E-Paper
Advertisement

Karthika Deepam 2 Serial Today Episode August 17th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ తో తన పెళ్లి చేయమన్న జ్యో      

Karthika Deepam 2 Serial Today Episode August 17th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ తో తన పెళ్లి చేయమన్న జ్యో      
Advertisement

Karthika Deepam 2 serial today Episode: జ్యోత్స్న కోపంగా దీప, కార్తీక్ ల దగ్గరకు వెళ్లి సూరజ్‌కు ఎందుకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు అంటూ నిలదీస్తుంది. దీంతో ఏ సబంధం లేకపోయినా ప్రేమగా వదిన అని పిలుస్తున్నాడు అందకే పెళ్లి సంబంధాలు చూస్తున్నాము.. ఎలాగూ నీకు ఇష్టం లేదని చెప్పావు కదా అంటుంది దీప. నేను ఇష్టలేకపోతే ఇంత దూరం ఎందుకు వస్తాను.. అయినా నా పెళ్లి చేయాల్సిన బాధ్యత కూడా మీకు లేదా అంటూ నిలదీస్తుంది జ్యోత్స్న. దీంతో దీప మనకు బంధాలు ఉన్నాయా…? ఏనాడైనా నువ్వు ప్రేమగా వరుస పెట్టి పిలిచావా..? మరి నీకోసం మేమెందుకు ఆలోచించాలి అంటుంది. అందుకు అదేంటి నా పెళ్లి మీకు బాధ్యత అన్నారు కదా అంటూ జ్యోత్స్న అడిగితే.. నువ్వు పెళ్లే చేసుకోననన్నావు కదా అంటూ దీప చెప్పగానే.. అలా చెప్పి వదిలేస్తారా..? అంటుంది.

నువ్వే మమ్మల్ని వదిలేశావు అంటూ కార్తీక్‌ చెప్పగానే.. జ్యోత్స్న కోపంగా మీరు సూరజ్‌కు పెళ్లి సంబంధాలు చూడటం మాకు ఇష్టం లేదు అని చెప్పగానే.. అది చెప్పడానికి నువ్వెవరు అసలు నీ మనసులో ఏముందో చెప్పు అంటూ కార్తీక్‌ అడగ్గానే.. వాడంటే నాకు ఇష్టం.. అంటుంది జ్యోత్స్న. ఎవరు అంటే ఇష్టం అని అడగ్గానే.. సూరజ్‌ అంటే నాకు ఇష్టం నేను వాణ్ని ప్రేమిస్తున్నాను.. సూరజ్ నే పెళ్లి చేసుకుంటాను.. సూరజ్‌ నాకు కావాలి అంటూ చెప్తుంది. ఈ మాట ఎలా నమ్మాలి అంటూ కార్తీక్‌ అడగ్గానే.. నా మనసులో నువ్వు లేవు.. నా మనసులో సూరజే ఉన్నాడు.. నాకు నమ్మకం కుదిరించి కాబట్టే నా అంతటా నేనే వచ్చి అడుగుతున్నాను.. మీరు నాకు పెళ్లి చేస్తామని మాటిచ్చారు.. ఆ మాట నిలబెట్టుకోండి అంటూ జ్యోత్స్న చెప్తుంది. నువ్వు మారావని మేము ఎలా నమ్మేది అంటూ కార్తీక్‌ అడగ్గానే.. ఇంకెలా చెప్పాలి.. తల బాదుకోవడం.. ఏడుస్తూ కూర్చోవడం నాకు తెలియదు.. మీరే సూరజ్‌ను ఒప్పించాలి. ఎలా చెప్తారు.. అనేది మీ ఇష్టం మీరేం చేసినా నన్ను, సూరజ్‌ను కలపండి అంటూ చెప్పగానే.. కార్తీక్ మేమే నిన్ను నమ్మడం లేదు.. సూరజ్‌ ఎలా నమ్ముతాడు అంటూ కార్తీక్‌ అనుమానపడతాడు. ఫ్లీజ్‌ నమ్మండి అంటూ రిక్వెస్ట్‌ చేసి వెళ్లిపోతుంది.

Advertisement

ఇంట్లోకి వెళ్లిన కార్తీక్‌, దీపలను కాంచన అడుగుతుంది. ఎందుకు ఇంత పొద్దున్నే వచ్చింది అని అడిగితే.. తాను మారానని సూరజ్‌తో పెళ్లి చేయమని చెప్తుంది. అని కార్తీక్‌ చెప్పగానే.. కాంచన ఆశ్చర్యపోతుంది. ఈ మార్పు ఇంత తొందరగా వస్తుందని అసలు ఊహించలేదు అని చెప్తుంది. ఇంతలో శ్రీధర్‌ వచ్చి జ్యోత్స్న పెళ్లికి దీప కు లింకేంటి..? ఆ సీక్రెట్‌ ఏంటో నాకు తెలియాలి. అంటూ అడగ్గానే.. కార్తీక్‌ ఏవేవో మాటలు చెప్పి శ్రీధర్‌ను బోల్తా కొట్టించి వెళ్లిపోతాడు.

జ్యోత్స్న, సూరజ్‌ రూంలోకి వెళ్లి కాఫీ చేస్తుంది. బయటి నుంచి వచ్చిన సూరజ్‌ చూసి షాక్‌ అవుతాడు. రూంలోకి వెళ్లగానే.. జ్యో కాఫీ ఇచ్చి నాలాంటి అమ్మాయి నీకు ఎప్పుడైనా కాఫీ పెట్టి ఇచ్చిందా అని అడిగితే.. ఇవ్వలేదని సూరజ్‌ చెప్తాడు. మరి ఇచ్చిందంటే దాని అర్థం అని జ్యో అడిగితే.. ఎవిడెన్స్‌ లేని మర్డర్‌కు ప్లాన్‌ చేసిందేమోనని అనుమానం అంటాడు. జ్యో కోపంగా నెగెటివ్‌గా తప్ప పాజిటివ్‌గా ఆలోచించవా…? అంటే పాజిటివ్‌గా ఆలోచిస్తేనే ఇలా ఉంది నెగటివ్‌ గా ఆలోచిస్తే ఎలా ఉంటుందో అనగానే.. జ్యోత్స్న కొంచెం కాఫీ తాగి నీ అనుమానం తీరిందా..? ఇప్పుడు కాఫీ తాగుతావా..? అంటూ కాఫీ అందిస్తుంది. కాఫీ తాగిన సూరజ్‌ బాగుంది అంటూ అవును నాకోసం నువ్వే వచ్చి కాఫీ పెట్టావంటే దీని వెనక ఏదైనా కారణం ఉందా..? అని అడుగుతాడు. నవ్వు తెలివైన వాడివి కదా అదేంటో తెలుసుకో అంటుంది జ్యో వెళ్లిపోతుంటే.. మరి ఈ కాఫీ కప్పు పాత్ర ఎవరు కడుగుతారు అని సూరజ్‌ అడిగితే.. పెళ్లి చేసుకో పెళ్లాం వచ్చి కడుగుతుంది అంటూ వెళ్లిపోతుంది.

Advertisement

తర్వాత జ్యో, దీపకు ఫోన్‌ చేసి సూరజ్‌ రూంలోకి వెళ్లి కాఫీ పెట్టి ఇచ్చిన విషయం చెప్తుంది. సూరజ్‌ మారడేమో అంటుంది. సమస్యను వెంటనే పరిష్కరించాలనుకోకూడదు.. సమస్యను అర్థం చేసుకోవడం మొదలు పెడితే.. పరిష్కారం అదే దొరుకుతుంది అంటూ దీప హితబోద చేస్తుంది. ఇంతలో ఇవాళ్టీ కార్తీకదీపం2 ఏపిసోడ్‌ అయిపోతుంది.

 ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

Nindu Noorella Saavasam Serial Today Episode October 5th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరి తనను చంపేస్తుందని పార్థు పసిగడతాడా..?    

Monday Tv Movies : మూవీ లవర్స్ కు పూనకాలే.. వీటిని మస్ట్ వాచ్..

సుప్రీత ఆస్తుల విలువ ఎంతో తెలుసా? ఆస్తుల చిట్టా బయటపెట్టిందిగా?

పవన్ కళ్యాణ్ రాజకీయాల పై సుప్రీత కామెంట్స్… పండగ చేసుకున్నాం అంటూ!

సుప్రీత నెల సంపాదన ఎంతో తెలుసా? అందం కోసం అంత ఖర్చు చేస్తుందా?

డ్రగ్స్ వ్యవహారం…ఏడవని రోజు లేదు సుప్రీత ఎమోషనల్ కామెంట్స్!

కూతురికి సురేఖ వాణి చెప్పదా? నెగెటివ్ ట్రోల్స్ పై సుప్రీత రియాక్షన్!

సుప్రీత ఇండస్ట్రీకి రావడం వెనుక అతని ప్రమేయం ఉందా? ఆయన కోరిక నెరవేర్చారా??

Big Stories

Advertisement
×