E-Paper
Advertisement

Karthika Deepam 2 Serial Today Episode July 7th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌:  జ్యోత్స్నకు షాక్ ఇచ్చిన సూరజ్  

Karthika Deepam 2 Serial Today Episode July 7th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌:  జ్యోత్స్నకు షాక్ ఇచ్చిన సూరజ్  
Advertisement

Karthika Deepam 2 serial today Episode: శివనారాయణ, సూరజ్‌ను కొట్టిన విషయం గుర్తు చేసుకుంటూ ఆలోచిస్తూ జ్యూస్‌ చేస్తూ ఉంటుంది దీప. అప్పుడే కార్తీక్‌ వచ్చి ఇప్పుడ ఎవరి కోసం జ్యూస్‌ చేస్తున్నావని అడుగుతాడు. అమ్మ కోసం అని దీప చెప్పగానే అడిగిందా అని కార్తీక్‌ అంటే.. లేదు కానీ జ్యూస్‌ ఇచ్చి అమ్మతో మాట్లాడాలి. అమ్మకు కూడా సూరజ్‌ మీద అనుమానం ఉందేమో తెలుసుకోవాలి అంటుంది దీప. దీంతో మీ అమ్మకు అనుమానం ఉందో లేదో కానీ నాకైతే అనుమానం ఉంది అంటాడు కార్తీక్‌. దీంతో దీప షాక్‌ అవుతుంది.

నీకు నమ్మకంగా ఉన్న వ్యక్తి మీద నాకు అనుమానం ఏంటని అనుకుంటున్నావా..? అనగానే దీప అవును అనగానే.. సూరజ్‌ గురించి మనకేం తెలియదు.. అదీ కాక మన తాత శత్రువుతో సూరజ్‌ మాట్లాడుతున్నాడంటే అనుమానం రాక ఏమొస్తుంది. మనకేమీ తెలియని వ్యక్తి గురించి అనుమానించడం కరెక్ట్‌ కాదు కదా..? అంటూ కార్తీక్‌ చెప్తాడు. దీంతో ఇక్కడ ఇంత జరుగుతుంటే మా నాన్న ఎక్కడికి వెళ్లాడు అంటూ దీప అడగ్గానే.. రెస్టారెంట్‌ టూర్‌లో ఉన్నాడు. టూర్‌ అయిపోగానే వస్తాడు అంటూ కార్తీక్‌ చెప్తాడు. దీంతో నాన్న వచ్చే వరకు అమ్మ పరిస్థితి ఎలా ఉంటుందోనని దీప ఎమోషనల్‌ అవుతుంది. కుబేర్‌ను తలుచుకుని ఏడుస్తుంది దీప.

Advertisement

సూరజ్‌ దగ్గరకు జ్యోత్స్న వెళ్లి క్యాబ్‌ బుక్‌ చేసుకుంటావా..? బ్యాగ్‌ నవ్వే సర్దుకోవాలి. ఇంత జరిగిన తర్వాత మళ్లీ చెప్పుకోవడానికి ఈగో అడ్డొస్తుంది కదా..? అందుకే చెప్పకుండా వెళ్లిపోతావా..? అంటూ అడుగుతుంటే.. ఇంతకీ ఏం జరిగింది. ఎందుకు నేను వెళ్లిపోవాలి అంటూ సూరజ్‌ అడగ్గానే.. జ్యోత్స్న కోపంగా అందరిలో మా తాత నిన్ను అంత అవమానించాక మళ్లీ ఇక్కడే ఉండటానికి నీ సెల్ఫ్‌ రెస్సెక్ట్‌ ఒప్పుకోదు కదా అందుకే నేను సెండాఫ్‌ ఇవ్వడానికి వచ్చాను. అనగానే.. సూరజ్‌ దానికి నేను అక్కడే క్లారిటీ ఇచ్చాను అంటూ చెప్పగానే.. మా తాత నిన్ను అవమానించాడు. దక్షిణమూర్తికి అమ్ముడుపోయావు అనుకున్నాడు.. అనగానే.. ఆపవే నా బంగారు వస పిట్ట నీకు మాటలు త్వరగా రాలేదని వస బాగా పట్టించేవారేమో..? అనగానే.. జ్యోత్స్న కోపంగా రేయ్‌ ఎంతకు అమ్ముడుపోయావొ చెప్పరా..? అనగానే..

సూరజ్‌ నన్ను కొనేంత కలేజా ఇక్కడ ఎవ్వరికీ లేదే..? ఒకవేళ ఉన్నా అమ్ముడుపోవడానికి ఈ సూరజ్‌ సిద్దంగా లేడు.. నేను తల వంచేది అభిమానానికి నేను దిగి వచ్చేది మంచితనానికి మీ తాత నన్ను కొట్టడంతో నువ్వు అనుమానం చూశావు.. నేను అభిమానం చూశాను అనగానే.. దాంట్లో అభిమానం ఏంట్రా..? అంటూ జ్యోత్స్న అడగ్గానే.. ఆ పెద్ద మనిషి ఇంటికి వచ్చేటప్పుడు ఎంతో మందితో మాట్లాడాడు.. వాళ్లందరినీ కాకుండా శివనారాయణ గారు నన్నే అనుమానించారు అంటే చైర్మన్‌ గారికి నా మీద నమ్మకం ఉంది. నమ్మకం ఉంద కాబట్టే అనుమానం వచ్చింది. అనుమానం వచ్చింది కాబట్టే కొట్టారు. అది కూడా నా మీద కోపంతో కాదు దక్షిణమూర్తి గారి మీద కోపంతో అందుకే ఆ దెబ్బ నా చెంపకు తగిలిందే కానీ మనసుకు కాదు.. అంటూ సూరజ్‌ చెప్తుంటే.. జ్యోత్స్న కోపంగా మా తాతను ఇంత అర్థం చేసుకున్న వాడివి నన్నెందుకురా అర్థం చేసుకోలేదు.. అంటే.. అర్థం చేసుకున్నాను కాబట్టే అర్ధాంగిని చేసుకోవాలి అనుకున్నాను అంటూ చెప్పగానే.. జ్యోత్స్న కోపంగా సూరజ్‌ను తిట్టి అక్కడి నుంచి వెళ్లిపోతుంది.

Advertisement

మాలిని ఒక హోటల్‌కు వెళ్లి అక్కడ కాఫీ తాగుతుంది. కాఫీ బాగుందని ఓనర్‌ ను కలుస్తుంది. ఓనరు ఎవరిని పడితే వాళ్లను కలవనని చెబితే.. తన విజిటింగ్‌ కార్డు ఇచ్చి మేనేజర్‌ను పంపిస్తుంది. దీంతో విజిటింగ్‌ కార్డు చూసిన మేనేజర్‌ వెంటనే మాలినిని తన చాంబర్‌లోకి పిలుపించుకుంటాడు. మాలిని ఆ హోటల్ ఓనరుతో తనకు హోటల్‌ అమ్మమని ప్రపోజల్‌ ఇస్తుంది. ఓనరు అందుకు ఒప్పుకోడు.. మాలిని కోపంగా వెళ్లిపోతుంది.

శివనారాయణ ఇంట్లో అందరూ కూర్చుని మాట్లాడుకుంటుంటే.. సూరజ్‌ వెళ్తాడు. సారీ సార్‌ మీరేదో ఫ్యామిలీతో కలిసి మాట్లాడుకుంటున్నారు.. నేను వెళ్తాను అనగానే.. శివనారాయణ మాత్రం పర్వాలేదు నువ్వు కూడా మా ఫ్యామిలీ మెంబర్‌ లాంటి వాడివే ఏంటో చెప్పు అనగానే.. సూరజ్‌ తాను దీపతో మాట్లాడటానికి వచ్చానని చెప్తాడు. దీప చెప్పమని అడగ్గానే.. మార్నింగ్‌ ఆఫీసుకు రెండు గంటలు లేటుగా వస్తాను అని చెప్పగానే.. జ్యోత్స్న కల్పించుకుని రెండు గంటలు కాకపోతే ఒకరోజే ఆఫీకు రావొద్దు నువ్వే ఎంప్లాయీ కాదు కదా అంటుంది. పారిజాతం మాత్రం అనుమానంగా వీడు రెండు గంటలు లేటుగా వస్తానంటున్నాడంటే ఏదో చేయబోతున్నాడు వీడు జ్యోత్స్నతో ఓ ఆటాడుకుంటున్నాడురా నువ్వు అడగరా అంటూ కార్తీక్‌ను రిక్వెస్ట్‌ చేస్తుంది పారిజాతం. ఇంతలో ఇవాళ్టీ కార్తీకదీపం2 ఏపిసోడ్‌ అయిపోతుంది.

 ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

బిగ్ బాస్ చరిత్రలో సరికొత్త రికార్డు సృష్టించిన సీజన్ 10!

స్టేజ్ పై అషూ రెడ్డితో గొడవ పెట్టుకున్న మరో బిగ్ బాస్ కంటెస్టెంట్?

పరారీలో ప్రముఖ యూట్యూబర్.. నగదుతో పాటు బంగారం చోరీ!

Gundeninda GudiGantalu Today episode: బాలుకు అనుమానం.. పిల్లాడిలా మారిన మనోజ్.. బాలు రచ్చ రచ్చ..

Podarillu Today Episode : కేశవ కోరిక తీరుతుందా? మహా, విక్కీ మధ్య దివ్య..మహాకు గుడ్ న్యూస్..

Nindu Noorella Saavasam Serial Today Episode October 8th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరి, పార్థును చంపేసిన నిజం సీతారాం అందరికీ చెప్తాడా..?  

Illu Illalu Pillalu Today Episodes: రామరాజుకు మైండ్ బ్లాక్.. వేదవతి మాటతో షాక్..శ్రీవల్లి అవుట్..

Intinti Ramayanam Today Episode: అయ్యో పార్వతి.. కమల్ పై రివేంజ్.. పల్లవికి వాతలు..

Big Stories

Advertisement
×