E-Paper
Advertisement

తిరుమలలో భక్తుల కష్టాలకు చెక్.. ఇక మీ వెంట వెంకటాద్రి, ఇంకెందుకు ఆలస్యం

తిరుమలలో భక్తుల కష్టాలకు చెక్.. ఇక  మీ వెంట వెంకటాద్రి, ఇంకెందుకు ఆలస్యం
Advertisement

TTD Launches Venkatadri: తిరుమల.. ఈ పేరు చెప్పగానే చాలు.. ప్రతీ రోజూ వేలల్లో భక్తలు ఏడు కొండలకు తరలి వస్తుంటారు. స్వామిని దర్శించుకుంటే పాపాలు పోయి, మంచి కలుగుతుందని నమ్మకం. రోజు రోజూకూ తిరుమలలో భక్తుల రద్దీ అమాంతంగా పెరుగుతోంది. అంతేకాదు అక్కడికి వచ్చినవారు తప్పిపోతున్న సందర్భాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో టీటీడీ ప్రత్యేకంగా వెంకటాద్రి యాప్ తీసుకురావడం, దాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభించడం చకచకా జరిగిపోయింది.

తిరుమలలో భక్తుల కష్టాలకు చెక్

తిరుమలలో భక్తుల కోసం వెంకటాద్రి యాప్‌ అందుబాటులోకి వచ్చేసింది. సీఎం చంద్రబాబు వర్చువల్‌గా ఈ యాప్‌ను ప్రారంభించారు. ఏఐ వాయిస్ అసిస్టెంట్ గల ఈ యాప్ 24 గంటల పాటు భక్తులకు సేవలు అందించనుంది. 25 విభాగాల్లో 350కు పైగా ప్రదేశాల వివరాలు అందులో ఉండనున్నాయి.తెలుగు‌తోపాటు ఐదు భాషల్లో అందుబాటులో ఉంటుంది. తిరుమలకు వచ్చే భక్తులు వెంకటాద్రి సౌకర్యాన్ని ఉపయోగించుకోవాలని సూచన చేస్తోంది టీటీడీ.

భక్తుల వెంట వెంకటాద్రి యాప్

Advertisement

తిరుమల శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తులు చాలామందికి అక్కడి లొకేషన్స్ గురించి పెద్దగా తెలియదు. రూమ్‌లు ఎక్కడ తీసుకోవాలి? దర్శనానికి ఎటువైపు వెళ్లాలి? అన్న ప్రసాదం భవవానికి దారి ఎక్కడో తెలియక ఇబ్బంది పడుతుంటారు. అమెరికాకు చెందిన ఓ ఎన్నారై దాత.. వెంకటాద్రి యాప్ పనితీరును వివరించారు. దీంతో తిరుమలలో అన్ని ప్రదేశాలను సులభంగా తిరగవచ్చు. ఒకవేళ మిస్సయినా ఈ యాప్ ఉంటే చాలు. యాత్రికులు తాగునీటి పాయింట్లు మొదలు, దర్శన ప్రవేశ ద్వారాలను కనుగొనడానికి వాయిస్ కమాండ్‌లను ఉపయోగించవచ్చు.

సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ప్రారంభం

ఈ యాప్ ఆఫ్‌లైన్ నావిగేషన్‌కు మద్దతు ఇస్తుంది. ఇంటర్నెట్ కనెక్టివిటీ పెద్దలేని ప్రాంతాల్లో ఉపయోగించుకోవచ్చు. ముఖ్యంగా తాగునీటి పాయింట్లు, ఆసుపత్రులు, పార్కింగ్ ప్రాంతాలు, పబ్లిక్ టాయిలెట్లు, బస్ స్టాప్‌లు, లగేజీ కేంద్రాలు, ఉచిత పాదరక్షల డిపాజిట్ కేంద్రాలు, గదుల కేటాయింపు కౌంటర్లు, యాత్రికుల సహాయ కేంద్రాలు అందులో ఉంటాయి. అలాగే టీటీడీ సమాచార కేంద్రాలు, ఉప-విచారణ కార్యాలయాలు, కళ్యాణ కట్టలు, పోలీస్ స్టేషన్లు, విజిలెన్స్ కార్యాలయాలు, ఆలయ పరిసరాలు, షాపింగ్ కాంప్లెక్స్‌లు, మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాదం కాంప్లెక్స్ వంటి ఉన్నాయి.

Advertisement

అత్యవసర కాంటాక్ట్‌లు, TTD హెల్ప్‌లైన్‌ను యాక్సెస్ చేయవచ్చు. అంతేకాదు బస్సు రూట్లు, సమయాలను అందులో ఎప్పటికప్పుడు ప్రదర్శిస్తుంది. మార్క్ మై స్పాట్ ఫీచర్ ద్వారా యాత్రికులు.. వారి పార్కింగ్ స్థానం నుంచి మరొక ముఖ్యమైన ప్రదేశాన్ని సేవ్ చేసుకోవడానికి, తిరిగి అక్కడికి నావిగేట్ చేయడానికి వీలు కల్పిస్తుంది. తెలుగు, తమిళం, కన్నడ, హిందీ, ఇంగ్లీష్ అనే ఐదు భాషలలో లభించే వెంకటాద్రి యాప్ ఆపిల్ యాప్ స్టోర్, గూగుల్ ప్లే స్టోర్‌లో లభించనుంది.

ALSO READ: విజయనగరం పైడితల్లి ధ్యాత్మిక సందడి.. సిరిమాను తయారీ ఎలా జరుగుతుందో తెలుసా?

తిరుమల యాత్రికుల ప్రయాణాలను మరింత సులభతరం చేసింది. ఇక స్మార్ట్‌ఫోన్‌లు లేని యాత్రికుల కోసం టీటీడీ ప్రత్యేకంగా కియోస్క్ సదుపాయాన్ని అభివృద్ధి చేస్తోంది. దీనిద్వారా స్వామి దర్శనానికి దోహదపడుతుందని టీటీడీ తెలిపింది. అదనపు కార్యనిర్వహణాధికారి వెంకయ్య చౌదరి, ఎన్నారై పరోపకారి జెపి.. వెంకటాద్రి మొబైల్ యాప్ పని తీరును సీఎం చంద్రబాబుకు వివరించారు. యాత్రికులకు అనుకూలమైన యాప్‌ను అభివృద్ధి చేసినందుకు టీటీడీని అభినందించారు ముఖ్యమంత్రి.

Related News

‘లోకల్’పై కూటమి పార్టీల తర్జనభర్జన.. మంగళవారం మరోసారి భేటీ, తేలకుంటే ఫ్రెండ్లీ పోటీకి అవకాశం

విజయనగరం పైడితల్లి ధ్యాత్మిక సందడి.. సిరిమాను తయారీ ఎలా జరుగుతుందో తెలుసా?

ఏపీ మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్ల జాబితా విడుదల.. పూర్తి జాబితా ఇదే!

తిరుపతికి చంద్రబాబు భారీ వరాలు.. రూ.3,222 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం!

బీసీల ఎదుగుదల జగన్‌కు ఇష్టం లేదు: మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి

మానవ హక్కుల కమిషన్ నియామకాల్లో తొందరెందుకు? చంద్రబాబుకు బొత్స లేఖ

రీల్స్‌తో సోషల్ మీడియాను ఊపేస్తున్న శ్రీకాకుళం చిన్నారి..?

Big Stories

Advertisement
×