E-Paper
Advertisement

Karthika Deepam 2 Serial Today Episode August 19th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: ఇంట్లో అందరి ముందు సూరజ్ కు  ప్రపోజ్‌ చేసిన జ్యోత్స్న

Karthika Deepam 2 Serial Today Episode August 19th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: ఇంట్లో అందరి ముందు సూరజ్ కు  ప్రపోజ్‌ చేసిన జ్యోత్స్న
Advertisement

Karthika Deepam 2 serial today Episode: సూరజ్‌కు నీ ప్రేమ విషయం చెప్పలేదా..? అని దీప, కార్తీక్‌ అడిగితే.. చెప్పాను కానీ వాడే వినలేదు.. ఫోన్‌ మాట్లాడుతూ వెళ్లిపోయాడు.. నేను ఎంత మారానో మీకు అర్థం అయింది. కానీ సూరజ్‌ కే అర్థం కావడం లేదు. ఈరోజు సూరజ్‌ బర్తుడే అక్కడే విష్‌ చేద్దామనుకున్నాను.. కానీ సూరజ్‌ నన్ను కేర్‌ చేయడం లేదు. సర్‌ఫ్రైజ్‌ పోతుందని సైలెంట్‌గా ఉండిపోయాను.. నా మనసులో మాట చెప్పాలి అనుకున్నాను కానీ చాన్స్‌ ఇవ్వలేదు. మాటలతో మన మైండ్‌ను డైవర్ట్‌ చేస్తాడు. మనం చెప్పాలి అనుకున్నది మర్చిపోతాము.. సూరజ్‌ వినాలకున్నది మాత్రమే వింటాడు.. అంటూ బాధపడుతుంది జ్యోత్స్న.

తర్వాత అందరూ కలిసి సూరజ్‌ బర్తుడే సెలబ్రేషన్స్‌ కోసం అంతా రెడీ చేస్తారు. అప్పుడే దాసు వస్తాడు. ఎప్పుడు వచ్చావు దాసు అని శివనారాయణ అడిగితే.. నేను రాలేదు కార్తీకే నన్ను రమ్మన్నాడు అని దాసు చెప్పగానే.. పారిజాతం షాక్‌ అవుతుంది. నిన్ను కార్తీక్‌ ఎందుకు రమ్మన్నాడు అని అడుగుతుంది. నాకు అర్తం అయింది అంటాడు దశరథ. ఏం అర్థం అయింది అని పారు అడిగితే.. ఇంట్లో మంచి కార్యం జరుగుతుంది. మంచి కార్యం జరిగినప్పుడు అయిన వాళ్లందరూ ఒకేచోట ఉండాలి కదా అందుకే పిలిచాడు అని చెప్పగానే.. పారిజాతం తిడుతూ.. ఆ సూరజ్‌ గాడు అసలు రాడు అంటూ చెప్తుండగానే.. సూరజ్‌ వస్తాడు. సూరజ్‌ను చూసిన పారిజాతం షాక్‌ అవుతుంది. దగ్గరకు వచ్చిన సూరజ్‌ తన బర్తుడే అని ఎవరు చెప్పారు అని అడగ్గానే.. పెద్దాయన చెప్పారని చెప్తుది జ్యో.

Advertisement

ఈరోజు నీకు ఇచ్చే గిఫ్టు కూడా స్పెషలే అంటూ కార్తీక్‌.. జ్యోను చూపిస్తాడు. శివనారాయణ కూడా అందరూ ఒకోచోట ఉన్నప్పుడు మనం మంచి గురించి సెలబ్రేట్‌ చేసుకోవాలి అంటాడు. వచ్చి కేక్‌ కట్‌ చేయ్‌ అనగానే.. కార్తీక్‌ ఆగు తాత కేక్‌ కటింగ్‌కు ముందు చిన్న పని ఉంది అంటూ సూరజ్ ను జ్యోత్స్న దగ్గరకు జరిపి చెప్పమని సైగ చేస్తాడు.. దీప కూడా జ్యోత్స్నను తన మనసులో మాట చెప్పమంటుంది. జ్యోత్స్న.. సూరజ్‌ను చూస్తూ.. తాను జీవితంలో ఎవరి గురించి తెలుసుకోలేదని తెలుసుకునేత అవసరం తనకు రాలేదని ఇంట్లో తనను అలా పెంచారని.. నా చుట్టూ ఉన్నవాళ్లు  నా వాళ్లు నా గురించి ఆలోచించేవాళ్లు ఇలాంటి వాళ్లు ఉన్నప్పుడు నేను ఏం చెప్పడానికైనా భయపడను… సూరజ్ నువ్వంటే నాకు ఇష్టం.. మీ అందరికీ చెప్తున్నాను.. సూరజ్‌ అంటే నాకు ఇష్టం.. సూరజ్‌తో జీవితాంతం కలిసి జీవిండగలను అనే నమ్మకం నాకు ఉంది. నా మనసు ఇది అని నేను చెప్పలేను.. అర్థం అయిందో లేదో నువ్వే చెప్పాలి.. తాత నేను చెప్పాల్సింది చెప్పాను.. నేను అంటే ఇష్టమా కాదా…? సూరజ్‌ చెప్పాలి అనగానే..

శివనారాయణ కూడా చెప్పు సూరజ్‌.. జ్యోత్స్న సిగ్గు విడిచి తన మనసులో మాట చెప్పింది నువ్వు చెప్పాలి.. అనగానే.. అందరూ సూరజ్‌ను తన మనసులో మాట చెప్పమని అడుగుతారు.. మేమంతా నీ మంచి కోరుకునే మనుషులమే.. అంటారు. సూరజ్‌.. జ్యోత్స్నను చూస్తూ.. నాకు ఇష్టమే అని చెప్తాడు. సూరజ్‌ మాటలు వినగానే అందరూ హ్యాపీగా ఫీలవుతారు. జ్యోత్స్నను పెళ్లి చేసుకోవడానికి నాకు ఏం అభ్యర్థం లేదు.. నేను జ్యోత్స్న మనసులో ఉన్నానని నాకు అర్థం అయింది. తన మాటలు చూసి కాదు.. తన కళ్లను చూసి నమ్మాను.. ఆరోజు మీ అందరి ముందు చెప్పాను జ్యోత్స్న మనసులో నేను లేనని..

Advertisement

కానీ ఈరోజు చెప్తున్నాను.. జ్యోత్స్న మనసులో నేను ఉన్నానని.. నేను మాత్రమే జ్యోత్స్న మనసులో ఉన్నానని కూడా నమ్ముతున్నాను.. తన మాటల్లో.. తన చేతల్లో నా మీద ఉన్న ప్రేమ చాలా స్పష్టంగా కనిపిస్తుది. నేను కూడా జ్యోత్స్నను ఇష్టపడుతున్నాను.. తనతో కలిసే బతకాలని కోరుకుంటున్నాను.. అది కూడా మీ అందరి ఆశీర్వాదంతోనే అని చెప్పగానే.. అందరూ క్లాప్స్‌ కొడతారు. శివనారాయణ సంతోషంతో ఎమోషన్స్‌ అవుతూ.. ఈరోజు సూరజ్‌ పుట్టిన రోజే కాదు ఈ శివనారాయణ పుట్టినరోజు లాంటిదే.. అంటాడు. అందరూ కలిసి కేక్‌ కట్‌ చేస్తారు. సూరజ్‌, జ్యోత్స్నకు కేక్‌ తినిపిస్తాడు. ఇంతలో ఇవాళ్టీ కార్తీకదీపం2 ఏపిసోడ్‌ అయిపోతుంది.

 ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

Karthika Deepam 2 Serial Today Episode October 5th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: మాలినికి షాక్ ఇచ్చిన సూరజ్ – పీఏగా జ్యోత్స్న అపాయింట్            

Ninnu kori Serial Today Episode October 5th ‘నిన్ను కోరి’ సీరియల్‌: సామ్రాట్ ను జీవన్ చంపేస్తాడా..? చంద్ర కనిపెడుతుందా..? 

Nindu Noorella Saavasam Serial Today Episode October 5th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరి తనను చంపేస్తుందని పార్థు పసిగడతాడా..?    

Monday Tv Movies : మూవీ లవర్స్ కు పూనకాలే.. వీటిని మస్ట్ వాచ్..

సుప్రీత ఆస్తుల విలువ ఎంతో తెలుసా? చిట్టా మొత్తం బయటపెట్టిందిగా?

పవన్ కళ్యాణ్ రాజకీయాల పై సుప్రీత కామెంట్స్… పండగ చేసుకున్నాం అంటూ!

సుప్రీత నెల సంపాదన ఎంతో తెలుసా? అందం కోసం అంత ఖర్చు చేస్తుందా?

డ్రగ్స్ వ్యవహారం…ఏడవని రోజు లేదు సుప్రీత ఎమోషనల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×