Karthika Deepam 2 serial today Episode: జ్యోత్స్న ను ఆఫీసుకు రానివ్వనని సూరజ్ రాత్రి చెప్పి వెళ్లిపోయాడు. ఇంతకు ఎక్కడికి వెళ్లాడు. ఎవరిని కలిశాడో ఏం చేశాడో ఇంతవరకు చెప్పలేదు అని ఆలోచిస్తుంది. అప్పుడే దక్షిణమూర్తి వచ్చి తాను ఆఫీసుకు వస్తానని చెప్తాడు. ఎందుకని అడిగితే నా మనవరాలు ఆఫీసుకు వస్తుంది కదా విష్ చేద్దామని స్వీట్లు పంచుతానంటాడు. మాలిని ఆఫీసుకు రానంటుంది ఇంట్లోనే ఉంటానంటుంది. సూరజ్, దక్షిణమూర్తి కలిసి వెళ్లిపోతారు. సూరజ్, మాలినిని అనుమానంగా చూస్తూ వెళ్లిపోతుంటాడు. సూరజ్ రాత్రి చెప్పింది చేయలేడు.. నేనే ఏదో ఒకటి చేయాలి. సూరజ్ ఎప్పటికీ మాలిని కొడుకుగానే ఉండాలి అంతేకానీ జ్యోత్స్న ప్రియుడిగా ఉండకూడదు అని మనసులో అనుకుంటుంది.
ఆఫీసుకు బయలుదేరుతున్న కార్తీక్, దీప ఇద్దరూ జ్యోత్స్న గురించి కంగారు పడుతుంటారు. జ్యోత్స్న కోసం బయట సుమిత్ర గుమ్మం దగ్గర నిలబడి ఏడుస్తుందని దీప చెబితే.. ఆఫీసుకు వస్తుందేమో చూద్దాం పద అత్తకు ఏదో ఒకటి చెప్పి వెళ్దామని అనుకుంటూ బయటకు వెళ్తారు. జ్యోత్స్న కోసం సుమిత్ర ఏడుస్తుంటే.. దీప మాట జారుతుంది. ఇవాళ జ్యో్త్స్న డ్యూటీలో జాయిన్ అవుతుంది కదా అందుకే కచ్చితంగా ఇవాళ వస్తుంది అని దీప చెప్పగానే.. ఎక్కడ జాయిన్ అవ్వాలి అని సుమిత్ర అడగ్గానే.. దీప, కార్తీక్ కంగారు పడతారు. కార్తీక్ మాట మార్చేసి సుమిత్రను కన్వీన్స్ చేసి దీపను తీసుకుని వెళ్లిపోతాడు.
ఆఫీసుక వెళ్లి మేనేజర్‌ను జ్యోత్స్న వచ్చిందా అని అడిగితే మేనేజరు రాలేదని చెప్తాడు. ఎదురుగా వచ్చిన సూరజ్ కూడా జ్యోత్స్న గురించి అడిగి రాకపోతే ఇక ఇంట్లోనే ఉండమని చెప్పండి అంటూ కోపంగా వెళ్లిపోతాడు. కార్తీక్, దీప అయోమయంలో పడిపోతారు. జ్యోత్స్ను నిజంగానే సూరజ్, మాలినే ఏదో చేశారని కార్తీక్ కోపంగా వెళ్లి సూరజ్ కాలర్ పట్టుకుని జ్యో్త్స్న ఏం చేశారో చెప్పరా అంటూ తిడతాడు. నీ మంచి కోరి చెప్తున్నాను జ్యోత్స్నను దాచేసి ఉంటే వదిలేయ్ లేకపోతే నేను విధ్వంసం నువ్వు తట్టుకోలేవు.. ఇప్పుడు నేను ఇంటికి వెళ్తున్నాను జ్యోత్స్న రాకపోతే బాగుండదు అంటూ దీపను తీసుకుని కార్తీక్ అక్కడి నుంచి వెళ్లిపోతాడు. జ్యోత్స్న కనిపికంచపోవడం ఏంట్రా అని దక్షిణమూర్తి అడిగితే.. దానికి సమాధానం చెప్పాల్సిన వ్యక్తి వేరే ఉన్నారు అంటూ సూరజ్ వెళ్తాడు. సూరజ్ వెనకాలే దక్షిణమూర్తి వెళ్తాడు.
టిఫిన్ బండి దగ్గర సుమిత్ర కంగారు పడుతూ ఉంటుంది. చట్నీ అడిగితే.. ఇడ్లీ, దోశ అడిగితే బొండాలు ఇస్తుంది. అది గమనించిన శివనారాయణ.. సుమిత్రను ఇంటికి తీసుకెళ్లమని చెప్తాడు. అందుకు సుమిత్ర ఏడుస్తూ.. జ్యోత్స్న గురించి బాధపడుతుంది. దీంతో ఈరోజు టిపిన్స్ అయిపోయాయి కదా అందరం ఇంటికి వెళ్దాం పదండి అంటూ వెళ్లిపోతారు. అందరూ ఇంట్లో కూర్చోని జ్యోత్స్న కోసం ఎదురుచూస్తుంటారు. కార్తీక్, దీప తీసుకొస్తామని చెప్పారు వాళ్లు ఎక్కడ వస్తున్నారో ఫోన్ చేయమని కాంచనకు చెప్తుంది. అప్పుడే కార్తీక్, దీప వస్తారు. వాళ్లను జ్యోత్స్న ఎక్కడుందని అడుగుతుంది. జ్యోత్స్న రాలేదని కార్తీక్ చెప్పగానే.. సుమిత్ర ఏడుస్తుంది. కార్తీక్ జ్యోత్స్న గురించి సూరజ్‌కు పీఏగా జాయిన్ అయిన విషయం చెప్తాడు. దశరథ కోపంగా కార్తీక్‌ను కొడతాడు.
సూరజ్ కోపంగా ఇంటికి వెళ్లి జ్యోత్స్నను ఏం చేశావు అని మాలినిని నిలదీస్తాడు. అందుకు తనకేం తెలియదని మాలిని చెప్తుంది. అందుకు సూరజ్ కోపంగా మాలినిని తిడతాడు. జ్యోత్స్న మన ఆఫీసులో అడుగుపెట్టడానికి కారణం నువ్వే తాను పీఏగా ఉండటం నీకు ఇష్టం లేదు. అసలు జ్యోత్స్న ఎక్కడుందో చెప్పమని సూరజ్ అడిగితే మాలిని తనకు తెలియదని చెప్పగానే. అయితే తన మీద ఒట్టేసి చెప్పమని సూరజ్, మాలిని చేయి తన తల మీద పెట్టుకుంటాడు. కట్ చేస్తే కాంచన ఇంట్లో దశరథ కోపంగా కార్తీక్‌ను తిడుతుంటాడు. జ్యోత్స్న గురించి ముందే ఎందుకు చెప్పలేదు అంటూ నిలదీస్తారు. అందుకు కార్తీక్ భయపడుతూ నిజాలు మొత్తం చెప్పి కార్తీక్ కూడా భయపడుతుంటాడు. శివనారాయణ కోపంగా మాతో మొదలైన పంతాలు మా చావుతోనే అంతం అవ్వాలి అంటూ దక్షిణమూర్తి ఇంటికి వెళ్లిపోతాడు.
దక్షిణమూర్తి ఇంట్లో మాలిని, సూరజ్ తల మీద నుంచి చేయి తీసి నా కొడుకు మీద నేను ఒట్టేయనురా అంటుంది. అయితే మా అనుమానమే నిజం అయిందా..? అంటూ దక్షిణమూర్తి అడుగుతాడు. అప్పుడే శివనారాయన వచ్చి జ్యోత్స్నను ఏం చేశావురా అంటూ కోపంగా అడుగుతాడు. జ్యోత్స్న గురించి తమకు తెలియదని మాలిని చెప్తుంది. ఇంతలో ఇవాళ్టీ కార్తీకదీపం2 ఏపిసోడ్ అయిపోతుంది.