E-Paper
Advertisement

Advertisement

Karthika Deepam 2 serial today Episode: సూరజ్‌ను పెంచిన వ్యక్తి దగ్గరకు జ్యోత్స్న వెళ్లి సూరజ్ గురించి అడుగుతుంది. అన్ని విషయాలు తెలుసుకుని ఆ వ్యక్తికి కొన్ని డబ్బులు ఇచ్చి వెళ్లిపోతుంది. వెంటనే ఆ వ్యక్తి సూరజ్‌కు ఫోన్‌ చేసి జ్యోత్స్న వచ్చి వెళ్లిన విషయం చెప్తాడు. సరే అంటూ ఆ వ్యక్తి సూరజ్‌ కాల్‌ కట్ చేస్తాడు.

తర్వాత సూరజ్‌ ఆఫీసుకు వెళ్లగానే జ్యోత్స్న, దీప మాట్లాడుకుంటుంటారు. సూరజ్‌ తాను జ్యోత్స్నతో మాట్లాడొచ్చా అని అడగ్గానే.. దీప వెళ్లబోతుంది. వదిన ఆగండి మీరు వెళ్లాల్సిన అవసరం లేదు.. అంటూ సూరజ్‌ దీపను ఆపేస్తాడు. జ్యోత్స్నను పెద్దాయన దగ్గరకు ఎందుకు వెళ్లావని అడుగుతాడు. నువ్వు వెళ్లలేదని నేను వెళ్లాను అంటుంది జ్యోత్స్న. నేను వెళ్లలేదని నువ్వెలా చెప్తావు.. అని సూరజ్‌ అడిగితే.. నేను వెళ్లానని నీకెలా తెలిసింది అనగానే.. మంచి పనులు ఎలాగైనా తెలుస్తాయి థాంక్స్‌ అంటూ సూరజ్‌ చెప్పగానే.. మాటలతోనే చెప్తావా..? అని జ్యోత్స్న అడిగితే చేతులతో కూడా చెప్తాను అంటూ సూరజ్‌ చేయి ఇవ్వగానే.. తాను చేయి ఇచ్చి ఎమోషనల్‌గా చూస్తుంది జ్యోత్స్న.  నేను మనఃస్పూర్తిగా చెప్తున్నాను థాంక్యూ సోమచ్‌.. పర్వలేదే నువ్వు కూడా అప్పుడప్పుడు మంచి పనులు చేస్తుంటావు అని చెప్పి సూరజ్‌ వెళ్లిపోతుంటే..

Advertisement

కార్తీక్‌ వస్తాడు.. ఏంటి సూరజ్‌ వెళ్లిపోతున్నాడు  అనగానే.. జ్యోత్స్నకు హ్యాండ్‌ ఇచ్చాడు అని దీప చెబితే ఇంతకు ముందే ఇచ్చాడు కదా..? అని కార్తీక్‌ అంటే.. ఇది షేక్‌ హ్యాండ్‌ బావ.. అది దీప ఇచ్చిన సలహాతో అంటూ దీపకు థాంక్స్‌ చెప్తుంది జ్యోత్స్న.. సలహా ఇవ్వడం తేలిక.. పాటించడం గొప్ప. నువ్వు పాటించావు.. దాని ప్రభావం చూశావు అంటూ చెప్పగానే.. అవును దీప, సూరజ్‌ నన్ను ఫస్ట్‌ టైం మెచ్చుకున్నాడు అంటూ నేను పెద్దాయనను కలవడం వల్ల రేపు సూరజ్‌ బర్తుడే అని తెలిసింది అని చెప్పగానే.. అయితే సూరజ్‌కు బర్తుడే సెలబ్రేషన్స్‌ తెలియకుండా ఏర్పాటు చేయమని జ్యోత్స్నకు చెప్తారు. ఆ బర్తుడే సెలబ్రేషన్స్‌లోనే సూరజ్‌కు తన మనసులో మాట చెప్పమంటారు దీప, కార్తీక్‌.

తర్వాత తన రూంలోకి వెళ్లిపోయిన జ్యోత్స్న తాను సూరజ్‌కు తన మనసులో మాట ఎలా చెప్పాలో ప్రాక్టీస్‌ చేస్తుంది. సూరజ్‌ అడిగే ప్రశ్నలకు ఎలా సమాధానాలు చెప్పాలో ఆలోచిస్తుంది. సూరజ్‌కు ఎలా ప్రపోజ్‌ చేయాలి..? ఎలా సూరజ్‌ను కన్వీన్స్‌ చేయాలి ఇలాంటి క్వశ్చన్స్‌తో జ్యోత్స్న సతమతమవుతుంది. ఎలా చెప్పాలో ఎలా ఒప్పించాలో అర్థం కాక కన్పీజ్‌ అవుతూ నిద్రపోతుంది.

Advertisement

ఉదయమే జ్యోత్స్న, సూరజ్‌ దగ్గరకు వెళ్తుంది. మీరేంటి ఇంత పొద్దున్నే నేను ఉంటున్న మీ ఇంటికి వచ్చారు అని అడగ్గానే.. మా ఇంట్లో చిన్న పార్టీ ఉంది నువ్వు రావాలని పిలవడానికి వచ్చాను.. అని చెప్తుంది. దీంతో సూరజ్‌ ఇది కాదు కానీ ఏదో చెప్పడానికి వచ్చావు కదా అది చెప్పు అని అడగ్గానే.. నేను ఏదో చెప్పడానికి వచ్చానని నీకెలా తెలుసు అని జ్యోత్స్న అడగ్గానే.. జనరల్‌గా నువ్వు మూడు నెలల నుంచి అద్దె ఎగ్గొటినోడి దగ్గరకు ఓనరు ఎలా వెళ్తాడో అలా కోపంగా వచ్చేదానివి కానీ ఇప్పుడు గుడికి వెళ్తున్న సంప్రదాయకంగా ఉన్న తెలుగింటి ఆడపడచులా వచ్చావు అని చెప్పగానే..

అలాగే అనుకో నేను గుడికే వచ్చాను అనుకో అనగానే.. అయితే పూజ చేసుకుని ప్రసాదం తీసుకుని వెళ్లు అని సూరజ్‌ చెప్పగానే.. వెళ్తాను కానీ అంటూ జ్యోత్స్న పక్కకు తిరిగి నువ్వంటే నాకు ఇష్టం ఇప్పుడు నా మనసులో నువ్వు మాత్రమే ఉన్నావు.. ఈ మాట నువ్వు నమ్ముతావా లేదా..? అంటూ చెప్పి తిరిగి చూడగానే.. సూరజ్‌ ఫోన్‌ మాట్లాడుతూ పక్కకు వెళ్తాడు. దీంతో జ్యోత్స్న కోపంగా నేను చెప్పింది వీడు వినలేదా..? అనుకుంటుంటే సూరజ్‌ కాల్‌ కట్‌ చేసి చెప్పు జ్యోత్స్న అనగానే.. జ్యోత్స్న కోపంగా అక్కడి నుంచి వెళ్లిపోతుంది.

మరోవైపు మాలిని స్వీట్స్‌ తీసుకెళ్లి దక్షిణమూర్తికి ఇస్తుంది. ఇవాళ మనం మర్చిపోలేని రోజు కానీ మనం ఇలా జరుపుకోవడం బాధగా ఉందని అంటాడు. కానీ ఈసారి మనం గెలుస్తామని మాలిని చెప్తుంది. కాలం మనల్ని పరీక్షించేది గొప్ప విజయాన్ని మనకు ఇవ్వడానికే అని చెప్పగానే.. ఈసారి తప్పితే మనకు మరో అవకాశం రాదు అని దక్షిణమూర్తి చెప్తాడు. మరో అవకాశం కోసం మన ఎదురుచూసే పరిస్థితి రానివ్వను మామయ్యగారు అంటూ మాలిని చెప్తుంది. ఇంతలో ఇవాళ్టీ కార్తీకదీపం2 ఏపిసోడ్‌ అయిపోతుంది.

 ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

Karthika Deepam 2 Serial Today Episode October 5th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: మాలినికి షాక్ ఇచ్చిన సూరజ్ – పీఏగా జ్యోత్స్న అపాయింట్            

Ninnu kori Serial Today Episode October 5th ‘నిన్ను కోరి’ సీరియల్‌: సామ్రాట్ ను జీవన్ చంపేస్తాడా..? చంద్ర కనిపెడుతుందా..? 

Nindu Noorella Saavasam Serial Today Episode October 5th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరి తనను చంపేస్తుందని పార్థు పసిగడతాడా..?    

Monday Tv Movies : మూవీ లవర్స్ కు పూనకాలే.. వీటిని మస్ట్ వాచ్..

సుప్రీత ఆస్తుల విలువ ఎంతో తెలుసా? చిట్టా మొత్తం బయటపెట్టిందిగా?

పవన్ కళ్యాణ్ రాజకీయాల పై సుప్రీత కామెంట్స్… పండగ చేసుకున్నాం అంటూ!

సుప్రీత నెల సంపాదన ఎంతో తెలుసా? అందం కోసం అంత ఖర్చు చేస్తుందా?

డ్రగ్స్ వ్యవహారం…ఏడవని రోజు లేదు సుప్రీత ఎమోషనల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×