E-Paper
Advertisement

Karthika Deepam 2 Serial Today Episode August 21st ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: శివనారాయణకు షాక్ ఇచ్చిన సూరజ్       

Karthika Deepam 2 Serial Today Episode August 21st ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: శివనారాయణకు షాక్ ఇచ్చిన సూరజ్       
Advertisement

Karthika Deepam 2 serial today Episode: సూరజ్‌ వేలికి గాయం అవ్వడంతో జ్యోత్స్న కంగారు పడుతూ.. బాధగా ఏడుస్తూ.. కట్టుకడుతుంది. సూరజ్‌ అయింది చిన్న గాయమేగా ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగితే.. గాయం అయిన నీకన్నా నాకే ఎక్కువ బాధగా ఉంది అంటుంది. ఇంతలో ఇంట్లోంచి జ్యోత్స్నకు ఫోన్‌ చేస్తారు.. అది గమనించిన సూరజ్‌ నువ్వు ఎక్కడికి వెళ్లావోనని మీ వాళ్లు కంగారుపడతారు. అంటూనే దాసు గురించి అడుగుతాడు. నీ పెళ్లి అనగానే.. ఆయన కళ్లల్లో అందరికంటే ఎక్కువ ఆనందం కనిపించింది ఇంతకీ ఎవరాయన అని అడుగుతాడు.. అందుకు జ్యోత్స్న దాసు గురించి పూర్తిగా చెప్తుంది. దాసు పారిజాతం మొదటి భర్త కొడుకని తనకు బాబాయ్‌ వరుస అవుతారని చెప్తుంది. ఎంత బాబాయ్‌ అయినా అందరికన్నా ఎక్కువ ఆనంద పడిందే ఆయనే అంటాడు. ఆ మాటలకు కొందరి ప్రేమలు అలా ఉంటాయి మరి అంటూ జ్యోత్స్న చెప్తుంది.

ఇంట్లో ఫుల్‌ మేకప్‌ వేసుకుని రెడీ అవుతుంది పారిజాతం. పారును అలా చూసిన కార్తీక్‌ షాక్‌ అవుతాడు. నీకు తాతయ్య పనిమనిషిలా ఉండమంటే నువ్వేంటి పారు ఇలా ఉన్నావు తాతయ్య చూస్తూ నీ శిక్ష మరో నెల రోజులు పెరుగుతుంది అని చెబితే.. మీ తాతయ్యే నాకు పర్మిషన్‌ ఇచ్చాడులేరా..? అయినా నేను బ్యూటిఫుల్‌ గా రెడీ అవ్వడం నీకు ఇష్ట లేన్నట్టు ఉంది అంటూ కార్తీక్‌ను తిడుతుంది. అప్పుడే శివనారాయణ వస్తాడు. మనవరాలి పెళ్లి కదా తన పనిమనిషి గెటప్‌ తీసేస్తానని రిక్వెస్ట్ చేస్తే నేనే సరేలే అన్నాను కార్తీక్‌ అని చెప్తాడు శివనారాయణ. పారిజాతం ఏవండి మీతో కొంచెం మాట్లాడాలి అంటూ పిలవగానే.. శివనారాయణ సరే పద అంటూ పారిజాతం వెనకాలే వెళ్లిపోతాడు.

Advertisement

మరోవైపు దశరథ వెళ్లి కార్తీక్‌, దీపలకు థాంక్స్‌ చెప్తాడు. జ్యోత్స్న విషయంలో చాలా బాధగా ఉండేదని.. జ్యోత్స్న ప్రవర్తన చూసినప్పడల్లా నా పెంపకం మీద నాకే అసహ్యం వేసేదని.. కానీ మీరు జ్యోత్స్నను పూర్తిగా మార్చేశారని.. నేను జ్యోత్స్న ఎలా ఉండాలని కోరుకున్నానో ఇప్పుడు అలా ఉండేటట్లు చేశారని దశరథ ఎమోషనల్ అవుతాడు. అయితే ఇందులో తమకు ఎలాంటి సంబంధం లేదని మొత్తం క్రెడిట్‌ అంతా సూరజ్‌దేనని చెప్తారు కార్తీక్‌, దీప. కానీ సూరజ్‌ ఇంటికి రావడానికి కారణం మీరే.. సూరజ్‌ ఆఫీసులో వర్క్‌ చేయడానికి కారణం మీరే.. అసలు జ్యోత్స్నకు సూరజే కరెక్ట్‌ అని మొదట చెప్పిందే మీరు దీప నా సొంత కూతురు.. జ్యోత్స్న నా పెంపుడు కూతురు.. అక్కే చెల్లికి మంచి సంబంధం చూసింది. ఇక నుంచి నాకు ఇద్దరు కూతుళ్లు ఇదంతా ఒక ఎత్తు అయితే.. జ్యోత్స్నలో మార్పు రావడం అనేది మరో పెద్ద ఎత్తు అంటూ దశరథ కన్నీళ్లు పెట్టుకుంటూ ఎమోషనల్‌ అవుతాడు.

ఇంట్లో వాళ్లందరూ జ్యోత్స్న, సూరజ్‌ల ఎంగేజ్‌మెంట్‌ గ్రాండ్‌గా చేయాలని ప్లాన్‌ చేస్తుంటారు. సూరజ్‌ వచ్చి ఎంగేజ్‌మెంట్‌ వద్దని చెప్తాడు. సూరజ్‌ మాటలకు అందరూ షాక్‌ అవుతారు. ఎందుకు వద్దని కార్తీక్‌ అడిగితే.. డైరెక్టుగా పెళ్లి ముహూర్తం పెట్టించండి అని చెప్తాడు. సూరజ్‌ మాటలకు అందరూ ఊపిరి పీల్చుకుని నవ్వుకుంటారు.. సరే పెళ్లికే ముహూర్తం పెట్టిద్దాం ఇంకా ఏమైనా కండీషన్స్‌ ఉన్నాయా అని అడిగితే.. ఉన్నాయని సూరజ్‌ చెప్తాడు. మళ్లీ అందరూ షాక్‌ అవుతారు.. ఏంటా కండీషన్‌ అని దీప అడిగితే.. పెళ్లి మూహూర్తం కూడా ఈరోజు పంతులును పిలిపించి పెట్టించాలి అని చెప్తాడు. అందరూ హ్యాపీగా  నవ్వుకుంటూ సరే అంటారు.

Advertisement

తర్వాత సూరజ్‌ రూంలోకి వెళ్లిన జ్యోత్స్న ఎంగేజ్‌మెంట్‌ ఎందుకు వద్దన్నావు అని అడుగుతుంది. ఈరోజుల్లో అందరూ ఎంత ట్రెండీగా చేసుకుంటారో తెలుసా..? అంటూ తాను తీసుకెళ్లిన గోల్డ్‌ చైన్‌, గోల్డ్‌ రింగ్‌ సూరజ్‌కు ఇస్తుంది. అవి చూసి సూరజ్‌ హ్యాపీగా పీలవుతూ.. ఎమోషనల్ అవుతూ.. విలువైనవి ఏవీ నాకు జీవితంలో ఉండవు.. అంటాడు. సూరజ్‌ చేతికి జ్యోత్స్న రింగ్‌ తొడగబోతుంటే.. సూరజ్‌ వద్దంటాడు.. ఇప్పుడు ఎలాంటి ముహూర్తం ఉందో ఏమో అంటాడు.. జ్యోత్స్న కోపంగా సూరజ్‌ను తిట్టి వెళ్లిపోతుంది.  ఇంతలో ఇవాళ్టీ కార్తీకదీపం2 ఏపిసోడ్‌ అయిపోతుంది.

 ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

హేటర్స్ కి అనసూయ దిమ్మతిరిగే రియాక్షన్!

బిగ్ బాస్ 10లో నామినేషన్స్ సెగలు.. ఆమెపై విరుచుకుపడ్డ కంటెస్టెంట్స్!

చంపేయ్ దేవుడా.. నరకం భరించలేకపోతున్నా – సుప్రీత

సుప్రీత మధ్యలోనే చదువు ఆపిందా.. కన్నీళ్లు తెప్పించే స్టోరీ!

ఈ గుర్తింపు బిగ్ బాస్ పెట్టిన భిక్ష.. రోహిత్ తీరుపై కౌశల్ మండిపాటు!

Karthika Deepam 2 Serial Today Episode October 5th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: మాలినికి షాక్ ఇచ్చిన సూరజ్ – పీఏగా జ్యోత్స్న అపాయింట్            

Ninnu kori Serial Today Episode October 5th ‘నిన్ను కోరి’ సీరియల్‌: సామ్రాట్ ను జీవన్ చంపేస్తాడా..? చంద్ర కనిపెడుతుందా..? 

Nindu Noorella Saavasam Serial Today Episode October 5th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరి తనను చంపేస్తుందని పార్థు పసిగడతాడా..?    

Big Stories

Advertisement
×