాడు… ఏలియన్స్‌తో యుద్ధం గెలిచే వరకు ఆగని టైమ్ లూప్… మైండ్ బ్లాక్ సై-ఫై మూవీ

అమెజాన్ అడవుల్లో సీక్రెట్ సిటీ… వెతుక్కుంటూ వెళ్లి రాత్రికి రాత్రే గల్లంతైన సైంటిస్ట్… క్లైమాక్స్ ఊహించలేరు

Big Stories

Advertisement
×