Tollywood:మిస్సమ్మ సినిమా అనగానే మనకు సీనియర్ ఎన్టీఆర్ (Sr.NTR) ‘మిస్సమ్మ’, భూమిక (Bhoomika) ‘మిస్సమ్మ’ చిత్రాలు గుర్తుకొస్తాయి.. అయితే ఇప్పుడు ఆ చిత్రాల తర్వాత మా సినిమా కూడా అలా గుర్తుండిపోతుంది అంటూ మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. అదే ‘మోడ్రన్ మిస్సమ్మ’. లాస్య అండ్ మిధున క్రియేషన్స్ బ్యానర్ పై చిరంజీవి పమిడి, శివ పమిడి, కిరణ్ కుమార్ నల్లూరి, స్రవంతి నంబూరి సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం మోడ్రన్ మిస్సమ్మ. సాయి బాబా కథ , స్క్రీన్ ప్లే అందించడంతోపాటు దర్శకత్వం కూడా వహిస్తున్నారు. హర్ష నర్రా, తన్మయి ఖుషి, ప్రమోదిని, హారిక, డాక్టర్ భద్రం, సిజు ఏ ఆర్, రాకేష్ రాచకొండ, శివన్నారాయణ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి శేషు రాజ్ దడ్డాల, విజయ్ పిడప సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఆదిత్య పాపిశెట్టి ఎడిటర్ గా, బాలకృష్ణ కొరియోగ్రాఫర్ గా, హరికృష్ణ జగురోతి స్క్రిప్ట్ డిపార్ట్మెంటును పర్యవేక్షిస్తున్నారు . ఉప్పుతొల్ల బాబు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి వీఎఫ్ఎక్స్ డైరెక్టర్గా సోమేశ్ ఎరిపల్లి, సౌండ్ డిజైనర్ గా జి.పవన్ కళ్యాణ్ వ్యవహరిస్తున్నారు.
ఒకవైపు సినిమా షూటింగ్ జరుగుతుండగా.. బుధవారం ఈ చిత్రానికి సంబంధించిన మొదటి పాటను హైదరాబాదులోని ప్రసాద్ ల్యాబ్స్ లో చాలా గ్రాండ్ గా విడుదల చేశారు. మ్యూజిక్ డైరెక్టర్ గోపి సుందర్ స్వరాలు సమకూర్చిన ఈ పాటకు కిట్టు విస్సప్రగడ సాహిత్యం అందించారు.” బెటర్ బీ ఏ మిస్సమ్మ” అంటూ సాగిన ఈ పాటలో హీరో సాంప్రదాయ పంచకట్టులో కనిపిస్తుండగా.. హీరోయిన్ ట్రెడిషనల్ డ్రెస్ లో ఆకట్టుకుంది. ముఖ్యంగా హీరోయిన్ పెళ్లి వద్దంటూ పాడుకునే ఈ పాట మహిళలకు కనెక్ట్ అయ్యేలా కనిపిస్తోంది. సాంగ్ లాంచ్ ఈవెంట్ కి గెస్ట్ గా వచ్చిన వదల మూవీ ప్రొడ్యూసర్ కిషోర్ నాయుడు మాట్లాడుతూ.. “సినిమా చూసేటప్పుడు నేను లోపాలు మాత్రమే వెతుకుతాను. కానీ రీసెంట్ గా ఈ సినిమా ప్రీమియర్ చూసినప్పుడు అందులో ఒకటి కూడా దొరకలేదు. కచ్చితంగా ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేస్తారు.. ఇందులో భద్రం పాత్ర చాలా కామెడీగా ఉంటుంది” అంటూ తెలిపారు.
హీరో హర్ష నర్రా..”మిస్సింగ్, రోటి కపడా రొమాన్స్ తర్వాత చేస్తున్న మూడవ చిత్రం ఇది. ఈ సినిమా కష్టపడి కాకుండా ఇష్టపడి చేశాము. ఈ సినిమా మీ అందరికీ నచ్చుతుంది” అంటూ తన అభిప్రాయాన్ని చెప్పగా.. హీరోయిన్ మాట్లాడుతూ..” నాగార్జున గారి ‘మన్మధుడు’ చిత్రంలో “వద్దురా సోదరా.. పెళ్లంటే నూరేళ్ళ మంట రా” అనే సాంగ్ అప్పట్లో మగవాళ్లకు కనెక్ట్ అయినట్లు.. ఇప్పుడు మా చిత్రంలోని ఈ పాట ఆడవాళ్లకు కనెక్ట్ అవుతుంది. దర్శకుడు ఆడవాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ కథను రాయడం చాలా సంతోషంగా ఉంది” అంటూ తెలిపింది.
ALSO READ:పవిత్ర గౌడ మాజీ భర్త మృతి.. అసలేం జరిగిందంటే?
డైరెక్టర్ సాయిబాబా మాట్లాడుతూ..” ఇల్లు కట్టి చూడు.. పెళ్లి చేసి చూడు అని చెబుతారు కదా.. నేను దీనికి ఒకటి యాడ్ చేద్దాం అనుకుంటున్నా.. సినిమా చేసి చూడు అని.. ఈ మూడింటిలో అదే కష్టం అని నమ్ముతున్నాను. ఈ జర్నీలో నాకు సపోర్ట్ చేసిన టెక్నీషియన్స్, ఆర్టిస్టులు , నిర్మాతలకు ధన్యవాదాలు . మిస్సమ్మ లాంటి క్లాసిక్ టైటిల్ పెట్టాలి అంటే ధైర్యం కావాలి.. గతంలో వచ్చిన ఎన్టీఆర్ మిస్సమ్మ, భూమిక మిస్సమ్మ ఈ రెండు చాలా అడ్వాన్స్ మూవీస్. మా సినిమాలో కూడా అలాంటి దమ్ముందని నమ్మాము. మేము రాసిన దానికంటే మా ఆర్టిస్టుల పర్ఫామెన్స్ మోడ్రన్ మిస్సమ్మ అనే టైటిల్ పెట్టొచ్చు అని నిరూపించారు ” అంటూ తెలిపారు.